Rakhi Sawant విడిపోయాం కానీ 2022 లో బిడ్డను కంటాం.. భర్తతో రాఖీ సావంత్ విడాకుల వ్యవహారంలో ట్విస్టు
సినిమా పరిశ్రమలో విడాకుల జోరు కొనసాగుతున్నది. సమంత, నాగచైతన్య, ధనుష్, ఐశ్వర్య దంపతుల విడిపోయిన వార్తలను ఇంకా మరిచిపోకముందే.. వివాదాస్పద శృంగార నటి రాఖీ సావంత్ తన భర్త రితేష్‌కు విడాకులు ఇవ్వడం ఆశ్చర్యం కలిగించింది. అయితే తన భర్తతో విడిపోయినా.. అతడితో 2022లో బిడ్డను కనేందుకు ప్లాన్ చేసుకొన్నామంటూ ట్విస్టు ఇచ్చింది. రితేష్‌తో విడాకులు వెనుక అసలు ట్విస్టు ఏమిటంటే?

భర్తతో విడిపోవడంపై ఇన్స్‌టాగ్రామ్ పోస్ట్
రితేష్‌ను ప్రేమించి పెళ్లి చేసుకొన్న రాఖీ సావంత్.. ప్రేమికుల రోజుకు ఒక రోజు ముందు అంటే ఫిబ్రవరి 13వ తేదీన తన ఇన్స్‌టాగ్రామ్‌లో విడాకుల వార్తను పోస్ట్ చేసింది. ప్రియమైన అభిమానులు, స్నేహితులు, శ్రేయోభిలాషులకు.. నా భార్త, నేను విడిపోవాలని నిర్ణయించుకొన్నాం. బిగ్‌బాస్‌లోకి వెళ్లిన తర్వాత చాలా విషయాలు తెలిశాయి. ఆ విషయాలు నా కంట్రోల్‌లో లేకపోయాయి. ఆ తర్వాత మా మధ్య నెలకొన్న సమస్యలను పరిష్కరించుకోవడానికి ప్రయత్నించాం. కానీ కుదరలేదు. అందుకే విడివిడిగా మేము జీవితాన్ని కొనసాగించాలని అనుకొంటున్నాం అని పోస్టులో వెల్లడించింది.

విషాదం నుంచి బయటపడి..
వాలంటైన్స్ డేకు ఒక్క రోజు ముందు నా జీవితంలో ఇలాంటి సంఘటన చోటుచేసుకోవడం చాలా విషాదం. మనసుకు కష్టమైన నిర్ణయాన్ని తీసుకోవాల్సి వచ్చింది. రితేష్‌కు అంతా మంచి జరగాలి. ఈ విషాదం నుంచి బయటపడటానికి నేను వర్క్, నా కెరీర్‌పై ఫోకస్ పెడుతాను. నా బాధను అర్ధం చేసుకొనే ప్రతీ ఒక్కరికి నా ధన్యవాదాలు అంటూ పోస్టులో తెలిపింది.

భర్త మొదటి భార్య కేసుతో
గతేడాది రాఖీ సావంత్, తన భర్త రితేష్‌తో కలిసి బిగ్‌బాస్ 15లో పాల్గొన్నది. ఆ షోలో వెళ్లిన తర్వాత రితేష్ మొదటి భార్య వేసిన కేసు, మరి కొన్ని విషయాలు తెలియడంతో ఆ ఇద్దరి మధ్య గొడవలు, వాగ్వాదాలు చోటుచేసుకొన్నాయి. అయితే ఇక తమ మధ్య చోటుచేసుకొన్న వ్యవహారాలు పరిష్కరించుకొనే అవకాశం లేకపోవడంతో విడిపోవాలని నిర్ణయించుకొన్నామని తాజా ఇంటర్వ్యూలో రాఖీ సావంత్ తెలిపింది.

న్యాయపరమైన చిక్కుల్లో రాఖీ సావంత్ భర్త
అయితే రాఖీ సావంత్ భర్త రితేష్‌కు ఇంతకు ముందే స్నిగ్ధ ప్రియతో వివాహం జరిగింది. అయితే మొదటి భార్యకు విడాకులు ఇవ్వకపోవడంతో న్యాయపరమైన చిక్కులు ఏర్పడ్డాయి. అందుకే భర్త రితేష్ నుంచి విడిపోవాలని నిర్ణయం తీసుకొన్నాను. ఆ క్రమంలోనే రితేష్ ఇంటి నుంచి బయటకు వచ్చాను. రితేష్‌కు దూరం ఉండేందుకు ప్రయత్నిస్తాను అని రాఖీ సావంత్ చెప్పింది.

2022లో బిడ్డను కనాలని ప్లాన్ చేసుకొన్నాం
తన భర్త రితేష్‌తో విడిపోయినప్పటికీ. మా మధ్య మంచి రిలేషన్ ఉంది. మొదటి భార్యతో విడాకులు తీసుకొంటే.. అధికారికంగా మేమిద్దరం కలిసి జీవించడానికి అవకాశం ఉంటుంది. మేమిద్దరం 2022లో ఓ బిడ్డను కనాలని నిర్ణయించుకొన్నాం. అప్పటి లోగా రితేష్ తన మొదటి భార్యతో న్యాయపరమైన వివాదాన్ని పరిష్కరించుకొంటే.. మళ్లీ కలుస్తాం. అతడు సొంతంగా కారు, ఇల్లు ఉంటే అతడితోనే కలుస్తాను అని రాఖీ సావంత్ చెప్పింది.


Click it and Unblock the Notifications











