For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Nusrat Jahan పండంటి బిడ్డకు జన్మనిచ్చిన బెంగాలీ హీరోయిన్.. భర్తతో విడిపోయిన పరిస్థితుల్లో ప్రసవం!

  |

  బెంగాలీ నటి, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ నుస్రత్ జహాన్ అభిమానులకు, స్నేహితులకు శుభవార్తను అందించారు. గురువారం అంటే ఆగస్టు 25వ తేదీ రోజున తొలిసారి ఓ బిడ్డకు జన్మనిచ్చారు. గత కొద్దికాలంగా దాంపత్య జీవితంలో విభేదాలు నెలకొన్న నేపథ్యంలో నుస్రత్ జహాన్‌కు కొన్ని చిక్కులు వచ్చిపడ్డాయి. ఈ క్రమంలో ఓ చిన్నారికి జన్మనిచ్చి కుటుంబ సభ్యులు, అభిమానులకు శుభవార్తను అందించడం ఊరటగా మారింది. నుస్రత్ జహాన్ వ్యక్తిగత, ప్రొఫెషనల్, రాజకీయ జీవితంలోకి వెళితే..

  Anchor Shyamala చిలిపిగా కవ్విస్తూ.. అందంతో ఆకట్టుకొంటున్న బిగ్‌బాస్ బ్యూటీ

  నటిగా రాణిస్తూనే చిన్న వయసులో రాజకీయాల్లోకి

  నటిగా రాణిస్తూనే చిన్న వయసులో రాజకీయాల్లోకి

  బెంగాల్‌ సినీ పరిశ్రమలోకి 2011లో శోత్రూ మూవీతో నుస్రత్ జహాన్ అడుగుపెట్టారు. కొద్ది కాలంలోనే నటిగా మంచి పాపులారిటీని సంపాదించుకొన్న ఆమె చిన్న వయసులోనే తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ పిలుపు మేరకు రాజకీయాల్లోప్రవేశించారు. పశ్చిమ బెంగాల్‌లోని బసిర్హత్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఎంపికైన ఆమె పార్లమెంట్‌లో మోస్ట్ గ్లామరస్ ఎంపీగా ఓ ఘనతను సొంతం చేసుకొన్నారు.

  Anita Hassanandani: పెళ్ళయి పిల్లాడున్నా తగ్గని నువ్వు నేను హీరోయిన్...మాల్దీవుల్లో మత్తెక్కిస్తూ!

   టర్కీలో మతాంతర వివాహం

  టర్కీలో మతాంతర వివాహం

  ఎంపీగా, నటిగా కొనసాగుతూనే వ్యాపారవేత్త నిఖిల్ జైన్‌తో ప్రేమలో పడ్డారు. ఎవరూ ఊహించని విధంగా వ్యాపారవేత్త నిఖిల్ జైన్‌ను 2019లో డెస్టినేషన్ వెడ్డింగ్‌గా టర్కీలో మతాంతర వివాహం చేసుకొన్నారు. కానీ జూన్ 9వ తేదీన భర్తతో విడిపోయినట్టు షాకింగ్‌గా నుస్రత్ జహాన్ విషయాన్ని తెలియచేశారు. చాలా రోజుల క్రితమే మేమిద్దరం విడిపోయాం. నా వ్యక్తిగత విషయం కావడంతో గోప్యంగా ఉంచాను. ఎవరికీ వెల్లడించలేదు అని బసిర్హత్ ఎంపీ, బెంగాల్ హీరోయిన్ నుస్రత్ జహాన్ వెల్లడించారు.

  సహచర నటుడు యష్‌తో డేటింగ్

  సహచర నటుడు యష్‌తో డేటింగ్

  అయితే భర్తతో విడిపోవడానికి కారణం బెంగాలీ హీరోతో ప్రేమలో పడటమే అనే వార్త మీడియాలో బలంగా వినిపించింది. సహచర నటుడు యష్ దాస్ గుప్తా డేటింగ్ చేయడం హాట్ టాపిక్‌గా మారింది. భర్తతో విడిపోయిన తర్వాత తన సహచర నటితో దిగిన ఫోటోలో కడుపు ఉబ్బెత్తుగా కనిపించడంతో గర్బవతి అనే విషయం వెలుగులోకి వచ్చింది. ఆ సమయంలో ఆమె తన ప్రెగ్నెన్సీపై సానుకూలంగా స్పందించడంతో ఆ వార్తలకు తెరపడ్డాయి.

  ఆగస్టు 26వ తేదీన ప్రసవం

  ఆగస్టు 26వ తేదీన ప్రసవం

  ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో ఎంపీ, నటి నుస్రత్ జహాన్ కాన్పు కోసం ఆగస్టు 25వ తేదీన కోల్‌కోతాలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌లో చేరారు. వాస్తవానికి సెప్టెంబర్ తొలివారం డెలీవరి డేట్ ఉన్నప్పటికీ ఆమె కొద్ది రోజులు ముందుగానే ఆగస్టు 26వ తేదీ ఉదయం మగ బిడ్డకు జన్మనిచ్చింది.

  Prabhas పై పెరుగుతున్న అక్కసు.. అప్పుడు రజినీ ఇప్పుడు డార్లింగ్ | Pan India || Filmibeat Telugu
  క్షేమంగా నుస్రత్, చిన్నారి... అంటూ

  క్షేమంగా నుస్రత్, చిన్నారి... అంటూ

  నుస్రత్ జహాన్ కోల్‌కతా హాస్పిటల్‌లో మగబిడ్డకు జన్మనిచ్చినట్టు కుటుంబ సభ్యులు, స్నేహితులు ధృవీకరించారు. అయితే ఆమె అధికారికంగా తన సోషల్ మీడియాలో ప్రకటించే క్షణాల కోసం అభిమానులు, శ్రేయోభిలాషులు ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం నుస్రత్, పండంటి బిడ్డ క్షేమంగా ఉన్నారని తెలిసింది. మరిన్నీ వివరాల కోసం ఫిల్మీబీట్‌ తెలుగును ఫాలో అవ్వండి.

  English summary
  Actor and Trinamool Congress Mp Nusrat Jahan given birth to Baby boy in Kolkata hospital. Reports suggested that She and Baby boy are doing fine.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X