బన్నీకి కరోనా.. అమ్మూకి కంపెనీ ఇవ్వడం కోసమేనా...పూజా హెగ్డే సెటైర్ !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. ఈరోజు మధ్యాహ్నం తాను కరోనా బారిన పడినట్లుగా అల్లు అర్జున్ స్వయంగా ప్రకటించారు. ఈ విషయాన్ని తన సోషల్ మీడియా ఖాతాల ద్వారా వెల్లడించిన ఆయన ప్రస్తుతం తాను ఇంట్లోనే హోం క్వారంటైన్ లో ఉన్నానని తనకు కరోనా సోకిన కారణంగా గత కొద్ది రోజులుగా తనను కలిసిన వారంతా కరోనా టెస్టులు చేయించుకోవాలని కోరారు.. అలాగే తన ఆరోగ్య పరిస్థితి గురించి అభిమానులు, శ్రేయోభిలాషులు ఆందోళన చెందవద్దు అని తాను బాగానే ఉన్నాను అని బన్నీ పేర్కొన్నాడు. అయితే అల్లు అర్జున్ కరోనా సోకింది అన్న విషయం తెలుసుకుని తోటి నటీనటులు త్వరగా కోలుకోవాలని సోషల్ మీడియా వేదికగా కోరుతున్నారు.

కొంటె చూపులతో కవ్విస్తోన్న సమంత (బర్త్‌డే స్పెషల్ ఫొటోలు)

అయితే నటి పూజా హెగ్డే మాత్రం ఆసక్తికరంగా స్పందించి వార్తల్లో నిలిచారు. నిజానికి పూజా హెగ్డేకి కూడా కరోనా పాజిటివ్ వచ్చింది. ప్రస్తుతానికి ఆమె కూడా ముంబైలోని తన ఇంట్లో క్వారంటైన్ లోనే ఉంది.. ఈ నేపథ్యంలో బన్నీకి కూడా కరోనా సోకడంతో పూజా హెగ్డే ఆసక్తికరంగా స్పందించింది. గత ఏడాది రిలీజ్ అయ్యి సూపర్ హిట్ గా నిలిచిన అల వైకుంఠపురంలో ఈ ఇద్దరు కలిసి నటించిన సంగతి తెలిసిందే. ఆ సినిమాలో పాత్రలను సంబోధిస్తూ బంటు, అమూల్యకు కంపెనీ ఇచ్చేందుకు వచ్చినట్టున్నాడు, అల్లు అర్జున్ టేక్ కేర్, నీకు నేను కొంచెం శక్తి, కోలుకునే పవర్ పంపిస్తా అని పేర్కొంది. అలానే త్వరలోనే కోలుకుంటావులే అంటూ ట్వీట్ చేసింది.

Pooja Hegde’s intrestig Reply To Allu Arjun’s COVID Tweet

ఆమె చేసిన ట్వీట్ మీద బన్నీ ఫాన్స్ అలాగే ఇతర నెటిజన్లు ఆసక్తికరంగా స్పందిస్తున్నారు. అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పుష్ప అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో ఆయన పుష్పరాజ్ అనే లారీ డ్రైవర్ పాత్రలో నటిస్తున్నాడు. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ వికారాబాద్ అడవుల్లో జరుగుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X