For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Poonam Kaur Marriage: సీక్రెట్‌గా తెలుగు హీరోయిన్ పెళ్లి.. అందుకే చేసుకున్నా అంటూ క్లారిటీ

  |

  తెలుగు సినీ ఇండస్ట్రీలో లోకల్ అమ్మాయిలు చాలా తక్కువగానే వస్తున్నారు. అలా చాలా రోజుల క్రితమే టాలీవుడ్‌లోకి అడుగు పెట్టిన బ్యూటీ పూనమ్ కౌర్. అందం, అభినయం చేసినా ఈ భామ చాలా కాలంగా పెద్దగా అవకాశాలను మాత్రం అందుకోలేక సతమతం అవుతోంది. అయితేనేం సోషల్ మీడియాలో పోస్టుల వల్ల తరచూ వార్తల్లో నిలుస్తూనే ఉంటోంది. ఇందులో భాగంగానే రెండు రోజుల క్రితమే ఈమె చేసిన ఓ పోస్ట్ కారణంగా సీక్రెట్ ఈ బ్యూటీ పెళ్లి చేసుకుందని ప్రచారం మొదలైంది. ఈ నేపథ్యంలో తాజాగా పూనమ్ కౌర్ దీనిపై క్లారిటీ ఇచ్చింది. ఆ వివరాలు మీకోసం!

  అలా పరిచయం.. ఫుల్ పాపులర్

  అలా పరిచయం.. ఫుల్ పాపులర్

  హైదరాబాద్‌కు చెందిన పూనమ్ కౌర్ మోడలింగ్ రంగంలో తనదైన అందచందాలతో రాణించింది. ఈ క్రమంలోనే శ్రీకాంత్ నటించిన 'మాయాజాలం' అనే చిత్రంతో హీరోయిన్‌గా ప్రయాణాన్ని మొదలు పెట్టింది. దీని తర్వాత ఈ సుందరాంగి ఎన్నో సినిమాల్లో నటించింది. తద్వారా తెలుగు రాష్ట్రాల్లో ఫుల్ పాపులర్ అయింది. దీంతో ఆమెకు అవకాశాలు కూడా భారీగానే వచ్చాయి.

  పైన ఏమీ లేకుండా సోనాల్ చౌహాన్ హాట్ షో: బాత్రూంలో అలా చూపిస్తూ!

  అన్ని చోట్లా లక్ చెక్ చేసుకుని

  అన్ని చోట్లా లక్ చెక్ చేసుకుని

  పూనమ్ కౌర్ మొదట టాలీవుడ్‌లోకే అడుగు పెట్టింది. ఆ తర్వాత 'నెంజీరుక్కుమ్ వరాయి' అనే చిత్రంతో తమిళంలోకి కూడా ప్రవేశించింది. అలా చాలా కాలం పాటు దక్షిణాదిలోని అన్ని భాషల్లో నటించింది. కానీ, ఆమెకు ఎక్కడా లక్ చిక్కలేదు. అదే సమయంలో క్యారెక్టర్ ఆర్టిస్టుగానూ ట్రై చేసింది. కానీ, సక్సెస్ కాలేదు. దీంతో బుల్లితెరపైకి ఎంట్రీ ఇచ్చి సీరియళ్లలోనూ చేసింది.

  సోషల్ మీడియాలో యాక్టివ్‌గానే

  సోషల్ మీడియాలో యాక్టివ్‌గానే

  సినిమా అవకాశాలు సన్నగిల్లడంతో టాలీవుడ్ హీరోయిన్ పూనమ్ కౌర్.. సోషల్ మీడియాలో యమ యాక్టివ్‌గా ఉంటోంది. తరచూ తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన అంశాలతో పాటు సమాజంలో జరుగుతున్న వ్యవహారాలపై స్పందిస్తోంది. ఈ క్రమంలోనే ఎన్నో ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తోంది. దీంతో పూనమ్‌ను ఫాలో అయ్యే వారి సంఖ్య గణనీయంగా పెరిగిపోతోంది.

