For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  సీక్రెట్ ప్లేస్‌లో టాటూ: గుర్తుండిపోయేలా పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పిన పూనమ్ కౌర్.!

  By Manoj
  |

  'మాయాజాలం' అనే సినిమా ద్వారా తెలుగు సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది పూనమ్ కౌర్. మోడలింగ్ రంగంలో రాణించి ఫిల్మ్ మేకర్ల దృష్టిలో పడిన ఈమె.. ఎన్నో అవకాశాలను దక్కించుకుంది. అయితే, అవేమీ ఆమెను నిలబెట్టడంలో ఉపయోగపడలేదు. అందం, అభినయం ఉన్నా సరైన గుర్తింపును దక్కించుకోలేకపోయింది. దీంతో అవకాశాలు లేక ఇబ్బందులు పడుతోంది. సినిమాల పరంగా దూరంగా ఉన్నప్పటికీ తరచూ ఏదో ఒక విధంగా వార్తల్లో నిలుస్తోన్న ఈ అమ్మడు.. తాజాగా తన శరీరంపై ఉన్న ఓ టాటూను రివీల్ చేసి షాకిచ్చింది. ఇంతకీ ఏంటా టాటూ.? వివరాల్లోకి వెళితే...

  అన్ని చోట్లా లక్ చెక్ చేసుకుంది

  అన్ని చోట్లా లక్ చెక్ చేసుకుంది

  పూనమ్ కౌర్ మొదట టాలీవుడ్‌లోకే అడుగు పెట్టింది. శ్రీకాంత్ నటించిన ‘మాయాజాలం' సినిమాతో కెరీర్ ఆరంభించిన ఈ బ్యూటీ.. ఆ తర్వాత దక్షిణాదిలోని అన్ని భాషల్లో నటించింది. కానీ, ఆమెకు ఎక్కడా లక్ చిక్కలేదు. అదే సమయంలో క్యారెక్టర్ ఆర్టిస్టుగానూ ట్రై చేసింది. అంతేకాదు, ‘స్వర్ణఖడ్గం' అనే సీరియల్ ద్వారా బుల్లితెరపైనా ఎంట్రీ ఇచ్చింది.

   అక్కడ మాత్రం అమ్మడు ఫుల్ బిజీ

  అక్కడ మాత్రం అమ్మడు ఫుల్ బిజీ

  సినిమా అవకాశాలు సన్నగిల్లడంతో పూనమ్ కౌర్.. సోషల్ మీడియాలో యమ యాక్టివ్‌గా ఉంటోంది. తరచూ తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన అంశాలతో పాటు సమాజంలో జరుగుతున్న వ్యవహారాలపై స్పందిస్తోంది. ఈ క్రమంలోనే ఎన్నో ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తోంది. దీంతో పూనమ్‌ను ఫాలో అయ్యే వారి సంఖ్య గణనీయంగా పెరిగిపోతోంది.

  తెలుగు నిర్మాతపై సంచలన ఆరోపణలు

  తెలుగు నిర్మాతపై సంచలన ఆరోపణలు

  కొద్ది నెలల క్రితం పూనమ్ కౌర్ కాస్టింగ్ కౌచ్ గురించి స్పందించిన విషయం తెలిసిందే. ఆ సమయంలో ఓ తెలుగు నిర్మాతపై ఆమె సంచలన ఆరోపణలు చేసింది. సదరు నిర్మాత తన ఇంటికి వచ్చాడని, తన సినిమాలో ప్రముఖ హీరో పక్కన అవకాశం కల్పిస్తానని హామీ ఇచ్చాడని చెప్పింది. అందుకోసం ఆఫీసుకు వెళ్తే అసభ్యంగా మాట్లాడాడని చెప్పుకొచ్చింది.

  పీకే లవ్ అంటూ షాకిచ్చిన బ్యూటీ

  పీకే లవ్ అంటూ షాకిచ్చిన బ్యూటీ

  రెండేళ్ల క్రితం కృష్ణాష్టమి రోజునే పవన్ కల్యాణ్ పుట్టినరోజు వచ్చింది. ఆరోజున పూనమ్ ‘నా కృష్ణుడి జన్మదినం సందర్భంగా నేను చాలా ప్రేమతో ఓ వీడియోను రెడీ చేశాను. నా హృదయాంతరాల్లోంచి పుట్టిన వీడియో ఇది. దీనిని త్వరలోనే విడుదల చేస్తా' అని పోస్ట్ చేసింది. అంతేకాదు, దీనికి ‘పీకే లవ్' అనే ట్యాగ్ కూడా జోడించింది. అప్పట్లో ఇది హాట్ టాపిక్ అయింది.

  సీక్రెట్ ప్లేస్‌లో టాటూ.. రివీల్ చేసిన పూనమ్

  ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో టాటూల ట్రెండ్ నడుస్తోంది. దీనికి అనుగుణంగానే పూనమ్ కౌర్ కూడా తన శరీరంపై టాటూను వేయించుకుంది. శివుడి ఆయుధమైన త్రిశూలం, ఆయన మెడలోని పామును తన ఎదపై పచ్చబొట్టుగా పొడిపించుకుంది. ఈ మేరకు తన ఫేస్‌బుక్ ఖాతాలో సదరు ఫొటోను షేర్ చేసింది. దీంతో ఈ పిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

   గుర్తుండిపోయేలా పుట్టినరోజు శుభాకాంక్షలు

  గుర్తుండిపోయేలా పుట్టినరోజు శుభాకాంక్షలు

  పూనమ్ కౌర్ తన సీక్రెట్ టాటూను రివీల్ చేయడానికి గల కారణాన్ని కూడా ఆ పోస్టులో వెల్లడించింది. ‘ఈరోజు మా అమ్మ పుట్టినరోజు. హ్యాపీ బర్త్‌డే అమ్మా. నువ్వే నా సర్వస్వం. నా ఎదపై పచ్చబొట్టు పొడిపించుకున్నాను. అందులో ఉన్న త్రిశూలం దుర్గా దేవిని గుర్తు చేస్తుంది. నా దృష్టిలో ప్రతి అమ్మా ఓ దుర్గా దేవే' అని రాసుకొచ్చిందీ హీరోయిన్.

  English summary
  Poonam Kaur appeared in several Telugu film as Nikki And Neeraj, enacting the title role of Nikki and in Souryam, alongside Gopichand and Anushka Shetty. For her performance in the latter, Kaur received a nomination for the Best Supporting Actress Award for 2008.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X