For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  పోలీస్ స్టేషన్లో కూడా రేప్ చేశారు, నాకు ఏడుపొచ్చింది: #మీటూపై రేణు దేశాయ్

  |

  #మీటూ మూమెంటుపై నటి, దర్శకురాలు, రచయిత రేణు దేశాయ్ స్పందించారు. ఈ సమస్య అన్ని చోట్లా ఉంది. ఇది అందరూ ఒప్పుకోవాల్సిన విషయమన్నారు. ఒక సినిమా ఇండస్ట్రీలోనే కాదు, వ్యాపార రంగంలో, మెడికల్ ఫీల్డ్, ఇంజనీరింగ్ ఫీల్డ్ ఇలా అన్ని రంగాల్లో మీటూ సమస్య ఉంది. ప్రతి చోటా మహిళలను డామినేట్ చేస్తున్నారు. దీన్ని మనం అంగీకరించాలి. ఒక అమ్మాయి తన బాస్ తనను హరాస్ చేస్తున్నాడని కంప్లయింట్ చేస్తే ఆమెను ఉద్యోగం నుంచి తీసేస్తారు. ఇలాంటి పరిస్థితుల్లో చాలా మంది ఏం చేయాలో అర్థం కాని పరిస్థితులో ఉంటారు. ఆ టార్చర్ భరించి ఆ ఫీల్డులో కంటిన్యూ అయిపోవాలా? కంప్లయింట్ చేయాలా? కంప్లయింట్ చేస్తే ఎవరూ సపోర్ట్ ఇవ్వరు... ఇది చాలా మందికి సమస్యగా మారిందని రేణు దేశాయ్ ఓ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో తెలిపారు.

  నేను చాలా లక్కీ

  నేను చాలా లక్కీ

  ఈ విషయంలో నేను చాలా లక్కీ. 18 సంవత్సరాల వయసులోనే సినిమా రంగంలోకి వచ్చాను. బద్రి సినిమా ఒప్పుకున్నాను. ఆ తర్వాత పెళ్లి చేసుకున్నాను. మీటూ పర్సనల్ గా ఎక్స్ పీరియన్స్ చేయలేదు. నా చుట్టూ కొన్ని సంఘటనలు చూశాను. ఫిల్మ్ ఇండస్ట్రీ కంటే ఐటీ ఇండస్ట్రీలో ఎక్కువగా ఉంటుంది. మనం గ్లామర్ ఇండస్ట్రీలో ఉండటం వల్ల ఇది ఎక్కువ ఫోకస్ అవుతుంది.

  పవన్ ఒకప్పుడు నా భర్త... నేను రాసిన బుక్‌లో ఆయన లేడు, తెలుగులో అందుకే: రేణు దేశాయ్

  మీటూ ఉద్యమం మంచిదే

  మీటూ ఉద్యమం మంచిదే

  సోషల్ మీడియా ద్వారా #మీటూ అనే ప్రచారం మొదలవ్వడం వల్ల చాలా మంది ధైర్యంగా ముందుకు వచ్చి తమకు ఎదురైన అనుభవాలను బయటకు చెప్పుకుంటున్నారు. దీని వల్ల ఎంతో కొంత మంచి జరుగుతుందని తెలిపారు.

  Poll: 2018 ఉత్తమ తెలుగు చిత్రం

  పోలీస్ స్టేషన్ వెళ్లడం సులభం కాదు

  పోలీస్ స్టేషన్ వెళ్లడం సులభం కాదు

  ఇలాంటి విషయాలు అన్ని సందర్భాల్లో పోలీస్ స్టేషన్ వెళ్లి కంప్లయింట్ చేయడం అంత సులభం కాదు. సో కాల్డ్ ఇంటలెక్చువల్స్ ఇలాంటి సలహాలు ఇస్తారు. పోలీస్ స్టేషన్ వెళ్లాలంటే మనకే భయం ఉంటుంది. అక్కడ రౌడీలు ఉంటారు, పోలీస్ స్టేషన్ ఎందుకు వెళ్లింది అంటూ చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుకుంటారు. చాలా రూడ్ గా మాట్లాడతారు. నా లాంటి కాస్త పేరు ఉన్నవారు పోలీస్ కంప్లయింట్ చేయాలంటే ఈజీగా ఉంటుంది. 18 ఏళ్ల అమ్మాయిలకు అది ఎలా సాధ్యం? అని రేణు దేశాయ్ అభిప్రాయ పడ్డారు.

