Just In
Don't Miss!
- News
శివమొగ్గలో భారీ పేలుడు: 15 మంది మృతి?, భూమి కంపించడంతో భయంతో జనం పరుగులు
- Finance
తగ్గిన బంగారం ధర, పెరిగిన వెండి ధర: రూ.50,000 దిగువనే బంగారం
- Sports
సొంతగడ్డపై భారత్‌ను ఓడించడం కష్టమే: జోరూట్
- Automobiles
ఉత్పత్తిలో '100 మిలియన్' రికార్డ్ కైవసం : హీరోమోటోకార్ప్
- Lifestyle
Happy Republic Day 2021 :మనందరికీ ప్రేరణనిచ్చే ఈ మెసెజెస్ తో ‘రిపబ్లిక్ డే’ విషెస్ చెప్పండిలా...
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
హైద్రాబాద్ పోలీసులపై రకుల్ ప్రశంసలు.. వీడియో వైరల్
కరోనా లాంటి కష్టకాలంలో ప్రాణాలకు తెగించి పోలీసులు, వైద్యులు విధులు నిర్వహించారు. నిర్వహిస్తూనే ఉన్నారు. అయితే కరోనాకు ఎవ్వరూ మినహాయింపు కాదు. పోలీసు, వైద్య సిబ్బందికి కూడా కరోనా సోకింది. వారు సాధారణ ప్రజల్లానే కరోనా గుప్పిట చిక్కుకున్నారు. అయితే హైద్రాబాద్ పరిధిలో పోలీసులు ఎక్కువ సంఖ్యలో కరోనా బారిన పడ్డారు. వారంతా కోలుకుని తిరిగి విధుల్లోకి చేరుకున్నారు. ఇదే విషయాన్ని కమిషనర్ అంజనీ కుమార్ తెలిపారు.
కరోనాను జయించిన 390 మంది పోలీసులు తిరిగి విధుల్లోకి చేరడాన్ని అభినందిస్తూ.. రకుల్ పోలీస్ విభాగంపై ప్రశంసల వర్షం కురిపించింది. ఈ మేరకు ఓ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. 'మనమంతా ఇంట్లో ఉన్న సమయంలో హైద్రాబాద్ పోలీస్ డిపార్ట్ మెంట్ ఇరవై నాలుగు గంటలు పని చేసింది. ఈ కారణంగా వారిలో ఎంతో మంది కరోనా బారిన పడ్డారు.

కమిషనర్ అంజనీ కుమార్ చెప్పిన దాని ప్రకారం దాదాపు 390 మంది పోలీసాఫీసర్లు తిరిగి విధుల్లోకి హాజరయ్యారు. వారంతా కరోనాను జయించారు. ఈ సందర్భంగా వారిని నేను అభినందిస్తున్నాను. మా అందరినీ జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తున్న పోలీసులకు ధన్యవాదాలు. మా అందరికీ ఇంకా జాగ్రత్తగా చూసుకునే శక్తిని వారికి ఇవ్వాలని కోరుకుంటున్నా' అని రకుల్ ప్రీత్ చెప్పుకొచ్చింది.