For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Ramyasri Murder case: తల నరికి తెచ్చిన వాడితో పడుకొంటా.. యువ హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు

  |

  ఆంధ్ర ప్రదేశ్ లోని గుంటూరు జిల్లా లో బీటెక్ విద్యార్థిని మర్డర్ కేసు సంచలనంగా మారింది. గుంటూరు జిల్లా గుంటూరు పట్టణంలో కాకాని రోడ్ లో బీటెక్ విద్యార్థిని రమ్యశ్రీ ని శశి కృష్ణ అనే దుండగుడు దారుణంగా పొడిచి చంపాడు.. ఈ విషయం రెండు తెలుగు రాష్ట్రాల తో పాటు దేశ వ్యాప్తంగా ఇప్పుడు సంచలనంగా మారింది.. అయితే ఈ కేసును ఉదహరిస్తూ ఒక తెలుగు నటి చేసిన ఫేస్ బుక్ పోస్ట్ సంచలనం గా మారుతోంది. హత్య కేసులో ముద్దాయిగా ఉన్న వ్యక్తిని నరికిన వాడితో పడుకుంటాను అని కొన్ని తెలుగు సినిమాల్లో హీరోయిన్ గా నటించిన రేఖ భోజ్ ఫేస్ బుక్ లో పోస్ట్ పెట్టడం కలకలం రేపుతోంది. ఆ వివరాల్లోకి వెళితే

  ఆమెను బలవంతం పెట్టగా

  ఆమెను బలవంతం పెట్టగా

  సరిగ్గా దేశమంతా స్వాతంత్ర దినోత్సవం సంబరాల్లో మునిగి పోయిన వేళ గుంటూరు కాకాని రోడ్ లో ఓ దుండగుడు బీటెక్ చదువుతున్న రమ్య శ్రీ అనే విద్యార్థిని కత్తితో పొడిచి చంపాడు.. చాలా సేపు తన బైక్ ఎక్కమని ఆమెను బలవంతం పెట్టగా ఆమె అందుకు నిరాకరించింది. చాలా సేపు ఆమెను బలవంత పెట్టి ఆమె వినకపోవడంతో వెంట తెచ్చుకున్న కత్తితో ఆమెను అక్కడికక్కడ పొడిచి చంపాడు శశి కృష్ణ.

  ఈ ఘటన మొత్తం సీసీ కెమెరాల్లో రికార్డు అవడంతో ఆ విజువల్స్ చూసిన వారి ఒళ్లు గగుర్పొడుస్తుంది. చుట్టుపక్కల ఉన్న వారు కనీసం ఆపడానికి ప్రయత్నించినా ఆమె చనిపోకుండా కనీసం బతికి ఉండే అవకాశం ఉందని పోలీసులు అభిప్రాయపడ్డారు.

  దేశం మొత్తం సంచలనంగా

  దేశం మొత్తం సంచలనంగా

  ఈ ఘటన మొత్తం తెలుగు రాష్ట్రాల నే కాక దేశం మొత్తం సంచలనంగా మారింది. ఈ ఘటన గురించి చాలా మంది పలు విధాలుగా స్పందిస్తున్నారు. మరీ ముఖ్యంగా స్వాతంత్ర దినోత్సవం నాడు ఈ ఘటన జరగడం తో ఏ ముఖం పెట్టుకుని స్వాతంత్ర దినోత్సవ వేడుకలు చేసుకోవాలి అని కొందరు ప్రశ్నిస్తున్నారు.

  ఒకపక్క మువ్వన్నెల జెండా రెపరెపలు ఆడుతుంటే మరోవైపు ఆడబిడ్డ మీద ఉన్మాది కత్తి దూసిన ఉదంతం సంచలనంగా మారింది అని చెప్పక తప్పదు. గంటల వ్యవధిలోనే సదరు శశి కృష్ణ ను పోలీసులు అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపరచగా కోర్టు రిమాండ్ కూడా విధించింది.

