ఉల్లిపొర లాంటి చీరలో ప్రియాంకా అందాల విందు.. మొన్నేమో అలా ఇప్పుడిలా!
విజయ్ దేవరకొండ 'టాక్సీవాలా' సినిమాతో హీరోయిన్‌గా ప్రియాంక జవాల్కర్ తెలుగు తెరకు పరిచయమయింది. అనంతపురంలో పుట్టి పెరిగిన ఈ అమ్మాయి మోడల్‌గా ఎదిగి ఇప్పుడు నటిగా మారింది. ప్రియాంక అనంతపురంలో ఇంజనీరింగ్ పూర్తి చేసింది. ఆ తరువాత హైదరాబాద్‌లో ఫ్యాషన్ క్లాతింగ్ అండ్ టెక్నాలజీ కోర్సు చేసింది. అందుకే ఎప్పటికప్పుడు ఈ భామ అందంతో అందరినీ మైమరపిస్తూ తన వైపు తిప్పుకుంటోంది. తాజాగా ఈ భామ పోస్ట్ చేసిన ఓ ఫోటో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఆ వివరాల్లోకి వెళితే

టాక్సీ వాలా సినిమాతో ఎంట్రీ
విజయ్ దేవరకొండ సరసన టాక్సీ వాలా సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ భామ, టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వడానికి కొన్ని షార్ట్ ఫిలిమ్స్ లో కూడా నటించింది అలా ఆమె నటించిన కలవరమాయే అనే ఒక షార్ట్ ఫిలిం మంచి పేరు తెచ్చుకుంది. ఇక విజయ్ దేవరకొండ టాక్సీ వాలా సినిమా సూపర్ హిట్ అయినా సరే ఈ భామకు అంత త్వరగా అవకాశాలు వచ్చి పడలేదు.

వరుస సినిమాలు
అయితే కాస్త లేట్ అయినా సరే ఈ భామకు వరుస అవకాశాలు వచ్చిపడ్డాయి.. ఇప్పటికే కిరణ్ అబ్బవరం హీరోగా ఎస్ ఆర్ కళ్యాణమండపం అనే సినిమాలో ఆమె హీరోయిన్ గా నటిస్తోంది.. ఈ సినిమా నుంచి చూశాలే కళ్ళారా అనే సాంగ్ ని సిద్ శ్రీరామ్ ఆలపించగా ఇప్పటికే సాంగ్స్ సూపర్ హిట్ అయింది.. ఈ సినిమా కాకుండా ఆమె మరో రెండు సినిమాల్లో కూడా హీరోయిన్ గా నటిస్తోంది.

మరో రెండు సినిమాల్లో
నిర్మాత రాజ్ కందుకూరి కుమారుడు శివ కందుకూరి హీరోగా నటిస్తున్న రెండో సినిమా గమనం అనే సినిమాలో ఈ భామ హీరోయిన్ గా నటిస్తోంది. శ్రియ శరన్ కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో ప్రియాంక జవాల్కర్ హీరోయిన్ గా నటిస్తోంది.. ఇక ఈ సినిమా మాత్రమే కాక ఆమె సత్యదేవ్ హీరోగా నటిస్తున్న తిమ్మరుసు సినిమాలో కూడా హీరోయిన్ గా నటిస్తోంది. అలా మొదటి సినిమా తర్వాత కాస్త గ్యాప్ వచ్చినా సరే వరుస అవకాశాలతో ఈ భామ ముందుకు వెళుతోంది.
Recommended Video
ఉల్లిపొరలాంటి చీరలో
అయితే చేతిలో పెద్దగా సినిమాలు లేకపోయినా ఈ భామ సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్గానే ఉంటుంది. స్వతహాగా ఫ్యాషన్ డిజైనింగ్ స్టూడెంట్ అయిన ఈ భామ ఎప్పటికప్పుడు తనదైన శైలిలో ప్రేక్షకులను అలరిస్తూ ఉంటుంది.. మొన్నటికి మొన్న ఒక స్కర్ట్ తో అలరించిన ఈ భామ ఈరోజు చీరకట్టుతో తన అభిమానుల ముందుకు వచ్చింది. ఉల్లి పొర లాంటి నల్లటి చీరను కట్టుకుని నాభి అందాలు ఆరబోస్తూ ఒక కిటికీ పక్కన నుంచుని ఈ ఫోటోలకు ఫోజులు ఇచ్చింది.. ఇంకేముంది అభిమానులు ఊరుకుంటారా సూపర్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇంకెందుకు మీరు కూడా చూసెయ్యండి మరి.


Click it and Unblock the Notifications