  Poll: ఉత్తమ తెలుగు ప్రతినాయకుడు 2018

  పోలీస్ స్టేషన్లో కూడా రేప్ చేశారు

  పోలీస్ స్టేషన్లో కూడా రేప్ చేశారు

  సునీతగారు ఒక ఎన్జీవో ఆర్గనైజేషన్ నడుపుతున్నారు. వారు నిర్వహించిన ఓ కార్యక్రమానికి పిలిస్తే వెళ్లాను. అక్కడ ఓ అమ్మాయిని నాకు పరిచయం చేసి ఆమె స్టోరీ చెప్పారు. ఆమెను వయసు 15 సంవత్సరాలు. కొందరు ఆమెపై అత్యాచారం చేశారు. ఈ విషయమై కంప్లయింట్ చేయడానికి పోలీస్ స్టేషన్ వెళ్లారు. పోలీస్ స్టేషన్లో మళ్లీ తనను రేప్ చేశారు. ఈ విషయం తెలిసి నాకూ ఏడుపొచ్చింది. అందరు పోలీస్ బ్యాడ్ అని నేను అనడం లేదు. ఇలాంటి సంఘటనలు కూడా చోటు చేసుకున్నాయి. నేను ఈ విషయం చెప్పగానే పోలీస్ బ్యాడ్ అని కామెంట్ చేశానంటూ నాపై వంద బూతులు వస్తాయి. అందుకే క్లారిటీ ఇస్తున్నాను. మా ఇంటి వద్ద ఒక పనమ్మాయి ఒక అబ్బాయితో పారిపోయింది. ఇలాంటి విషయాల్లో కంప్లయింట్ చేయడం కష్టమని రేణు దేశాయ్ వెల్లడించారు.

  Poll: ఉత్తమ తెలుగు సంగీత దర్శకుడు 2018

   అబ్బాయిలను సరిగా పెంచితే సమాజం బాగుపడుతుంది

  అబ్బాయిలను సరిగా పెంచితే సమాజం బాగుపడుతుంది

  మీటూ మూమెంట్ వచ్చింది కదా... ఉమెన్‌కు ఫ్రీడమ్ లభించింది, మంచి రోజులు వచ్చాయి అనుకోవద్దు. ఇంకా కూడా ఉంటుంది. అందరికీ నేను చెప్పేది ఒకటే. మీరు మీ అబ్బాయిలను సరిగా పెంచుకోండి. అమ్మాయిలు ఏమీ డ్యామేజ్ చేయరు. అమ్మాయిలో చాలా తక్కువ మంది మాత్రమే చెడ్డవారు ఉంటారు. అబ్బాయిలను సరిగా పెంచితే సొసైటీ బావుంటుంది. నా కొడుకు అకీరాకు ఉమెన్ కు ఎలా రెస్పెక్ట్ చేయాలో చిన్నప్పటి నుంచి నేర్పిస్తున్నాను. అబ్బాయిని, అమ్మాయిని ఒకేలా పెంచాలి. చిన్నప్పటి నుంచే బాగా పెంచితే సమాజంలో జరిగే చెడ్డ సంఘటనలు తగ్గుతాయి.

  Poll: ఉత్తమ కొత్త తెలుగు నటి 2018

  మీటూను మిస్ యూజ్ చేస్తున్నారనే విమర్శలపై

  మీటూను మిస్ యూజ్ చేస్తున్నారనే విమర్శలపై

  #మీటూను మిస్ యూజ్ చేస్తున్నారనే వార్తలపై..... స్పందిస్తూ ఒక అబ్బాయి రేప్ చేస్తే, అందరు మగాళ్లు రేపిస్టులు కాదు అంటారు. ఒక అమ్మాయి మీటూ మిస్ యూజ్ చేసిందని అంతా అలాంటివారు కాదు అని ఎందుకు అనడం లేదు? 99 శాతం నిజం ఉంది. 1 శాతం అలాంటి మిస్ యూజ్ ఉంది. అబ్బాయిలు, అమ్మాయిలు ఒకటే అర్థం చేసుకోవాలి వంద మందిలో ఒక రేపిస్టు ఉంటాడు, అలాంటే వంద మంది అమ్మాయిల్లో ఒకరు మాత్రమే మిస్ యూజ్ చేసేవారు ఉంటారు... అని రేణు దేశాయ్ అభిప్రాయ పడ్డారు.

  English summary
  Renu Desai about MeToo movement. This problem is in all sectors. Not only in the film industry, she said.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X