twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మొత్తానికి నా చేతిలోకి వచ్చేసింది.. హ్యాకర్స్‌ను బూతులు తిట్టిన పూజా హెగ్డే

    |

    టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే సోషల్ మీడియా అకౌంట్ హ్యాక్ అయిందని అర్దరాత్రి ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ విషయం క్షణాల్లో ట్రెండ్ అయింది. మిలియన్ల ఫాలోవర్స్ ఉన్న పూజా హెగ్డే ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ హ్యాకర్స్ బారిన పడటంతో ఆందోళన చెందింది. ఈ మేరకు తన డిజిటల్ టీమ్‌కు తెలియజేశానని, వారు త్వరలోనే సమస్యను అధిగమిస్తారని చెప్పుకొచ్చింది. ఇక పూజా హెగ్డే అకౌంట్ హ్యాక్ అయిన వార్తలు ఉదయం నుంచి తెగ హల్చల్ చేశాయి.

    సోషల్ మీడియాలో యాక్టివ్..

    సోషల్ మీడియాలో యాక్టివ్..

    పూజా హెగ్డే సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్‌గా ఉంటుంది. సినిమాలతో పాటు వ్యక్తిగత విషయాలను ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పంచుకుంటుంది. ఫ్యామిలీతో సరదగా గడిపిన క్షణాలకు సంబంధించిన వీడియోలను షేర్ చేస్తూ ఉంటుంది. అలాంటిది ఆ ఖాతా హ్యాక్ అవ్వడంతో వెను వెంటనే అప్రమత్తమైంది.

    స్పందించకండి..

    స్పందించకండి..

    ఇక తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ నుంచి ఎలాంటి మెస్సేజ్ లు వచ్చినా సమాధానం ఇవ్వకండని అభిమానులను హెచ్చరించింది. ఏమైనా ఇన్విటేషన్స్ పంపించినా కూడా యాక్సెప్ట్ చేయకండని వేడుకుంది. మీ వ్యక్తిగత సమాచారాన్ని కూడా చెప్పవద్దని ఫాలోవర్స్‌కు తెలిపింది.

    వెనువెంటనే మరో ట్వీట్..

    వెనువెంటనే మరో ట్వీట్..


    అయితే తన డిజిటల్ టీమ్ ఎంతో చాకచక్యంగా వ్యవహరించిందని పూజా చెప్పుకొచ్చింది. వెంటనే స్పందించిన తన టీమ్.. హ్యాకర్స్ బారి నుంచి కాపాడారని తెలిపింది. ఈ మేరకు మరో ట్వీట్ చేస్తూ.. తన ఖాతా మళ్లీ తన చేతిలోకి వచ్చిందని ప్రకటించింది.

    యూ విల్ సక్..

    యూ విల్ సక్..

    ఈ మేరకు తన ఖాతా తన చేతిలో భద్రంగా ఉందని చెబుతూ.. హ్యాకర్స్‌పై విరుచుకుపడింది. యూ విల్ సక్ హ్యాకర్స్, హ్యాకర్స్ గెట్ ఏ లైఫ్, ఫస్ట్ వరల్డ్ ప్రాబ్లమ్ అంటూ వారిపై కోపాన్ని ప్రదర్శించింది. ఇంతకు ముందు చేసిన మెసేజ్‌లు ఏవైనా ఉంటే వాటిని డిలీట్ చేస్తానని పేర్కొంది.

    English summary
    Pooja Hegde Instagram Account Recovered From Hackers. Earlier She Tweeted That Spent the last hour stressing about the safety of my Instagram account. Thanking my technical team for instant help at this hour. Finally, got my hands back on my Instagram
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X