Priyanka Chopra పసుపు పచ్చ బికినీలో అదరగొట్టిన ప్రియాంక చోప్రా.. దుబాయ్‌లో అందాల ఆరబోత రచ్చ
గ్లోబల్ ఐకాన్ ప్రియాంక చోప్రా మరోసారి అందాలతో అదరగొట్టింది. వయసు పెరిగినా వెన్నెతరగని అందాల భామ ప్రస్తుతం దుబాయ్‌లో పర్యటిస్తున్నారు. వీకెండ్ వైబ్స్ అంటూ బికినీలో జలకన్యలా మారింది. తన స్నేహితురాళ్లతో కలిసి దుబాయ్ అందాలను ఆస్వాదిస్తున్నది. అయితే ఇటీవల దుబాయ్ పర్యటనలో సముద్ర తీరంలో ప్రియాంక చేసిన రచ్చ సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నది. ప్రియాంక చోప్రా తాజా సోషల్ మీడియా పోస్టు వివరాల్లోకి వెళితే..

మాతృత్వాన్ని ఆస్వాదిస్తూనే ప్రొఫెషనల్‌గా
ప్రియాంక చోప్రా డిసెంబర్ 1, 2018లో తాను ప్రేమించిన సింగర్ నిక్ జోనస్‌ను వివాహం చేసుకొన్నది. సరోగసి పద్దతిలో జనవరి 15వ తేదీ, 2022న బిడ్డకు జన్మనిచ్చారు. గతేడాది పుట్టిని కూతురు కి మల్టీ మేరి చోప్రా జోనస్ నామకరణం చేశారు. తల్లిగా మాతృత్వాన్ని ఆస్వాదిస్తూనే ప్రొఫెషనల్‌గా ముందుకెళ్తున్నారు

నిక్ జోనస్‌తో వివాహ వార్షికోత్సవం
ఇక ప్రియాంక చోప్రా ఇటీవలే నిక్ జోనస్‌తో కలిసి నాలుగో వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకొన్నారు. స్నేహితులు, కుటుంబ సభ్యులతో కలిసి భారీ విందును ఏర్పాటు చేసుకొన్నారు. భర్తతో తన అనుబంధాన్ని గుర్తు చేసుకొన్నారు. ప్రతీ రోజు వ్యక్తిగా నీ బాధ్యతను గుర్తు చేసుకొనే తీరు కారణంగానే నేను అమితంగా ప్రేమిస్తాను. హ్యాపీ యానివర్సిటీ బేబీ అంటూ భర్తపై ప్రియాంక ప్రేమను కురిపించింది.

రెడ్ సీ ఫిల్మ్ ఫెస్టివల్‌లో
ప్రియాంక చోప్రా ప్రస్తుతం జెడ్డా నగరంలో జరుగుతున్న రెడ్ సీ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో పాల్గొనేందుకు రెడీ అయ్యారు. ఈ ఫిల్మోత్సవంలో ఉమెన్ ఇన్ సినిమా అనే అంశంపై తనదైన శైలిలో స్పందించి అందర్నీ ఆకట్టుకొన్నది. ఈ వేడుకలో డిజైనర్ దుస్తులు, నగలు ధరించి అందర్నీ ఆకట్టుకొన్నది. ఈ వేడుకలో ఆమె ప్రత్యేక ఆకర్షణగా మారింది.

పసుపు పచ్చ బికినీలో
రెడ్ సీ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఓ వైపు పాల్గొంటూనే వారాంతంలో తనదైన శైలిలో విహారయాత్రను ఆస్వాదించింది. సముద్రంలో ఓ నావలో ప్రయాణిస్తూ.. దాని డెక్‌పై పసుపు పచ్చ బికినీలో అందాలను యదేచ్ఛగా ఆరబోసింది. ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయగా.. నెటిజన్లు ఆమె గ్లామర్‌కు ఫిదా అయ్యారు.

నడిసంద్రంలో బోటు షికారు
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ప్రియాంక చోప్రా ఫోటోలు నెటిజన్లకు మంచి ట్రీట్‌గా మారాయి. నావ అంచుపై పడుకొని ఆకాశ అందాలను ఆస్వాదించడం, నడి సముద్రంలో బోటు షికారుకు వెళ్లిన వీడియో నెటిజన్లు అమితంగా ఆస్వాదిస్తున్నారు. ఎల్లో రంగు బికినీలో ప్రియాంక చోప్రా తన అందంతో మరోసారి అదరగొట్టింది.


Click it and Unblock the Notifications











