»   » ఆ కుక్కను చూసి అంతా భయపడేవారు: ‘ఖుషి’ జ్ఞాపకాల్లోకి వెళ్లిన రేణు దేశాయ్

ఆ కుక్కను చూసి అంతా భయపడేవారు: ‘ఖుషి’ జ్ఞాపకాల్లోకి వెళ్లిన రేణు దేశాయ్

Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
  Renu Desai Memorizes About Kushi Movie

  టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు చిరస్థాయిగా గుర్తుంచుకునే చిత్రం 'ఖుషి' . అప్పట్లో ఈ చిత్రం సంచలన విజయం సాధించింది. ఈ సినిమా తర్వాత పవర్ స్టార్ రేంజి మరింత పెరిగింది. సినిమాలోని పాటలు, యాక్షన్ సీన్లు, కమెడీ, రొంటిక్ సీన్లు అన్నీ హైలెటే. యూత్‌తో పాటు ఫ్యామిలీ ప్రేక్షకులు సైతం ఈ సినిమా మెప్పింది.

  ఈ సినిమాలో బాగా హైలెటై పాట 'ఆడువారి మాటలకు అర్థాలే వేరులే'. ఈ పాటను న్యూజిలాండ్‌లో చిత్రీకరించారు. ఇందులో పవన్ కళ్యాణ్, భూమికతో పాటు ఓ కుక్క కూడా కనిపిస్తుంది.. ఈ కుక్క గురించి రేణు దేశాయ్ గుర్తు చేసుకున్నారు.

  అపుడు అసిస్టెంట్ డైరెక్టర్‌గా రేణు దేశాయ్

  అపుడు అసిస్టెంట్ డైరెక్టర్‌గా రేణు దేశాయ్

  ‘ఖుషి' సినిమా సమయంలో రేణు దేశాయ్ వయసు కేవలం 19 సంవత్సరాలు. అపుడు నేను ఎస్‌జె సూర్య సర్ వద్ద అసిస్టెంటుగా పని చేశానని రేణు దేశాయ్ తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ పోస్టులో వ్యాఖ్యానించడంతో పాటు అందులో కనిపించే కుక్క గురించి ప్రస్తావించారు.

  దాన్ని చూసి అంతా భయపడేవారు

  దాన్ని చూసి అంతా భయపడేవారు

  ఆ కుక్క పేరు బెల్‌. న్యూ ఫౌండ్‌ల్యాండ్‌ జాతికి చెందినది. అయితే ఆ కుక్క భారీకాయం, భయంకరమైన లుక్ చూసి చూనిట అంతా భయపడేవారు. కానీ బెల్‌తో తనకు మంచి అనుబంధం ఉండటంతో దాని బాగోగులన్నీ చూసుకున్నాను అని రేణు గుర్తు చేసుకున్నారు.

   సరదా జ్ఞాపకాలు అవి..

  సరదా జ్ఞాపకాలు అవి..

  రెండు రోజులు పాటు అక్కడ షూటింగ్ ఎంతో సరదాగా సాగింది. షూటింగ్ అయిపోయే వరకు నేను దగ్గరుండి ‘బెల్' బాగోగులు చూసుకున్నాను... అంటూ రేణు దేశాయ్ ఖుషి సినిమా నాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు.

  రేణు దేశాయ్

  రేణు దేశాయ్

  పవన్ కళ్యాణ్‌తో విడిపోయిన తర్వాత రేణు దేశాయ్ పూణెలో సెటిలైన సంగతి తెలిసిందే. తన ఇద్దరు పిల్లలు ఆద్య, అకీరాతో అక్కడే ఉంటున్నా రేణు.... పూణెకు చెందిన మరొక వ్యక్తిని పెళ్లి చేసుకుని కొత్త జీవితం ప్రారంభించారు.

  English summary
  "This is the ‘Aduvari matalaku ardhale verule’ Khushi song shoot in New Zealand. Everyone was scared of Belle (Newfoundland dog) because of her size and looks. So, with being an assistant director, additional production person, I became the dog babysitter for the entire shoot. Belle was the gentlest soul and I had so much fun being her official care taker for 2days. Such beautiful and fun shoot memories😊( I was just 19yrs old when I assisted Surya Sir for Khushi)" Renu Desai said.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more