  ఇంస్టాగ్రామ్ ద్వారా పరిచయం

  ఇంస్టాగ్రామ్ ద్వారా పరిచయం

  నిందితుడు శశి కృష్ణ రమ్యశ్రీ కి ఇంస్టాగ్రామ్ ద్వారా పరిచయం అయ్యాడు అని అతని మనస్తత్వం అర్థం చేసుకున్న రమ్యశ్రీ వెంటనే అతనిని బ్లాక్ చేసిందని పోలీసులు గుర్తించారు. అయితే రకరకాల ఫేక్ అకౌంట్లతో ఆమెతో మాట్లాడటానికి ప్రయత్నించిన శశి కృష్ణ చివరికి ఇంత దారుణానికి ఒడిగట్టాడు. అయితే ఈ దారుణ ఘటన గురించి టాలీవుడ్లో నటి, హీరోయిన్ గా పలు సినిమాల్లో నటించిన విశాఖపట్నంకు చెందిన రేఖ బొజ్ సంచలన పోస్ట్ చేసింది.

  నరికిన వాడితో పడుకుంటా

  నరికిన వాడితో పడుకుంటా

  వాడ్ని కూడా అలాగే ఎవరైనా నరికేస్తే, ఆ నరికిన వాడితో పడుకుంటా. im sry. ఆ వీడియో చూశాక ఏం మాట్లాడుతున్నానో నాకే అర్థం కావడం లేదు. అంత నిస్సహాయతలో ఉన్నాము మేము ఈ రోజు. జిల్లాకు ఒక సజ్జనార్ సార్ కావాలి. రమ్యా నీకు న్యాయం జరగాలి...Rest in peace Sister. అంటూ ఆమె పోస్ట్ పెట్టారు. అయితే ఆ పోస్ట్ మాత్రం ఇప్పుడు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆమె ఎందుకలా కామెంట్ చేసింది అని కొందరు కామెంట్స్ చేస్తున్నారు.

  మంచి పేరు

  మంచి పేరు

  ఇక తెలుగు అమ్మాయిలలో హీరోయిన్ అవకాశాలు అందుకుంటున్న వారిలో రేఖా బోజ్ ఒకరు. వినడానికి ఈ పేరు కూడా నార్త్ ఇండియన్ పేరులాగే ఉన్నా ఆమె పక్కా తెలుగు అమ్మాయి. ఆంధ్ర ప్రదేశ్ లోని విశాఖ పట్టణానికి చెందిన ఈ భామ తెలుగులో హీరోయిన్ గా కొన్ని సినిమాల్లో నటించింది. అయితే ఆ సినిమాలు రిలీజ్ అయ్యాక కూడా పెద్దగా ఆడలేదు. అయితే నటిగా ఆమెకు మంచి పేరు తెచ్చిపెట్టాయి అనే చెప్పాలి. ఇక ఈ మధ్య ఆమె సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటున్నారు. ఎప్పటికప్పుడు కరెంట్ అఫైర్స్ గురించి స్పందిస్తూ ఆసక్తికర కామెంట్లు చేస్తున్నారు అని చెప్పాలి.

  Interesting Facts About Rekha | Happy Birthday Rekha
  దామిని విల్లాతో క్రేజ్

  దామిని విల్లాతో క్రేజ్

  తెలుగులో ఆమె చేసిన కలయా తస్మై నమః అనే సినిమా 2016 లో రిలీజ్ కాగా రంగీలా అనే సినిమా 2017 లో రిలీజ్ అయింది.. ఈ రెండు సినిమాల్లో నటించిన ఆమెకు తర్వాత నాలుగు సినిమాల్లో హీరోయిన్ గా అవకాశాలు దక్కాయి. ఆ సినిమాలు దామిని విల్లా, స్వాతి చినుకు సందె వేళలో, మహి, వైశాలి. ఈ అన్ని సినిమాల్లో కంటే ఆమెకు ఎక్కువగా పేరు తెచ్చిపెట్టిన సినిమా దామిని విల్లా. ఒకప్పటి హీరో ఓం ఆదిత్య ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నారు. ఈ సినిమా టీజర్ లో ఆమె బికినీలో కనిపించడంతో మరింత ఫేమస్ అయ్యారు అని చెప్పాలి. ఇక కరోనా కారణంగా సినిమా వాయిదా పడుతూ వస్తోంది.

  English summary
  Telugu actress Rekha boj made a sensational Facebook post she said that she will sleep with the person who kills the murderer of Guntur Ramya Sri.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X