Just In
- 24 min ago
రేయ్ రేయ్ అల్లరి నరేష్ పేరు మార్చేయ్.. కామెడీ హీరోకు నాని సలహా
- 1 hr ago
రష్మిక బ్రేకప్ పై ఇంకా తగ్గని ప్రశ్నలు.. విజయ్ దేవరకొండ ఇచ్చిన జవాబుకు రిపోర్టర్ మైండ్ బ్లాక్
- 2 hrs ago
2021 గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ .. ఇండియాలో కూడా లైవ్.. ఎప్పుడంటే?
- 2 hrs ago
అరణ్య ట్రైలర్ ఎప్పుడంటే.. రచ్చ చేసేందుకు రానా రెడీ!
Don't Miss!
- News
టీఆర్ఎస్ సభ్యత్వం తీసుకుంటేనే ప్రభుత్వ పథకాలు..: ఎమ్మెల్యే రాజయ్య సంచలనం
- Sports
కొంచెం స్పిన్ అయితే చాలు ఏడుపు మొదలుపెడతారు.. మొతేరా పిచ్ విమర్శకులపై నాథన్ లయన్ ఫైర్!
- Finance
9 కంపెనీల మార్కెట్ క్యాప్ రూ.2.2 లక్షల కోట్లు డౌన్, రిలయన్స్ మాత్రమే అదరగొట్టింది
- Automobiles
అతి తక్కువ ధరకే బౌన్స్ ఎలక్ట్రిక్ స్కూటర్.. పూర్తి వివరాలు
- Lifestyle
ఈ వారం మీ రాశి ఫలాలు ఫిబ్రవరి 28 నుండి మార్చి 6వ తేదీ వరకు
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
బోల్డ్ సీన్స్ పైనే ఫోకస్ పెట్టారు.. అప్పుడే అసలు విషయం అర్థమైంది.. రాశీ ఖన్నా షాకింగ్ కామెంట్స్
కలిసొచ్చే కాలం రావాలే గానీ ఏదీ ఆగదు! అన్నట్లుగా ఉంది యంగ్ హీరోయిన్ రాశిఖన్నా సినీ జర్నీ. సినిమాల్లోకి వచ్చిన కొత్తలో కాస్త తడబడిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు మాంచి ఫామ్‌లో ఉంది. వరుస హిట్స్ ఖాతాలో వేసుకుంటూ స్టార్ హీరోయిన్ క్రెడిట్ కొట్టేసింది. అయితే తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో తన ఫ్యాన్స్ గురించి మాట్లాడుతూ ఆశ్చర్యపరిచింది రాశీ. ఆ వివరాలేంటో చూద్దామా..

హడావిడి లేదు.. మెగా మేనల్లుడితో రొమాన్స్
ఎలాంటి హడావిడి లేకుండా మెల్లగా కెరీర్ నెట్టుకొస్తూ సూపర్ హిట్స్ తన ఖాతాలో వేసుకుంటున్న రాశిఖన్నా.. ఇటీవలే వెంకీమామ రూపంలో సూపర్ హిట్ తన ఖాతాలో వేసుకుంది. ఆ వెంటనే మెగా మేనల్లుడితో రొమాన్స్ చేసి భారీ కలెక్షన్స్ వసూలు చేసి 'ప్రతిరోజు పండగే' చేసింది.

విజయ్ దేవరకొండతో హాట్ హాట్.. బోల్డ్ కిక్
ఇకపోతే ఈ రోజే (ఫిబ్రవరి 14) ప్రేక్షకుల ముందుకొచ్చిన 'వరల్డ్ ఫేమస్ లవర్' సినిమాలో హాట్ హాట్ సన్నివేశాల్లో విజయ్ దేవరకొండతో కలిసి రెచ్చిపోయి నటించింది రాశీఖన్నా. గత సినిమాలతో పోల్చితే ఈ చిత్రంలో ఆమె క్యారెక్టర్ బోల్డ్‌నెస్ బాగా పెరిగింది.

రాశీ ఏంటి? ఇలాంటి సీన్స్ ఏంటి?
రిలీజ్‌కి ముందే చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా ఈ సీన్స్ కొన్ని చూపించారు మేకర్స్. అయితే ఇలాంటి సీన్స్‌లో రాశీని చూసి ఆమె ఫ్యాన్స్ కొంచెం హర్ట్ అయ్యారు. రాశీ ఏంటి? ఇలాంటి సీన్స్ ఏంటి? అని చర్చించుకున్నారు. అయితే ఇదే విషయంపై రాశీ ఖన్నా ఓ ఇంటర్వ్యూలో స్పందిస్తూ ఆసక్తికర సమాధానమిచ్చింది.

బోల్డ్ సీన్స్ పైనే ఫోకస్.. అసలు విషయం అర్థమైంది
''వరల్డ్ ఫేమస్ లవర్ మూవీ టీజర్ చూసి.. నా పాత్ర లోని ఎమోషన్స్, ఎక్స్ప్రెషన్స్ చూడకుండా కేవలం ఆ బోల్డ్ సీన్స్ పైనే ఫోకస్ పెట్టరంతా. ఏంటి రాశి ఇలా చేసింది అనుకున్నారు. పెద్ద పెద్ద డిస్కషన్స్ చేశారు. అయితే అప్పుడే నాకు అసలు విషయం అర్థమైంది.. నన్ను ఇంతలా ఫాలో అయ్యే ఫ్యాన్స్ ఉన్నారా! అని'' అంటూ ఆసక్తికరంగా మాట్లాడింది రాశీ.

గమనించే వాళ్ళు ఉన్నారని తెలిసి..
నేను తీసుకునే ప్రతీ నిర్ణయాన్ని గమనించే అభిమానులు నాకున్నారని తెలిసి చాలా సంతోషమేసిందని రాశీ తెలిపింది. ఇకపోతే ఈ రోజే విడుదలైన 'వరల్డ్ ఫేమస్ లవర్' మూవీ మిశ్రమ స్పందన తెచ్చుకుంటోంది.


వరల్డ్ ఫేమస్ లవర్ రొమాంటిక్ డోస్
విజయ్ దేవరకొండ హీరోగా క్రాంతి మాధవ్ దర్శకత్వంలో తెరకెక్కింది 'వరల్డ్ ఫేమస్ లవర్' మూవీ. ఈ సినిమాలో రాశీ ఖన్నాతో పాటు మరో ముగ్గురు హీరోయిన్స్ క్యాథెరిన్, ఇజబెల్లా, ఐశ్వర్య రాజేష్ నటించారు. చిత్రంలో విజయ్ రొమాంటిక్ డోస్ అదిరిందని టాక్ వస్తోంది.