లవర్‌తో కలిసి రెచ్చిపోయిన పాయల్:. అడ్డంగా బుక్కైన హీరోయిన్

అందానికి అందం.. నటనకు నటన ఉన్న హీరోయిన్లు టాలీవుడ్‌లో చాలా తక్కువ మందే ఉన్నారు. అలాంటి వారిలో పంజాబీ బ్యూటీ పాయల్ రాజ్‌పుత్ ఒకరు. RX100 అనే సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీకి పరిచయం అయిన ఈ బ్యూటీ.. ఫస్ట్ మూవీతోనే అందరి దృష్టిని ఆకర్షించింది. అదే సమయంలో వరుస ఆఫర్లను అందుకుంటూ దూసుకెళ్తోంది. కెరీర్ పరంగా ఎలా ఉన్నా.. పర్సనల్ లైఫ్‌ను మాత్రం ప్రియుడితో తెగ ఎంజాయ్ చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా బెడ్‌రూంలో అతడితో కలిసి రెచ్చిపోయింది. దానికి సంబంధించిన ఫొటో తాజాగా వైరల్ అవుతోంది. వివరాల్లోకి వెళ్తే....

అలా మొదలైన కెరీర్.. ఇక్కడ ఫేమస్

అలా మొదలైన కెరీర్.. ఇక్కడ ఫేమస్

పంజాబీతో సినిమాతో హీరోయిన్‌గా కెరీర్‌ను ఆరంభించింది పాయల్ రాజ్‌పుత్. ఆ తర్వాత పలు భాషల్లో కొన్ని సినిమాల్లో నటించింది. ఈ క్రమంలోనే 'RX 100' సినిమాతో తెలుగులోకి హీరోయిన్‌గా పరిచయం అయింది. ఆ తర్వాత 'RDX లవ్', 'వెంకీ మామ', 'డిస్కో రాజా' వంటి పలు సినిమాల్లో నటించింది. వీటన్నింట్లోనూ టాలెంట్, గ్లామర్‌తో మెప్పించి వరుసగా ఆఫర్లను అందుకుంటోంది.

అన్నింట్లోనూ ఉంటూ.. బిజీ అయింది

అన్నింట్లోనూ ఉంటూ.. బిజీ అయింది

తెలుగు సినీ ఇండస్ట్రీలోకి హీరోయిన్‌గా పరిచయం అయిన పాయల్ రాజ్‌పుత్.. కెరీర్‌ను జయాపజయాలతో సాఫీగానే ముందుకు తీసుకెళ్తోంది. ఈ క్రమంలోనే వెబ్ సిరీస్‌లలో నటించడంతో పాటు స్పెషల్ సాంగ్స్‌ను కూడా ఒప్పుకుంటోంది. తద్వారా చేతి నిండా సినిమాలతో ఫుల్ బిజీగా గడుపుతోంది. కేవలం తెలుగులోనే కాదు.. మిగిలిన భాషల్లోనూ సినిమాలు చేస్తూ సత్తా చాటుతోంది.

ప్రియుడి వివరాలు లీక్ చేసిన బ్యూటీ

ప్రియుడి వివరాలు లీక్ చేసిన బ్యూటీ

చేతి నిండా సినిమాలతో ఫుల్ బిజీగా గడుపుతోన్న పాయల్ రాజ్‌పుత్.. వ్యక్తిగత జీవితాన్ని కూడా యమ ఎంజాయ్ చేస్తోంది. ఈ క్రమంలోనే కొద్ది రోజుల క్రితం తన లవర్ పేరు సౌరబ్ డింగ్రా అని, అతడి ఫొటోను కూడా సోషల్ మీడియా ద్వారా రివీల్ చేసింది. అంతేకాదు, ఈ మధ్య తరచూ అతడితో దిగుతోన్న ఫొటోలను, కలిసున్న వీడియోలను షేర్ చేస్తూ సంతోషాన్ని పంచుకుంటోంది.

కాబోయే అత్తను కోల్పోయిన పాయల్

కాబోయే అత్తను కోల్పోయిన పాయల్

కరోనా వైరస్ రెండో దశ ప్రతి ఒక్కరి జీవితాలపై తీవ్ర స్థాయిలో ప్రభావాన్ని చూపించింది. అందులో సినీ ప్రముఖులు కూడా చాలా మంది దీని బాధితులుగా మిగిలిపోయారు. అందులో పాయల్ రాజ్‌పుత్ కూడా ఒకరు. ఆమె లవర్ సౌరబ్ డింగ్రా తల్లి కొద్ది రోజుల క్రితం కోవిడ్ బారిన పడి ప్రాణాలను కోల్పోయారు. ఆ సమయంలో ఈ హీరోయిన్ తన బాధనంతా ఫ్యాన్స్‌తో పంచుకుంది.

అందులో ఎప్పుడూ బిజీగానే ఉంటూ

అందులో ఎప్పుడూ బిజీగానే ఉంటూ

పాయల్ రాజ్‌పుత్ సోషల్ మీడియాలో ఎంతో బిజీగా ఉంటుందన్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తరచూ తన ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తూ రచ్చ చేసే ఈ బ్యూటీ ఫాలోయింగ్‌ను రోజు రోజుకూ పెంచుకుంటోంది. అదే సమయంలో తనకు తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంటోంది. తద్వారా నిత్యం ఈ అమ్మడు వార్తల్లో నిలుస్తూనే ఉంటోంది.

లవర్‌తో కలిసి రెచ్చిపోయిన పాయల్

లవర్‌తో కలిసి రెచ్చిపోయిన పాయల్

పాయల్ రాజ్‌పుత్ ఎక్కడికి వెళ్లినా సౌరబ్ డింగ్రా కూడా అక్కడ కనిపిస్తుంటాడు. ఏ భాషలో షూటింగ్ ఉన్నా.. అక్కడకు ఆమెను తీసుకెళ్లి చిత్రీకరణ అయ్యే వరకూ ఉంటాడు. ఇలా పెళ్లికి ముందే వీళ్లిద్దరూ కలసి ఉంటున్నారు. ఈ విషయం ఆమెను ఫాలో అయ్యే వారికి తెలుసు. అంతలా నిత్యం ప్రియుడుతోనే కాలాన్ని గడుపుతోంది. ఈ క్రమంలోనే మరోసారి అతడితో కలిసి రెచ్చిపోయింది.

Recommended Video

Bigg Boss Telugu Season 5 Update: Payal Rajput In BiggBoss 5 Telugu ? | Filmibeat Telugu
ఏకంగా బెడ్‌రూంలో అలాంటి పని చేసి

ఏకంగా బెడ్‌రూంలో అలాంటి పని చేసి

పాయల్ రాజ్‌పుత్ తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ ఫొటోను స్టోరీగా పెట్టుకుంది. అందులో ఆమె పాదం కనిపిస్తోంది. తీక్షణంగా చూస్తే అందులో మరో పాదం కూడా ఉంది. అది సౌరభ్ డింగ్రాదే. అవును ప్రస్తుతం కలిసే ఉంటోన్న వీళ్లిద్దరూ బెడ్‌రూంలో అలా ఆటలాడుతున్నారు. ఈ ఫొటో షేర్ చేసిన పాయల్ అడ్డంగా దొరికిపోయింది. దీంతో ఈ పిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X