twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సినిమాలకు దూరమై రీచా గంగోపాధ్యాయ్, మీటూ వల్లేనా? అంటే...

    |

    'లీడర్' సినిమా ద్వారా నటిగా కెరీర్ మొదలు పెట్టిన రీచా గంగోపాధ్యాయ్ తెలుగులో వరుస అవకాశాలు దక్కించుకుంది. నాగవళ్లి, మిరపకాయ్, సారొచ్చారు, మిర్చి, భాయ్ చిత్రాల్లో నటించారు. అయితే 'భాయ్' సినిమా తర్వాత ఆమె తెరమరుగైపోయారు. నాలుగైదేళ్లుగా ఆమె సినిమాల్లో కనిపించడం లేదు.

    ట్విట్టర్లో యాక్టివ్‌గా ఉండే రీచా గంగోపాధ్యాయ్‌కు తరచూ మీ నెక్ట్స్ మూవీ ఎప్పుడూ అనే ప్రశ్నలు అభిమానుల నుంచి ఎదురవుతూనే ఉన్నాయి. ఈ ప్రశ్నలకు రీచా ఫైనల్ ఆన్సర్ ఇచ్చేసింది. తనకు సినిమాల్లో నటించే ఉద్దేశ్యం లేదని తేల్చి చెప్పింది. అంతే కాదు... తన ట్విట్టర్ స్టేటస్ కూడా 'మాజీ నటి' అని మార్చుకుంది. అమెరికా పౌరసత్వం ఉన్న ఈ బ్యూటీ తాను ఎప్పటికీ మిచిగాన్ వాసినే... అదే సమయంలో ఇండియన్ అమెరికన్ అని చెప్పుకోవడానికి గర్వపడతాను అని పేర్కొన్నారు.

    మీ తర్వాతి సినిమా ఎప్పుడు? అనే ప్రశ్నలపై రిచా స్పందిస్తూ.... . 'చాలా మంది మీ తర్వాతి సినిమా ఏమిటి? అని అడుగుతున్నారు. నా నుండి ఇక అలాంటివి ఆశించవద్దు. సినిమాలకు పూర్తిగా దూరం అయ్యాను, మళ్లీ అటు వైపు వచ్చే ఆసక్తి కూడా లేదు.' అని స్పష్టం చేశారు.

     Richa Gangopadhyay changed her twitter status as Former film actress

    సినిమా కెరీర్‌ కొంతకాలం మాత్రమే బాగుంటుంది. అభిమానులు నన్ను ఇప్పటికీ గుర్తుపెట్టుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అందుకే నాకు ఇష్టమైన జీవితం వైపు వచ్చేశాను. వెనక్కి తిరిగి వచ్చే ఉద్దేశ్యం లేదని తెలిపారు.

    ఈ సందర్భంగా రీచా గంగోపాధ్యాయ్ అభిమానుల ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. ప్రస్తుతం ఇండియాలో మీటూ ఉద్యమం ఉధృతం అయిన నేపథ్యంలో మీటూ అనుభవం వల్లనే ఇలాంటి నిర్ణక్ష్ం తీసుకున్నారా? అని ఒకరు ప్రశ్నించగా 'మీటూ' అనుభవం తనకు ఎదురు కాలేదన్నారు. అవకాశాల కోసం ఎప్పుడూ తప్పుడు దారిలో వెళ్లలేదని తెలిపారు.

    English summary
    "I’ve accepted the fact that I may still continue getting asked the question: “when is your next film?” even when I’m 90. Truly flatterered all, but at some point you’ll have to accept that the movie thing was just a short term fling and that I have no desire to return. #MovedOn" Richa Gangopadhyay tweeted.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X