For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Nene Na.. ఫస్ట్ లుక్ తోనే షాక్ ఇచ్చిన రెజీనా.. నెవ్వర్ బిఫోర్ అనేలా డిఫరెంట్ క్యారెక్టర్

  |

  SMS సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగు పెట్టిన గ్లామర్ బ్యూటీ రెజీనా కసాండ్రా అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు అందుకుంది. చూస్తుండగానే అమ్మడు తెలుగు తమిళ్ కన్నడ మలయాళం అని తేడా లేకుండా అన్ని ఇండస్ట్రీలను ఫాస్ట్ గానే కవర్ చేసేసింది. సౌత్ ఇండస్ట్రీలో రెజీనా అంటే తెలియని ప్రేక్షకులు ఉండరు. అంతలా తన క్రేజ్ ను పెంచుకుంది. అంతే కాకుండా తన డిఫరెంట్ గ్లామర్ తో సోషల్ మీడియాలో ఫాలోవర్స్ ను కూడా పెంచుకుంటోంది. సక్సెస్ ఫెయిల్యూర్స్ తో ఏ మాత్రం సంబంధం లేకుండా అవకాశాలను అందుకుంటోంది.

  ఇక ఆమె రెగ్యులర్ సినిమాలను కాకుండా కాస్త డిఫరెంట్ సినిమాలను కూడా సెలెక్ట్ చేసుకుంటోంది. అంతే కాకుండా లేడి ఓరియెంటెడ్ కథలకు కూడా బాగానే గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది. ఇక త్వరలోనే ఈ బ్యూటీ 'నేనే నా..' అనే డిఫరెంట్ టైటిల్ తో తెరకెక్కుతున్న సినిమాతో రాబోతోంది. ఇక అందుకు సంబంధించిన అద్భుతమైన టైటిల్, ఫస్ట్ లుక్ ను కూడా విడుదల చేశారు. రెజీనా పాన్-ఇండియన్ లెవెల్లో విపరీతమైన ఫ్యాన్ బేస్‌ను ఆస్వాదిస్తుండడంత ఈ ప్రాజెక్ట్‌ పై కూడా అంచనాలు గట్టిగానే పెరుగుతున్నాయి. కార్తీక్ రాజు దర్శకత్వం వహించిన ఈ ద్విభాషా చిత్రం షూటింగ్ పూర్తయినట్లు చిత్ర నిర్మాతలు వివరణ ఇచ్చారు.

  దర్శకుడు కార్తీక్ రాజు మాట్లాడుతూ, "నేనే నా షూటింగ్ ప్రక్రియ మొత్తం కూడా అంతా సాఫీగా సాగిపోవడం హ్యాపీగా ఉంది. ప్రస్తుతం మేము పోస్ట్ ప్రొడక్షన్ పనులను పూర్తి చేసే పనిలో బిజీగా ఉన్నాము. త్వరలోనే ట్రైలర్‌ను ఆవిష్కరించడానికి ప్లాన్ చేస్తున్నాము. నేనే నా సినిమాలో డిఫరెంట్ విజువల్స్ తో పాటు భయానక సన్నివేశాలు చాలా హాస్యంతో కూడిన మిస్టరీ ఆధారిత ప్లాట్‌ ప్రేక్షకులకు సరికొత్త అనుభవాన్ని కలిగిస్తాయి". అని వివరణ ఇచ్చారు.

  Regina Cassandra’s Nene Naa first look poster released

  ఇక నేనే నా సినిమా తెలుగు మరియు తమిళంలో ఏకకాలంలో రూపొందింది. నేనే నా చిత్రాన్ని యాపిల్ ట్రీ స్టూడియోస్ బ్యానర్‌పై రాజ్ శేఖర్ వర్మ నిర్మించారు. సినిమాలోని ప్రధాన భాగాలను కుట్రాలమ్ పరిసర ప్రాంతాల్లో చిత్రీకరించారు. ప్రతి సినిమాలోనూ తన విభిన్నమైన నటనతో ఆకట్టుకునే రెజీనా కసాండ్రా ఈసారి మరింత డిఫరెంట్ గా ఉండేలా పురావస్తు శాస్త్రవేత్తగా కనిపిస్తుందట. తప్పకుండా ఆ పాత్ర ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని చిత్ర యూనిట్ వివరణ ఇచ్చారు. ఇక ఈ సినిమాకు సామ్ సిఎస్ సంగీతం సమకూరుస్తుండగా, గోకుల్ బెనాయ్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. సాబు ఎడిటర్, సూపర్ సుబ్బరాయన్ స్టంట్ మాస్టర్ గా వర్క్ చేశారు. రెజీనా కసాండ్రా కాకుండాతో పాటు వెన్నెల కిషోర్, అక్షర గౌడ, తగపోతు రమేష్, జయ ప్రకాష్ అలాగే మరికొంతమంది ప్రముఖ నటీనటులు ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటించారు

  తారాగణం: రెజీనా కసాండ్రా, వెన్నెల కిషోర్, తాగుబోతు రమేష్, జయ ప్రకాష్, అక్షర గౌడ

  దర్శకుడు: కార్తీక్ రాజు
  నిర్మాత: రాజ్ శేఖర్ వర్మ
  బ్యానర్: ఆపిల్ ట్రీ స్టూడియోస్
  సంగీతం: సామ్ CS
  DOP: గోకుల్ బెనాయ్
  ఎడిటర్: సాబు
  స్టంట్స్: సూపర్ సుబ్బరాయన్

  English summary
  Regina Cassandra’s Nene Naa first look poster released
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X