Don't Miss!
- News
‘భారత వ్యతిరేకి’ ఇల్హాన్ ఒమర్ శక్తివంతమైన యూఎస్ ఫారెన్ ఎఫైర్స్ ప్యానెల్ నుంచి ఔట్
- Lifestyle
లేడీస్ బి అలర్ట్! మీ బాయ్‌ఫ్రెండ్‌కు ఈ లక్షణాలు ఉంటే మీరు అతని పట్ల జాగ్రత్తగా ఉండాల్సిందే...!
- Finance
vodafone idea: బకాయిలను ఆ విధంగా కట్టమని వొడాఫోన్ ఐడియాకు ఆదేశం..
- Technology
ఒప్పో రెనో8 T 5G ఫస్ట్ లుక్: పవర్ ఫుల్ ఫీచర్లతో సెగ్మెంట్ లో బెస్ట్ ఫోన్
- Sports
విహారీ.. ఇది రివర్స్ స్వీప్ కాదు.. రివర్స్ స్లాప్: దినేశ్ కార్తీక్
- Travel
ఏపీలో ఆధ్యాత్మిక పర్యాటకానికి టూరిజం శాఖ సరికొత్త రూట్ మ్యాప్!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
Pooja Hegde..అల్లు అరవింద్ నాకు అలాంటి మెసేజ్.. భయపడుతూ ఆ మెసేజ్‌ను చదివాను అంటూ
అక్కినేని అఖిల్, పూజా హెగ్డే జంటగా నటించిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచలర్ చిత్రం అక్టోబర్ 15వ తేదీన రిలీజ్ కానున్నది. జీఏ2 పిక్చర్స్ బ్యానర్‌పై బన్నీ వాసు, వాసు వర్మ ఈ చిత్రాన్ని నిర్మించారు. అల్లు అరవింద్ సమర్ఫణలో రూపొందిన ఈ చిత్రానికి బొమ్మరిల్లు భాస్కర్ దర్శకుడిగా వ్యవహరించారు. ఈ సినిమా ప్రమోషనల్‌లో భాగంగా హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ సినిమా ఈవెంట్‌లో పూజా హెగ్గే మాట్లాడుతూ..

పలు రకాల షేడ్స్ ఉన్న రోల్
మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ సినిమా నా జీవితంలో ఒక స్పెషల్ మూవీ. నా ప్రతిభను చాటుకోవడానికి స్కోప్ ఉన్న సినిమా అని భావిస్తున్నాను. నా కోసం మంచి పాత్రను రాసిన బొమ్మరిల్లు భాస్కర్‌కు ధన్యవాదాలు. రకరకాల షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించే అవకాశం లభించింది. ప్రతీ ఒక్కరిని నా పాత్ర మెప్పిస్తుంది. నా కారెక్టర్ చాలా క్లిష్టమైనది. లహరాయే పాటను నేను చాలా సార్లు విన్నాను. సామజవరగమన పాట తర్వాత నేను ఎక్కువ సార్లు విన్నాను అని పూజా హెగ్డే చెప్పారు.

అల్లు అరవింద్ పంపిన మెసేజ్ గురించి
నాకు ఇష్టమైన నిర్మాతల్లో అల్లు అరవింద్ ఒకరు. నాలుగు రోజుల క్రితం సినిమా షూటింగ్ వెళ్తుంటే అరవింద్ మెసేజ్ చేశారు. నా ఫోన్‌లో నోటిఫికేషన్‌లో అల్లు అరవింద్ పేరు కనిపిస్తే నేను షాక్ అయ్యాను. ఎందుకంటే సాధారణంగా ఆయన ఎవరికి మెసేజ్ చేయరు. దేవుడిని మొక్కుకొని నఆ మెసేజ్‌ను చదివాను. ఆయన నా ఫెర్ఫార్మెన్స్‌ను చాలా మెచ్చుకొన్నారు. దాంతో నాకు చాలా సంతోషం కలిగింది. నాకు సపోర్ట్‌గా నిలిచిన అల్లు అరవింద్‌కు థ్యాంక్స్ అని పూజా హెగ్డే తెలిపారు.

నాగచైతన్య నా హీరో అంటూ
నాగచైతన్య గురించి పూజా హెగ్డే మాట్లాడుతూ.. తెలుగులో నా మొదటి హీరో నాగచైతన్య. నా ప్రయాణం చైతుతో మొదలైంది. ఆ తర్వాత ఆయన కెరీర్ పరంగా ఎంత ఎత్తుకు ఎదిగారో అందరికి తెలుసు. సహ నటుడిగానే కాకుండా చైతూ మంచి మనసు ఉన్న వ్యక్తి. అదే నీలో బలం అని పూజా హెగ్డే అన్నారు.

అఖిల్‌తో నా కెమిస్ట్రీ అలా..
ఇక
అఖిల్‌తో
పనిచేయడం
చాలా
హ్యాపీగా
ఉంది.
ఆయనతో
సెట్‌లో
కంఫర్ట్‌గా
పనిచేశాను.
అందువల్లే
మా
ఇద్దరి
మధ్య
కెమిస్ట్రీ
పండింది.
చాలా
మంది
మా
కెమిస్ట్రీ
గురించి
మెసేజ్
చేసి
అప్రిషియేట్
చేస్తున్నారు.
అందుకు
అఖిల్‌కు
థ్యాంక్స్
చెప్పుకోవాలి
అని
పూజా
హెగ్డే
పేర్కొన్నారు.

మంచి వినోదాన్ని అందిస్తుంది అంటూ..
కరోనావైరస్ సమయంలో అందరూ వినోదానికి దూరమయ్యారు. అలాంటి పరిస్థితుల నుంచి బయటపడటానికి ీ సినిమా వినోద ఔషధంగా ఉపయోగపడుతుంది. ఫ్యామిలీతోపాటు అందరూ చూడదగిన చిత్రం. ఈ సినిమాలో మంచి మెసేజ్ కూడా ఉంది. కాబట్టి థియేటర్‌కు వెళ్లి తప్పకుండా సినిమా చూడండి అని పూజా హెగ్డే రిక్వెస్ట్ చేశారు.