For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Rashmika Mandanna: నాతో చాలా సమస్యలు.. సినిమాలు వదిలేస్తా.. రష్మిక మందన్నా షాకింగ్ కామెంట్స్!

  |

  కన్నడ ముద్దుగుమ్మ, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా ఛలో మూవీతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది. మొదటి చిత్రంతోనే మంచి హిట్ అందుకుంది. దీంతో చూసి చూడంగానే నచ్చేశావే అంటూ తెలుగు యూత్ పాటలు పాడుకుంది. ఆ తర్వాత అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోలతో సినిమాలు చేసి నేషనల్ క్రష్ గా ఎదిగింది. ఇక ఇటీవల వచ్చిన పుష్ప సినిమాతో తన కెరీర్ మలుపు తిరిగింది. సౌత్, నార్త్ లో వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్న రష్మిక మందన్నాపై ఇటీవల విపరీతమైన ట్రోలింగ్ జరిగింది. ఈ క్రమంలోనే తనతో చాలా సమస్యలు ఉన్నాయంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది.

  కిరిక్ పార్టీ సినిమా ద్వారా..

  కిరిక్ పార్టీ సినిమా ద్వారా..

  కన్నడ సినీ ఇండస్ట్రీ నుంచి వచ్చిన ముద్దుగుమ్మ రష్మిక మందన్నా ఇప్పుడు సౌత్ ఇండియాలోనే స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. ఇక ఇటీవల నార్త్ సినిమాలు చేస్తూ అక్కడ కూడా తన సత్తా చాటుతోంది. పుష్ప సినిమాతో రష్మిక మందన్నాకు వచ్చిన క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే మొదట రక్షిత్ శెట్టి హీరోగా చేసిన 'కిరిక్ పార్టీ' అనే కన్నడ చిత్రం ద్వారా రష్మిక మందన్నా ఎంట్రీ ఇచ్చింది.

  లక్కీ హీరోయిన్ గా పేరు..

  లక్కీ హీరోయిన్ గా పేరు..

  కిరిక్ పార్టీ సినిమాను కాంతార ఫేమ్ రిషబ్ శెట్టి దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. రష్మిక మందన్నా మొదటి సినిమా సూపర్ హిట్ అవడంతో ఆ వెంటనే అదే భాషల్లో అనేక ఆఫర్లు వెల్లువెత్తాయి. దీంతో కన్నడలో అనేక సినిమాలు చేసింది. ఈ క్రమంలోనే తెలుగులో 'ఛలో' మూవీతో తెరంగేట్రం చేసింది రష్మిక. ఆ తర్వాత తెలుగులో వరుసగా 'గీత గోవిందం', 'సరిలేరు నీకెవ్వరు', 'భీష్మ', 'పుష్ప' వంటి భారీ హిట్లను సొంతం చేసుకోవడంతో లక్కీ హీరోయిన్‌గా పేరు తెచ్చుకుంది.

  విజయ్ కోసమే ఆ సినిమా..

  విజయ్ కోసమే ఆ సినిమా..

  ఇక పుష్ప సినిమాతో వచ్చిన క్రేజ్ తో రష్మిక మందన్నాకు భారీ ఆఫర్లు రావడం ప్రారంభమైంది. సౌత్, నార్త్ అంటూ తేడా లేకుండా వరుస సినిమాలు చేస్తూ వస్తోంది. అయితే ఇటీవలే ఆమె నటించిన హిందీ చిత్రం గుడ్ బై అంతగా ఆకట్టుకోలేదు. అలాగే కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ తో కలిసి నటించిన వారసుడు సినిమాకు మిక్స్ డ్ టాక్ వచ్చింది. ఈ సినిమాపై విపరీతమైన ట్రోలింగ్ జరిగింది. అయితే ఈ సినిమాలో తన పాత్ర పెద్దగా ఉండదని తెలిసినా.. కేవలం విజయ్ కోసమే సినిమా ఒప్పుకున్నట్లు ఇటీవల రష్మిక తెలిపింది.

  వినడానికి సిద్ధంగా ఉన్నా..

  వినడానికి సిద్ధంగా ఉన్నా..

  తాజాగా బాలీవుడ్ యంగ్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రతో జోడీ కట్టిన మిషన్ మజ్ను జనవరి 20న నేరుగా ఓటీటీలో విడుదలైంది. ఇదిలా ఉంటే ఇటీవల రష్మిక మందన్నాపై ట్రోలింగ్ విపరీతంగా జరిగింది. ఈ ట్రోలింగ్ పై మిషన్ మజ్నూ సినిమా ప్రమోషన్స్ లో స్పందించింది. తాను జీవితంలో చేసే ప్రతి పనిపై ట్రోలింగ్ వస్తోందని.. వారు సరిగ్గా కమ్యునికేట్ చేస్తే వినడానికి తాను సిద్ధంగా ఉన్నానని, కానీ దుర్భాషలాడితే మాత్రం అది మానసికంగా ప్రభావితం చేస్తుందని రష్మిక తెలిపింది.

  సినిమాలు మానేయ్యాలనిపించింది..

  సినిమాలు మానేయ్యాలనిపించింది..

  ట్రోలింగ్ జరిగినప్పుడు సినిమాలు వదులుకోవాలని అనిపించిదా అని అడిగిన ప్రశ్నకు.. "కొన్నిసార్లు అనిపించింది. ఎందుకంటే ప్రజలకు నా బాడీతో కూడా సమస్యలు ఉన్నాయి. నేను ఎక్కువగా వర్కౌట్ చేస్తే వాళ్లకు నేను అబ్బాయిలా కనిపిస్తాను. లేకపోతే చాలా లావుగా ఉన్నానంటారు. ఎక్కువగా మాట్లాడితే భయపడుతోందని.. తక్కువ మాట్లాడితే.. యాటిట్యూడ్ అంటూ పేర్లు పెడతారు. నేను శ్వాస తీసుకోవడం.. తీసుకోకపోవడం కూడా వారికి సమస్యే అయితే నేను ఏం చేయాలి. ఈ ఫీల్డ్ లో ఉండాలా..? లేదా మానేయాలా?" అని పేర్కొంది రష్మిక మందన్నా

  వల్గర్ వర్డ్స్ ఉపయోగిస్తే..

  వల్గర్ వర్డ్స్ ఉపయోగిస్తే..

  ఈ ఇంటర్వ్యూలో రష్మిక ఇంకా మాట్లాడుతూ.. "నాలో ఎలాంటి మార్పు రావాలన కోరుకుంటున్నారో స్పష్టంగా చెబితే వింటాను. కానీ ఎలాంటి క్లారిటీ ఇవ్వకుండా ఇవన్నీ మాటలు అంటుంటే నేను ఏం చేయాలి. ఒకవేళా నాతో వాళ్లకు సమస్య ఉంటే.. అదేంటో నాకు చెప్పాలి తప్పా వల్గర్ వర్డ్స్ ఉపయోగిస్తూ దుర్భాషలాడొద్దు. ఎందుకంటే అందులో కొన్ని పదాలు మానసికంగా ప్రభావితం చేస్తాయి" అని ఆవేదన వ్యక్తం చేసింది. కాగా ప్రస్తుతం పుష్ప 2 సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే.

  English summary
  National Crush Rashmika Mandanna Reacts To Hate Trollers And Says Dont Abusive Words Because My Some Words Affecting Mentally In Mission Majnu Promotions.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X