Just In
- 58 min ago
ఆ మూడు గుర్రాలతో.. రిపబ్లిక్ అనే పదానికి అసలైన అర్దాన్ని చెబుతున్న మెగా హీరో
- 1 hr ago
RRR రిలీజ్ డేట్ వల్ల మరో తలనొప్పి.. అసలైన వాళ్లే వద్దంటే డేట్ తప్పకుండా మార్చాల్సిందే..
- 2 hrs ago
మహేష్ చేయాల్సిన పవర్ఫుల్ కథలో పవన్ కళ్యాణ్.. పదేళ్ల తరువాత సెట్స్ పైకి..
- 3 hrs ago
క్రాక్ హిట్టు కాదు.. అంతకు మించి.. రవితేజ కెరీర్ లోనే బిగెస్ట్ కలెక్షన్స్
Don't Miss!
- Sports
ముగ్గురు స్టార్ ఆటగాళ్లపై కన్నేసిన సీఎస్కే.. వాట్సన్ స్థానం అతనిదేనా?
- News
అసదుద్దీన్ ఒవైసీకి నాన్ బెయిలబుల్ వారంట్ జారీ.. ఎందుకంటే..
- Finance
సెన్సెక్స్ 530 పాయింట్లు డౌన్, అందుకే రిలయన్స్ మహా పతనం
- Automobiles
ఆటోమేటిక్ టెయిల్‌గేట్ కలిగి ఉన్న భారతదేశపు మొట్టమొదటి హ్యుందాయ్ క్రెటా, ఇదే
- Lifestyle
Republic Day 2021:చరిత్ర తిరగరాస్తున్న నారీమణులు.. ఫ్లై పాస్ట్ ను లీడ్ చేయనున్న ఫస్ట్ లేడీ పైలట్ స్వాతి రాథోడ్
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
అందుకే వేశ్యగా మారాను... ఈ సారి డబ్బు కోసం కాదు.. రమ్యకృష్ణ సెన్సేషనల్ కామెంట్స్
దక్షిణాదిలో విభిన్నమైన పాత్రలతో ప్రేక్షకులను అలరిస్తున్న రమ్యకృష్ణ మరో ఛాలెంజింగ్ రోల్‌లో కనిపించబోతున్నారు. బాహుబలి తర్వాత ప్రస్తుతం సూపర్ డీలక్స్ చిత్రంలో విభిన్నమైన పాత్రను పోషించారు. తమిళ దర్శకుడు త్యాగరాజన్ కుమారరాజా రూపొందించే చిత్రంలో రమ్యకృష్ణ పోర్న్ స్టార్ పాత్రలో నటించారు. విజయ్ సేతుపతి, సమంత తదితరులు నటించిన ఈ చిత్రం త్వరలోనే విడుదల కానున్నది. ఈ సినిమా ప్రమోషన్‌లో భాగంగా రమ్యకృష్ణ మాట్లాడుతూ.. ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు.

డబ్బు, పాపులారిటీ, పేరు కోసం కాదు
సూపర్ డీలక్స్‌లోని నేను పోషించిన వేశ్య పాత్ర గురించి చెప్పినప్పుడు నాకంటే నా అసిస్టెంట్లే షాక్ తిన్నారు. కొన్నిసార్లు కొన్ని పాత్రలు డబ్బు కోసం, పాపులారిటీ కోసం, పేరు కోసం చేస్తాం. కానీ ఈ సినిమాలోని పాత్రను మాత్రం నటనపై ఉండే ఆసక్తి, ప్రేమ కోసం చేశాను అని రమ్యకృష్ణ పేర్కొన్నారు.

దర్శకుడిపై నమ్మకంతోనే సూపర్ డీలక్స్
దర్శకుడు కథ చెప్పిన విధానం. సినిమా పట్ల అతడికి ఉన్న నమ్మకం, ధైర్యం చూసి సూపర్ డీలక్స్‌లోని పాత్రను అంగీకరించాను. కేవలం దర్శకుడు కుమార్ రాజాపై ఉండే నమ్మకంతోనే వేశ్య పాత్రను చేశాను. కెరీర్‌లో కొన్నిసార్లే కొన్ని అవకాశాలు తలుపుతట్టుతాయి. అలాంటి వాటిలో ఇది ఒక్కటి అని రమ్మకృష్ణ వెల్లడించారు.

అందుకే వేశ్య పాత్రలో కనిపించా
బాహుబలిలో శివగామి తర్వాత నాకు బాగా నచ్చిన పాత్ర లీలా. సూపర్ డీలక్స్‌లో నటనకు అత్యంత ప్రాధాన్యం ఉన్న లీలా అనే వేశ్యగా కనిపిస్తాను. దక్షిణాది ప్రేక్షకులకు కొత్త అనుభూతిని కలిగించే కథా చిత్రమని బలంగా చెబుతాను. ఈ పాత్రతో మరోసారి ప్రేక్షకులు, విమర్శకుల ప్రశంసలు అందుకోవడం ఖాయం అనే ధీమాను రమ్యకృష్ణ వ్యక్తం చేశారు.

సమంత, హీరో విజయ సేతుపతితో కలిసి
విజయ్ సేతుపతి, సమంతతోపాటు ఈ చిత్రంలో ఫహద్ ఫాజిల్, రమ్యకృష్ణ, దర్శకుడు మిస్కిన్ కీలక పాత్రలను పోషిస్తున్నారు. త్యాగరాజన్ కుమార్ రాజా, మిస్కిన్, నలన్ కుమార్‌స్వామి, నీలన్ కే శేఖర్ కథను అందించారు. ఇటీవల విడుదలైన ఈ సినిమా ట్రైలర్‌కు అనూహ్యమైన స్పందన లభిస్తున్నది. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్నది.