twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బాలీవుడ్ లో వివక్ష నిజమే - శ్రుతీ హాసన్

    |

    బాలీవుడ్ లో బంధుప్రీతి, మూవీ మాఫియా అంశాలపై ఎడతెగని చర్చ నడుస్తున్న నేపథ్యంలో క్రమంగా అందరూ తమ ఆలోచనలతో పాటూ తమకు ఎదురైన చేదు అనుభవాలను కూడా పంచుకుంటున్నారు. తాజాగా సూపర్ స్టార్ కమల్ హాసన్ తనయ శ్రుతీహాసన్ కూడా బాలీవుడ్ లో తాను ఎదుర్కొన్న పరిస్థితులపై పెదవి విప్పింది.

    లాక్ డౌన్ సమయంలో తన సంగీత కళకు మరింత పదును పెట్టిన శ్రుతి, ఓ పాటను కంపోజ్ చేసి విడుదల చేసేందుకూ సిద్దమయింది. ఈ నేపథ్యంలోనే మీడియాతో ముచ్చటించిన శ్రుతి, ఇటీవలే ఆస్కార్ గ్రహీత ఏఆర్ రెహ్మాన్ చేసిన వ్యాఖ్యలపై తన ఆలోచనలు కూడా పంచుకుంది. రెహ్మాన్ కు అంతర్జాతీయంగా పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి. ఆయన ఎక్కడికి వెళ్లినా అతడిని భారతీయుడిగానే చూస్తారు తప్ప, దక్షిణాది మనిషా, ఉత్తరాది మనిషా అని చూడరని స్పష్టం చేసింది. కానీ, భారత్ లోనే ఈ ప్రాంతీయ వివక్ష ఎక్కవగా ఉందని వెల్లడించింది.

    Racism prevails in Bollywood, Says Sruthi Hassan

    తాను తెలుగు, తమిళ సినిమాలతో బిజీగా ఉంటే, హిందీలో గ్యాప్ వస్తుందని, ఆ మాత్రానికే జనాలు సినిమాల్లో నటించడం మానేశావా అని అడుగుతారని తెలిపింది. బాలీవుడ్ లో నటించకపోతే, ఇక తాము నటించడం మానేసినట్లేనే, తాము నటులం కానేట్టేనా అని సూటిగా ప్రశ్నిస్తోంది. దక్షిణాదికి చెందిన తమ పట్ల వివక్ష ఉందని స్పష్టం చేసింది. కానీ, ఇవన్నీ తన ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయవని, తన మూలాల పట్ల తనకు అత్యంత గౌరవ మర్యాదలు ఉన్నాయని వెల్లడించింది. కానీ, పరిశ్రమలో ఉన్న అంతర్గత వివక్షకు ఫుల్ స్టాప్ పెట్టాల్సిందేనని నొక్కి వక్కాణించింది.

    English summary
    Sruthi Hassan speaks about racism in Bollywood and agrees that there's been internal racism in the industry. She questions that people who dont act in Hindi arent considered actors.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X