Sadha: ఉదయ్​ కిరణ్​ ఆత్మహత్యపై సదా కామెంట్స్​.. అలాంటి వాన్నే పెళ్లి చేసుకుంటా

బ్యూటిఫుల్​ హీరోయిన్​ సదాను ఇప్పుడు అప్పుడే మర్చిపోలేం. వెళ్లవయ్యా వెళ్లు అంటూ యూత్ గుండెల్లో గూడు కట్టుకుని కూర్చొంది. జయం సినిమాలో సదా చెప్పిన ఈ డైలాగ్​ ఎంత పాపులరో పెద్దగా చెప్పనవసరం లేదు. ఈ ఒక్క డైలాగ్​తోనే కుర్రకారును కట్టిపడేసింది. ఇక తర్వాత తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ చిత్రాల్లో నటించి ఆకట్టుకుంది. నితిన్​తో మళ్లీ టక్కరి సినిమాలో నటించి గ్లామర్​ బాగానే ఒలకబోసింది. ఇదంతా బాగానే ఉంది. కానీ తర్వాత ఆమె కెరీర్​ అనుకున్నంత సక్సెస్​ఫుల్​గా సాగలేదు. ఇటీవల హలో వరల్డ్​తో ఓటీటీ ఎంట్రీ ఇచ్చిన సదా రీసెంట్​గా ఓ ఇంటర్వ్యూలో ఉదయ్ కిరణ్​ ఆత్మహత్యపై స్పందించింది.

నాకు ఆ విషయమే తెలియదు..

నాకు ఆ విషయమే తెలియదు..

''ఉదయ్​ కిరణ్​ అలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నాడనే విషయం నాకు తెలియదు. కానీ, అలాంటి మంచి నటుడిని కోల్పోవడం మన దురదృష్టం. ఆయనతో కలిసి ఔనన్నా కాదన్నా చిత్రంలో నటించాను. అంతకుముందు అతను చేసిన సినిమాలన్నీ హిట్​ అయ్యాయి.

అలా జరిగితే ఎంటీ?

అలా జరిగితే ఎంటీ?

అయితే అతని కెరీర్​లో ఎక్కడ తప్పు దొర్లిందో నాకు తెలియదు. ఒకవేళ మనం అనుకున్నట్లుగా కెరీర్​ సాగలేదనే అనుకుందాం. అలా జరిగితే ఏంటీ? జీవితం ఇంకా గొప్పది. లైఫ్​లో ఎన్నో సాధించాల్సినవి ఉన్నాయి. ఒక మూవీ బాగా ఆడుతుంది. మరో సినిమా బాగా ఆడదు.

ది బెస్ట్​ ఇవ్వాలంతే..

ది బెస్ట్​ ఇవ్వాలంతే..

చిత్రం సరిగ్గా ఆడలేదని చాలమంది డిప్రెషన్​కు గురవుతుంటారు. అలాంటి ఎన్నో విషయాలను నేను విన్నాను. జయాపజయాలనేవి మన చేతుల్లో ఉండవు. అలాగే శాశ్వతం కూడా కాదు. ఒక యాక్టర్​గా మనం ది బెస్ట్​ ఇవ్వాలంతే. మిగితాది మనల్ని ప్రేక్షకులు ఎలా రిసీవ్​ చేసుకుంటారనేది పరిస్థితులను బట్టి మారుతుంది.

అంతమాత్రానికే ఒత్తిడికి లోనవుతారా?

అంతమాత్రానికే ఒత్తిడికి లోనవుతారా?

అలాగే నా ఔనన్నా కాదన్నా సినిమా విషయంలో జరిగింది. జయం చిత్రాన్ని ఆదరించిన ఆడియెన్స్​ నేను చేసిన ఔనన్నా కాదన్నా చిత్రాన్ని ఆదరించలేదు. అంత మాత్రానికే ఒత్తిడితో డిప్రెషన్​లోకి వెళ్లిపోతే ఎలా? జెనరల్​గా మనకు అడ్వైస్​లు ఇచ్చేవారు ఏదేదో చెబుతుంటారు.

అలా సలహాలు ఇస్తారు..

అలా సలహాలు ఇస్తారు..

ఎగ్జాంపుల్​కు నేను నా యూట్యూబ్​ ఛానెల్​ ప్రారంభించినప్పుడు దయచేసి పెళ్లి చేసుకోండి. పిల్లల్ని కనండి అని చాలా మంది అడ్వైస్​లు ఇచ్చారు. మన లైఫ్​పై అలాంటి కామెంట్స్ చేసే రైట్​ వారికి ఎవరిచ్చారు? అలాంటి వారికి నేనేందుకు సమాధానం చెప్పాలి.

అలా ఎందుకు అనుకోవాలి..

అలా ఎందుకు అనుకోవాలి..

ఇప్పుడు 10 పెళ్లిళ్లు జరిగితే అందులో 5 జంటలైన వివాహం తర్వాత సంతోషంగా ఉన్నారా? ఎవరు సంతోషంగా ఉండటం లేదు. ఎవరో నన్ను సంతోషంగా ఉంచాలని ఎందుకు అనుకోవాలి. మనకోసం ఇతరులెందుకు కష్టపడాలి. ​ఎదుటి వ్యక్తి ఎలాంటి ఒత్తిడి లేకుండా ఉంటే వారిపై కావాలనే ఒత్తిడి పెంచేస్తారు.

చనిపోవాలి అంతే..

చనిపోవాలి అంతే..

నా లైఫ్​ను నేను హ్యాపీగా గడపాలనుకుంటున్నా. నేను పార్టీలకు, పబ్​లకు వెళ్లే వ్యక్తిని కాదు. అలాగే నైట్​ ఔట్స్​ చేయడమో, మందు తాగడమో వంటివి చేయను. మన హ్యాపీనెస్​ ఇతరులపై ఆధారపడి పెళ్లి చేసుకుంటే ఆ తర్వాత సంతోషంగా ఉండలేరు. నీ సంతోషం కోసం నువ్​ మరో వ్యక్తిపై ఆధారపడితే నీ ఒత్తిడి కూడా అతనే భరించాలి. దీంతో అతను చనిపోవాలి అంతే.

అలాంటి వాడినే పెళ్లి చేసుకుంటా..

అలాంటి వాడినే పెళ్లి చేసుకుంటా..

ఈ సినిమా హిట్​ అయితే హ్యాపీగా ఉంటాను, నా వెబ్​ సిరీస్​ను అందరూ చూస్తే మంచి పేరొస్తుంది. దాంతో సంతోషంగా ఉంటాను అని అనుకోవద్దు. అలా అనుకుంటే ఎన్నటికీ హ్యాపీగా ఉండలేం. ఇక నేను పెళ్లి చేసుకోవాలనుకునే వ్యక్తి వెగన్​ (శాఖహారి) అయి ఉండాలి.

అలా ఉంటే చాలు..

అలా ఉంటే చాలు..

చేసుకునేవాడు ధనవంతుడు కానక్కర్లేదు కానీ, ఒకరిపై ఆధారపడకుండా ఉంటే చాలు. ​నా సంపాదనపైనో, మరొకరి డబ్బు పైనో ఆధారపడకూడదని నా అభిప్రాయం'' అని తెలిపింది సదా. కాగా ఆమె నటించిన తాజా వెబ్​ సిరీస్​ హలో వరల్డ్​ ఆగస్ట్​ 12 నుంచి జీ5లో స్ట్రీమింగ్ అవుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X