Akhanda: బాలయ్యతో స్పెషల్ పిక్ షేర్ చేసిన ప్రగ్యా జైస్వాల్.. కల నెరవేరింది అంటూ పోస్ట్
క్రిష్ జాగర్లమూడి తెరకెక్కించిన 'గౌతమిపుత్ర శాతకర్ణి' తర్వాత ఒక్కటంటే ఒక్క హిట్‌ను కూడా తన ఖాతాలో వేసుకోలేకపోయారు నటసింహా నందమూరి బాలకృష్ణ. అప్పటి నుంచి వరుస పెట్టి సినిమాల మీద సినిమాలు చేస్తున్నప్పటికీ.. విజయం మాత్రం అందనంత దూరంలోనే ఉంటోంది. దీంతో బాలయ్యతో పాటు ఆయన అభిమానులు తీవ్ర నిరాశలో ఉండిపోయారు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ సారి ఎలాగైనా సక్సెస్‌ను అందుకోవాలి పట్టుదలతో ఉన్నారు. ఇందుకోసం గతంలో తనకు రెండు భారీ విజయాలను అందించిన టాలీవుడ్ బడా డైరెక్టర్ బోయపాటి శ్రీనుతో 'అఖండ' అనే సినిమా చేస్తున్నారు.
'సింహా', 'లెజెండ్' వంటి రెండు భారీ సూపర్ డూపర్ హిట్ల తర్వాత నందమూరి బాలకృష్ణ - బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వస్తున్న చిత్రమే 'అఖండ'. చాలా రోజుల క్రితమే ఈ మూవీ షూటింగ్ మొదలైంది. కానీ, అనివార్య కారణాల వల్ల చిత్రీకరణ ఇది పలుమార్లు వాయిదా పడిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో ఇటీవలే షూటింగ్‌ను పున: ప్రారంభించారు. కొద్ది రోజుల పాటు హైదరాబాద్‌లో ఆ తర్వాత గోవాలో చిత్రీకరణ జరిపారు. ఈ క్రమంలోనే రెండు రోజుల క్రితమే ఓ సాంగ్‌తో టాకీ పార్ట్‌ను పూర్తి చేసుకున్నారు. ఆ వెంటనే పోస్ట్ ప్రొడక్షన్ పనులను సైతం విస్తృతం చేసేశారు.

క్రేజీ కాంబినేషన్‌లో రాబోతున్న 'అఖండ' మూవీ షూటింగ్ పూర్తైన నేపథ్యంలో చిత్ర యూనిట్ స్పెషల్ ఫొటోషూట్లు జరిపించింది. ఈ సందర్భంగా దిగిన ఓ ఫోటోను హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ తాజాగా తన సోషల్ మీడియా ఖాతాల్లో షేర్ చేసింది. ఇందులో బాలయ్య, దర్శకుడు బోయపాటి శ్రీను, నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డితో పాటు పలువురితో దిగిన పిక్‌లను వదిలింది. ఇక, 'అఖండ షూటింగ్ పూర్తైంది. నా కలను నిజం చేసేలా అవకాశాన్ని కల్పించి, ఈ ప్రయాణాన్ని సరదాగా సాగడంలో సహకరించిన బోయపాటి సార్‌కు, బాలయ్య సార్‌కు ధన్యవాదాలు. మా టీమ్ ప్రతిరోజూ ఉత్తమంగా పని చేసింది. ఈ చిత్రానికి పని చేసిన ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్' అంటూ పేర్కొంది.
భారీ బడ్జెట్‌తో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న 'అఖండ' మూవీ నుంచి కొద్ది రోజుల క్రితం టైటిల్ రోర్ వీడియో విడుదలైంది. ఎంతో పవర్‌ఫుల్‌గా ఉన్న ఈ టీజర్‌కు ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన వచ్చింది. ఫలితంగా ఈ వీడియో ఎన్నో రికార్డులను తిరగరాసింది. అంతేకాదు, వేగంగా యాభై మిలియన్లు దాటిన టీజర్‌గా టాలీవుడ్‌లో చరిత్ర సృష్టించింది. సీనియర్ హీరోల జాబితాలో సౌతిండియాలోనే మొదటి స్థానాన్ని అందుకున్నారు. ఇప్పటికీ ఇది అదే స్పందనతో దూసుకుపోతోంది.
'అఖండ'లో నందమూరి బాలకృష్ణ అఘోరాగా, పవర్‌ఫుల్ రైతుగా రెండు పాత్రలు చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన బిజినెస్ కూడా పూర్తైందని తెలుస్తోంది. ఇక, ఈ సినిమాను ద్వారకా క్రియేషన్స్ బ్యానర్‌పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నారు. ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. పూర్ణ నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రను చేస్తోంది. ఫ్యామిలీ హీరోగా పేరొందిన శ్రీకాంత్ ఇందులో విలన్‌గా నటిస్తున్నాడు. థమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీని నవంబర్ 4న విడుదల చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.


Click it and Unblock the Notifications











