Don't Miss!
- News
‘భారత వ్యతిరేకి’ ఇల్హాన్ ఒమర్ శక్తివంతమైన యూఎస్ ఫారెన్ ఎఫైర్స్ ప్యానెల్ నుంచి ఔట్
- Lifestyle
లేడీస్ బి అలర్ట్! మీ బాయ్‌ఫ్రెండ్‌కు ఈ లక్షణాలు ఉంటే మీరు అతని పట్ల జాగ్రత్తగా ఉండాల్సిందే...!
- Finance
vodafone idea: బకాయిలను ఆ విధంగా కట్టమని వొడాఫోన్ ఐడియాకు ఆదేశం..
- Technology
ఒప్పో రెనో8 T 5G ఫస్ట్ లుక్: పవర్ ఫుల్ ఫీచర్లతో సెగ్మెంట్ లో బెస్ట్ ఫోన్
- Sports
విహారీ.. ఇది రివర్స్ స్వీప్ కాదు.. రివర్స్ స్లాప్: దినేశ్ కార్తీక్
- Travel
ఏపీలో ఆధ్యాత్మిక పర్యాటకానికి టూరిజం శాఖ సరికొత్త రూట్ మ్యాప్!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
Rakul Preet బాలీవుడ్ నిర్మాతతో ప్రేమలో ఉన్న రకుల్.. పుట్టిన రోజున ఆ పోస్ట్ తో రివీల్ చేసేసిందిగా!
ఈ
మధ్యకాలంలో
కొంచెం
వయసైన
హీరోయిన్లందరూ
ప్రేమ,
పెళ్లి
బాట
పడుతున్నారు.
ఈ
మధ్యనే
కాజల్
అగర్వాల్
తన
ప్రియుడిని
వివాహం
చేసుకోగా
ఇప్పుడు
తాజాగా
రకుల్
ప్రీత్
సింగ్
తన
పుట్టిన
రోజున
తన
ప్రియుడిని
పరిచయం
చేసింది.
అయితే
ఆయన
కూడా
హీరో
కావడం
ఆసక్తికరంగా
మారింది.
వివరాల్లోకి
వెళితే

ఎట్టకేలకు క్లారిటీ
టాలీవుడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఈ రోజు 31 పుట్టినరోజు జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆమెకు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువలా వచ్చి కురుస్తున్నాయి. సామాన్యులు, సెలబ్రిటీలు, అభిమానులు ఇలా ఒకరిని కాక దాదాపు అందరూ రకుల్ ప్రీత్ సింగ్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లడిస్తున్నారు.
అయితే ఈ సమయంలో రకుల్ ప్రీత్ సింగ్ తన అభిమానులకు పెద్ద సర్ప్రైజ్ ఇచ్చింది. ఆమె తన సోషల్ మీడియా వేదికగా నటుడు నిర్మాత అయిన జాకీ డేటింగ్ లో ఉన్నాను అనే వార్తలకు క్లారిటీ చేసింది.

డేటింగ్ రూమర్స్
టాలీవుడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కొన్నిరోజులుగా జాకీ భగ్నానితో డేటింగ్ చేస్తున్నట్లు రూమర్స్ వచ్చాయి. అయితే ఇప్పుడు వాటికి ఫుల్ స్టాప్ పెడుతూ.. బాలీవుడ్ హీరో జాకీ భగ్నాని "లవ్ ఆఫ్ మై లైఫ్" అంటూ రకుల్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ పెట్టింది. అది కాస్తా నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది.

ముందు ఆయన షేర్ చేయడంతో
ముందుగా జాకీ భగ్నాని.. రకుల్‌కి బర్త్‌డే విషెస్ తెలిపారు. "నువ్వు లేకపోతే..రోజులు రోజులుగా అనిపించవు. నువ్వు లేకపోతే.. అత్యంత రుచికరమైన ఆహారాన్ని తినడంలో సరదా ఉండదు. నా ప్రపంచం అయిపోయిన నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు.. ఈ రోజు నీ చిరునవ్వు లాగే.. అందంగా ఉండాలని కోరుకుంటున్నా" అంటూ జాకీ పోస్ట్ చేశారు.

సోషల్ మీడియా వేదికగా
ఈ క్రమంలో "థాంక్యూ మై లవ్. ఈ ఏడాది నువ్వే నా అతిపెద్ద గిఫ్ట్. నా జీవితానికి రంగులద్దావు, నన్ను ఎల్లప్పుడూ నవ్విస్తూనే ఉన్నావు, అన్నింటికీ థాంక్యూ. నీలా నువ్వు ఉన్నందుకు థాంక్యూ. ఇద్దరం కలిసి ఇంకా ఎన్నో జ్ఞాపకాలు పోగేసుకుందాం" అంటూ జాకీతో గడిపిన సంతోషకరమైన క్షణాలను గుర్తు చేసుకుంటూ రకుల్ తన ఇన్‌స్టాలో ఆయనతో కలిసి ఉన్న ఫోటోను కూడా షేర్ చేసింది.

కొండపొలంతో
ఇక ఈ పోస్ట్‌పై పలువురు సెలబ్రిటీలు స్పందించారు. ఈ జంటకు కంగ్రాట్స్ తెలుపుతూ కామెంట్స్‌తో హోరెత్తిస్తున్నారు. రకుల్ ప్రీత్ సింగ్ తెలుగుతో పాటు హిందీలోనూ పలు చిత్రాలలో నటించి మెప్పించింది. 'వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్' సినిమాతో తెలుగులో ఫస్ట్ హిట్ అందుకున్న రకుల్.. ఆ తర్వాత పలువురు స్టార్ హీరోలతో టించి బ్లాక్‌బస్టర్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతం తెలుగు, హిందీ భాషల్లో పలు సినిమాల్లో నటిస్తోంది. ఆమె నటించిన కొండపొలం సినిమా మొన్ననే ప్రేక్షకుల ముందు వచ్చింది.
Recommended Video

ఆయన నిర్మాణంలో
ఇదిలా ఉంటే, రకుల్ త్వరలో జాకీ నిర్మాణంలో ఒక సినిమాలో నటిస్తోంది. ఈ సినిమాలో ఆమె అక్షయ్ కుమార్‌తో కనిపించనుంది . ఆమె ఇటీవల సినిమా షూటింగ్ పూర్తి చేసి, సోషల్ మీడియాలో ఈ విషయాన్ని పంచుకుంది. ఇక జాకీతో ఆమె ప్రేమలో ఉన్నట్టు చాలా రోజుల నుంచే ప్రచారం జరుగుతోంది.