ఆ ఒక్కటి నిజమైతే పూజా హెగ్డేకు అడ్డే ఉండదు.. మరికొన్నాళ్లు నెంబర్ వన్ హీరోయిన్ గా..

టాలీవుడ్ ఇండస్ట్రీలోనే కాకుండా తమిళ్ లో కూడా అగ్ర హీరోయిన్ గా క్రేజ్ అందుకునేందుకు బుట్టబొమ్మ గట్టిగానే ప్రయత్నాలు చేస్తోంది. కెరీర్ మొదట్లో వరుస డిజాస్టర్స్ ఎదుర్కొన్న పూజా హెగ్డే ఆ తరువాత మెల్లగా తన స్టోరీ సెలక్షన్ స్టైల్ ను మార్చుకొని భారీ ఆఫర్స్ ను అందుకుంది. ముఖ్యంగా అల్లు అర్జున్ డీజే సినిమా నుంచి ఈ బ్యూటీ లక్కు చాలానే మారిపోయింది.

ఎలాంటి సినిమా చేసినా కూడా పూజా హెగ్డే బాక్సాఫీస్ వద్ద గోల్డెన్ లెగ్ అని క్రేజ్ అందుకుంటోంది. ఇక ఆమె సినిమాలకు ముఖ్యంగా పాన్ ఇండియా ఆఫర్స్ కూడా గట్టిగానే వస్తున్నాయి. రాధేశ్యామ్ విడుదలకు సిద్దమవుతున్న విషయం తెలిసిందే. ఇక సౌత్ లో ఆమెకు రెండు పెద్ద సినిమాల విజయాలు చాలా కీలకం కానున్నట్లు తెలుస్తోంది. కోలీవుడ్ ఇండస్ట్రీలో విజయ్ కు ఏ రేంజ్ లో ఫ్యాన్స్ ఉన్నారో అదే తరహాలో టాలీవుడ్ లో కూడా పవన్ కళ్యాణ్ కు భారీ స్థాయిలో అభిమానులు ఉన్నారు. వారి సినిమాకు యావరేజ్ టాక్ వచ్చినా కూడా ఒక రేంజ్ లో కలెక్షన్స్ వస్తాయి.

 Pooja hegde big hopes on upcoming projects

ఇక ఇప్పటికే విజయ్ బీస్ట్ సినిమాలో హీరోయిన్ గా సెలెక్ట్ అయిన పూజా హెగ్డే ఇప్పుడు పవన్ కళ్యాణ్ తో కూడా ఛాన్స్ అందుకోనున్నట్లు టాక్ వస్తోంది. హరీష్ శంకర్ దర్శకత్వంలో చేయబోయే సినిమాలో పవన్ కు జోడిగా పూజాకు ఛాన్స్ వచ్చే అవకాశం ఉన్నట్లు గత కొన్ని రోజులుగా అనేక రకాల రూమర్స్ అయితే వస్తున్నాయి. ఒకవేళ అదే నిజమైతే బుట్టబొమ్మకు అడ్డే ఉండదు.

కోలీవుడ్ ఇండస్ట్రీలో విజయ్ , టాలీవుడ్ ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్ లతో హిట్టు కొడితే మరికొన్నాళ్లు సౌత్ లో అగ్ర స్థానంలో ఉండవచ్చు. మరి ఆమె అదృష్టం ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X