twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    స్టార్ హీరోలను భయపెట్టిన లేడి విలన్స్.. వెండితెరపై విష నాగులు!

    |

    ఒక పాత్ర క్లిక్కవ్వాలి అంటే సినిమాలో కంటెంట్ కి తగ్గట్టుగా నటీనటులు యాక్ట్ చేయగలిగితేనే మంచి గుర్తింపు దక్కుతుంది..ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో ఎంతో మంది స్టార్ యాక్టర్స్ ఉన్నారు. ఇక విలన్స్ కి ఉన్న క్రేజ్ కొన్నిసార్లు హీరోలకు కూడా ఉండదు. ప్రతి నాయకుడి పాత్ర ఎంత బలంగా ఉంటే.. కథానాయకుడి పాత్ర అంతకంటే ఎక్కువ రేంజ్ లో క్లిక్కవుతుంది. అయితే అప్పుడప్పుడు కొంతమంది లేడి విలన్స్ కూడా వెండితెరపై విషనాగుల కంటే డేంజర్ గా కనిపిస్తున్నారు. అలాంటి వారిపై ఒక లుక్కేస్తే..

    రమ్య కృష్ణ..

    రమ్య కృష్ణ..

    రమ్యకృష్ణ నటన గురించి చెప్పడానికి నరసింహా(పడయప్ప) సినిమా చాలు. ఆ ఒక్క సినిమాతో ఈ సీనియర్ యాక్టర్ క్రేజ్ ఒక్కసారిగా జాతీయ స్తాయికి పెరిగిపోయింది. రజినీకాంత్ లాంటి స్టార్ హీరో పాత్ర హైలెట్ చేయడానికి ఆమె చేసిన నీలాంబరి పాత్ర ఒక ట్రెండ్ సెట్ అనే చెప్పాలి. ఆ పాత్రలో మరొకరిని ఉహించుకోవడం అసాధ్యం. ఆ తరువాత చాలా సినిమాల్లో రమ్యకృష్ణ నెగిటివ్ రోల్స్ తో మెప్పించింది.

    రాశి..

    రాశి..

    రాశి అంటే ఒక హోమ్లీ అమ్మాయి అని అందరికి తెలుసు. చూడగానే అందమైన నవ్వుతో ఆకట్టుకునే రాశి నిజం సినిమాలో కనిపించిన తీరు అందరిని షాక్ కి గురి చేసింది. మల్లి పాత్రలో ఆమె చూపించిన హావభావాలకు మంచి గుర్తింపు దక్కింది. ముఖ్యంగా ఆమె చూపుల్లో ఎదో విషం ఉన్నట్లు అనిపిస్తుంది. విలన్ గోపిచంద్ అయినా కూడా నిజం సినిమా అంటే ముందుగా రాశి పేరు గుర్తుకు వస్తుంది.

    మంచు లక్ష్మీ..

    మంచు లక్ష్మీ..

    నటిగా పెద్దగా సక్సెస్ కాకపోయినా కూడా మంచు లక్ష్మీ కెరీర్ లో జీవితాంతం గుర్తుండిపోయే పాత్ర ఐరేంద్రి. ప్రముఖ హాలీవుడ్ నిర్మాణ సంస్థ డిస్ని వరల్డ్ నిర్మించిన అనగనగా ఒక ధీరుడు సినిమాలో మంచు లక్ష్మీ లేడి విలన్ గా సినిమాకు కొత్త రూపాన్ని అంధించింది. ఆ సినిమా అనుకున్నంతగా సక్సెస్ కాకపోయినప్పటికి ఐరేంద్రి పాత్ర మాత్రం మంచు లక్ష్మీ కెరీర్ కి మంచి గుర్తింపు తెచ్చింది.

    Recommended Video

    Vijay Devarakonda And Rashi Khanna Longest Kiss Ever In Tollywood || Filmibeat Telugu
    శ్రియ రెడ్డి

    శ్రియ రెడ్డి

    విశాల్ నటించిన పొగరు సినిమాలో శ్రియ చేసిన ఈశ్వరి పాత్ర అప్పట్లో ఒక సంచలనం సృష్టించింది. సినిమాలో విలన్స్ ఎంత మంది ఉన్నా కూడా ఆమె చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. నెగిటివ్ పాత్రతో పిచ్చెక్కించి.. పొగరు అనే పదానికి మరో అర్ధం చెప్పింది. ఆ సినిమా తరువాత ఎన్ని సినిమాలు చేసినా కూడా ఈశ్వరిగానే జనాలు ఆమె గుర్తించేవారు.

    English summary
    The craze for villains sometimes doesn't even include heroes. If the character of each hero is so strong .. the protagonist's character clicks higher. But occasionally, some lady villains also appear to be more dangerous than the toxins on the silver screen.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X