  బ్రా తీసేసి అషు రెడ్డి అందాల ఆరబోత: పవన్ కోసం మరోసారి దారుణంగా!

  వివాదాలతో సావాసం చేస్తోంది

  వివాదాలతో సావాసం చేస్తోంది

  సోషల్ మీడియాలో సుదీర్ఘ కాలంగా యాక్టివ్‌గా ఉంటోన్న పూనమ్ కౌర్.. గతంలో కాస్టింగ్ కౌచ్‌పై సంచలన పోస్టులు చేయడం, టాలీవుడ్‌లోని ఓ స్టార్ హీరోపై కామెంట్లు చేయడం వంటివి చేసి ఎన్నో వివాదాల్లో చిక్కుకుంది. దీంతో ఈ బ్యూటీపై చాలా సార్లు విమర్శలు కూడా వెల్లువెత్తాయి. అయినప్పటికీ పూనమ్ కౌర్ మాత్రం ఏమాత్రం వెనక్కి తగ్గకుండా డేర్‌గా దూసుకుపోతోంది.

  ఆ పండుగను జరుపుకోవడంతో

  ఆ పండుగను జరుపుకోవడంతో

  రెండు రోజుల క్రితమే కర్వా చౌత్ పండుగ జరిగిన విషయం తెలిసిందే. దీని ప్రకారం.. పెళ్లైన లేదా పెళ్లి కాబోతున్న అమ్మాయిలు తమ భర్త లేదా కాబోయే వాడి కోసం పూజ చేసి జల్లెడలో చంద్రుడి వైపు చూస్తారు. ఆ తర్వాత తమ పార్ట్‌నర్‌ ముఖాన్ని చూస్తారు. దీన్ని పూనమ్ కౌర్ కూడా సెలెబ్రేట్ చేసుకుంది. దీంతో ఆమెకు సీక్రెట్‌గా పెళ్లి జరిగిందన్న ప్రచారం మొదలైంది.

  తల్లైనా తగ్గని హీరోయిన్ ప్రణిత: ఎద భాగాలు కనిపించేలా హాట్ షో

  పెళ్లి వార్తలపై స్పందించింది

  పెళ్లి వార్తలపై స్పందించింది

  తనకు పెళ్లి అయినట్లు వస్తున్న వార్తలపై పూనమ్ కౌర్ సోషల్ మీడియా వేదికగా స్పందించింది. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో కొన్ని స్క్రీన్‌షాట్లను షేర్ చేసిన ఈ బ్యూటీ 'ఈ కథనాలు రాజకీయంగా ప్రచారంలోకి వచ్చాయో లేక మిషనరీ ఆలోచనా విధానంతో వచ్చాయో నాకు అర్థం కావడం లేదు' అంటూ పండుగ వెనక ఉన్న అపోహల గురించి ప్రస్తావించింది.

  అందుకే చేసుకున్నా అంటూ

  అందుకే చేసుకున్నా అంటూ

  పూనమ్ కౌర్ ఇందులో మరింతగా స్పందిస్తూ.. 'కర్వా చౌత్ పండుగను పెళ్లి కాని అమ్మాయిలు కూడా జరుపుకోవచ్చు. తమకు కాబోయే భర్త మంచివాడు రావాలని పూజ చేసుకోవచ్చు. పెళ్లైన వాళ్లు చంద్రుడిని చూస్తే.. పెళ్లి కాని వాళ్లు నక్షత్రాలను చూస్తారు. అలాగే, మహాశివుడిని కూడా పూజిస్తారు. ఓం నమ శివాయ:' అంటూ ఆమె చెప్పింది. దీంతో ఆ వార్తలకు పుల్‌స్టాప్ పడింది.

  English summary
  Telugu Actress Poonam Kaur Recently Celebrated karwa chauth Festival. Now She Gave Clarity on This and Her Marriage.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X