ఆ డైరెక్టర్ వల్ల నా జీవితం ఇలా .. : రమ్యకృష్ణ ఎమోషనల్
తెలుగు సినీ ఇండస్ట్రీలో కొంతమంది మాత్రమే తమదైన ముద్రను వేసుకుని, దశాబ్దాల తరబడి స్టార్‌డమ్‌ను నిలబెట్టుకున్నారు. అలాంటి అరుదైన నటి రమ్యకృష్ణ (Ramya krishnan). చిన్న వయసులోనే సినీ రంగంలోకి అడుగుపెట్టి, దాదాపు 40 ఏళ్లుగా ప్రేక్షకులను తన అభినయంతో, అందంతో అలరిస్తూనే ఉన్నారు. నేటికీ ఆమె ఫుల్ బిజీగా, వరుసగా అవకాశాలను అందుకుంటూ రాణిస్తున్నారు. తాజాగా ఓ స్టార్ డైరెక్టర్ పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఇంతకీ ఆ డైరెక్టర్ ఎవరు?
నీలాంబరిగా మారినా.. శివగామిగా ఓ రాజ్యాన్ని పాలించినా.. ఆమెను ప్రేక్షకులు ఆదరించారు. డివోషనల్ రోల్స్ నుంచి బోల్డ్ క్యారెక్టర్స్ వరకూ - ప్రతి పాత్రలోనూ తనదైన ముద్ర వేసుకుంది. నరసింహలో నీలాంబరి, బాహుబలిలో శివగామి పాత్రలు ఆమె కెరీర్‌కి మైలురాళ్లుగా నిలిచాయి. దేవతగా, వేశ్యగా, రాజకీయ నాయకురాలిగా... ప్రతీ రోల్‌లోనూ ఆమె తన శక్తివంతమైన నటనతో మంత్రం వేసింది. కమర్షియల్ సినిమాలే కాకుండా, లేడీ ఓరియెంటెడ్ చిత్రాల్లోనూ తన ప్రతిభను చూపించారు. నటనలో సాహసాలకు వెనుకాడని రమ్యకృష్ణ, అవసరమైతే స్కిన్ షో చేసినా, అది పాత్ర అవసరమేనని నమ్మిన నటి ఆమె.

ఇటీవల జీ తెలుగు చానల్‌లో జగపతి బాబు హోస్ట్ చేస్తున్న జయమ్ము నిశ్చయమ్మురా షోకు రమ్యకృష్ణ గెస్ట్‌గా హాజరయ్యారు. ఆమె రాకతోనే సెట్స్‌కి నూతన ఉత్సాహం వచ్చింది. జగపతిబాబు కూడా యంగ్ లుక్‌లో, టీషర్ట్ వేసుకుని, రమ్యకృష్ణను ఇంప్రెస్ చేయడానికి ప్రయత్నించిన తీరు ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. ఈ షోలో మాట్లాడుతూ జగపతిబాబు అడిగిన ప్రశ్నలకు రమ్యకృష్ణ తనదైన స్టైల్ లో సమాధానమిచ్చింది. "ఇండస్ట్రీలో ఎన్ని ఫ్లాప్స్ ఎదుర్కొన్నారు?" అని అడగగా, ఆమె నవ్వుతూ "అయ్యో లెక్కలే లేవు... చేసినవన్నీ ఫ్లాప్సే!" అని ఫన్నీగా చెప్పి నవ్వులు పూయించారు.
ఆ తరువాత జగపతిబాబు వెంటనే సటైర్‌గా "న్యూటన్ ఆపిల్ పండు కింద పడుతుందని చెప్పాడు, కానీ రాఘవేంద్రరావు మాత్రం ఎక్కడ పడాలో కనిపెట్టారు" అని వ్యాఖ్యానించగా, రమ్యకృష్ణ వెంటనే "నా బొడ్డుపై పుచ్చకాయలే పడ్డాయి!" అంటూ చమత్కరించారు. ఈ జోక్‌తో స్టూడియో మొత్తం నవ్వుల్లో మునిగిపోయింది. అయితే, డైరెక్టర్ రాఘవేంద్రరావు గురించి అడిగగా.. రమ్యకృష్ణ ఒక్కసారిగా ఎమోషనల్ అయ్యింది. ఆమె కన్నీళ్లు ఆపుకోలేకపోయింది. "ఆయన లేకపోతే వెండితెరపై రమ్యకృష్ణ ఉండేది కాదు. నన్ను హీరోయిన్‌గా మార్చింది ఆయనే. నా జీవితాన్ని మార్చిన వ్యక్తి రాఘవేంద్రరావు గారు. నన్ను నమ్మి, నాకు అవకాశం ఇచ్చారు. నేడు నేను ఈ స్థాయికి రావడానికి ఆయన కారణం"అని పేర్కొంది.
వాస్తవానికి రాఘవేంద్రరావు - రమ్యకృష్ణ కాంబినేషన్ టాలీవుడ్‌లో లెజెండరీగా నిలిచింది. అల్లుడు గారు, అల్లరి మొగుడు, అల్లరి ప్రియుడు, మేజర్ చంద్రకాంత్, అన్నమయ్య వంటి సినిమాలు బ్లాక్‌బస్టర్ హిట్లు కాగా, మొత్తం 12 సినిమాలు కలిసి చేశారు. ప్రతి సినిమాలోనూ రమ్యకృష్ణకు కొత్త షేడ్స్ ఇచ్చి, ఆమెను స్టార్ హీరోయిన్‌గా మార్చారు దర్శకేంద్రుడు. మొత్తం చూసుకుంటే, రమ్యకృష్ణ ఈరోజు కూడా ఇండస్ట్రీలో కొనసాగుతుందంటే.. రాఘవేంద్రరావు వల్లే.. అందుకే ఆమె చెప్పినట్టుగా "ఆయన లేకుంటే రమ్యకృష్ణ ఉండేది కాదు" అనే మాటలు నిజమే అంటున్నారు సినీ ప్రేమికులు.


Click it and Unblock the Notifications











