ఆయన వ్యక్తి కాదు.. నేల మీద ఉంటే.. సాయిపల్లవి సెన్సేషనల్ కామెంట్స్
టాలెంటెడ్ హీరోయిన్ సాయిపల్లవి తన అభిమాన హీరో సూర్యతో ఎన్‌జీకే చిత్రం కోసం కలిసి నటిస్తున్నది. శ్రీ రాఘవ్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాకు ఎస్ఆర్ ప్రకాశ్ బాబు, ఎస్ఆర్ ప్రభు నిర్మాతలు. డ్రీమ్ వారియర్ పిక్చర్స్, రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై రూపొందింది. ప్రతిష్టాత్మకంగా రూపొందిన ఈ సినిమా ఆడియో రిలీజ్, ట్రైలర్ విడుదల కార్యక్రమం ఇటీవల చెన్నైలో జరిగింది. ఈ కార్యక్రమంలో సూర్య తండ్రి శివకుమార్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సాయిపల్లవి చేసిన ప్రసంగం అందర్నీ ఆకట్టుకొన్నది.
ఆడియో రిలీజ్ వేడుకలో సాయి పల్లవి మాట్లాడుతూ.. ఎన్‌జీకే షూటింగ్‌కు వెళ్లే ప్రతీరోజు స్కూల్‌కు వెళ్లినట్టు అనిపించేది. ప్రతీ రోజు ఓ కొత్త విషయం నేర్చుకొనే అవకాశం ఏర్పడింది. షూటింగ్ కోసం ఓ రోజు ముందుగానే ప్రిపేర్ అయి వెళ్లేదానిని. అయితే సెట్స్‌కు వచ్చే ముందు ఎలాంటి ప్రిపరేషన్ లేకుండా రావాలని దర్శకుడు శ్రీ రాఘవ చెప్పేవారు. తొలి రెండు రోజుల్లో అతడిని బాగా అర్థం చేసుకొన్నాను అని సాయి పల్లవి చెప్పారు.

శ్రీ రాఘవ గారు ప్రతీ సీన్‌ను కొత్త డైమెన్షన్‌లో తీసేవారు. మనం నేల మీద ఉండి ఆలోచిస్తే.. ఆయన ఆకాశం ఎత్తులో ఆలోచించేవారు. శ్రీ రాఘవ ఓ వ్యక్తి కాదు.. ఓ పాఠశాల లాంటి వారు. ఆయనతో పనిచేసిన తర్వాత చాలా నేర్చుకొన్నాను. సూర్యకు నేను పెద్ద ఫ్యాన్‌ను. లక్షల్లో ఒకరు ఆయన. చిరునవ్వుతో అందరితో కలుపుగోలుగా ఉంటారు. చాలా సాదాసీదా వ్యక్తి అతను. యువన్ శంకర్ రాజాతో నాది రెండో సినిమా. పాటలు బాగున్నాయి. సినిమా రీరికార్డింగ్ మరో లెవెల్‌లో ఉంటాయి అని సాయిపల్లవి చెప్పింది.


Click it and Unblock the Notifications











