సహజీవనం తప్పు లేదు.. కాలేజీలో నా ప్రేమ, నన్నే అడుగుతున్నారు.. సాయి పల్లవి!

గ్లామర్ పాత్రలు చేయకుండా యువతలో క్రేజ్ తెచ్చుకోవడం హీరోయిన్లకు చాలా కష్టం. ప్రస్తుతం చాలా మంది హీరోయిన్లు బోల్డ్ రోల్స్ తో, అందాల ఆరబోతతో రెచ్చిపోతున్నారు. అలాంటి వారికి వేగంగా గుర్తింపు లభిస్తోంది. ఇంతటి కాంపిటీషన్ లో కూడా సాయి పల్లవి కేవలం తన నటనతో మాత్రమే యువతని ఒక ఊపు ఊపేస్తోంది. సాయి పల్లవి ఇంతవరకు ఎలాంటి గ్లామర్ పాత్రలు చేయలేదు. ఇకపై చేయనని కూడా తేల్చి చెప్పేసింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో సాయి పల్లవి సహజీవహం గురించి కామెంట్ చేసింది.

కాలేజీలో నా ప్రేమ

కాలేజీలో నా ప్రేమ

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మీరు ఎవరితో అయినా ప్రేమలో ఉన్నారా అనే ప్రశ్న సాయి పల్లవికి ఎదురైంది. ఇలాంటి ప్రశ్నలు నాకు ఎక్కువగా ఎదురవుతున్నాయి. కాలేజీలో ఉన్నప్పుడు నా ప్రేమ పుస్తకాలపై ఉండేది. సినిమాల్లోకి వచ్చాక నటనని ప్రేమిస్తున్నా. అంతకు మించి తనకు ఎలాంటి ఎఫైర్స్ లేవని సాయిపల్లవి పేర్కొంది.

తప్పు కాదు.. కానీ నాకు అవసరం లేదు

తప్పు కాదు.. కానీ నాకు అవసరం లేదు

ఇక సహజీవనం గురించి మాట్లాడుతూ.. సహజీవనం అనేది ఇద్దరు వ్యక్తుల వ్యక్తిగత జీవితానికి సంబంధించినది. పరస్పర అంగీకారంతో జరిగే సహజీవనం తప్పు అని చెప్పలేం. కానీ నాకు మాత్రం సహజీవనం అనేది అవసరం లేని విషయం అని సాయిపల్లవి తెలిపింది. తాను వివాహ జీవితాన్నే ఇష్టపడుతానని సాయిపల్లవి తెలిపింది.

వరుస చిత్రాలు

వరుస చిత్రాలు

సాయి పల్లవి నటించిన పడి పడిలేచే మనసు, మారి 2 చిత్రాలు ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. పడిపడి లేచే మనసు చిత్రానికి ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది. సాయి పల్లవి మాత్రం తన నటనతో అదరగొట్టింది. ధనుష్ సరసన నటించిన మారి 2 చిత్రానికి కూడా మంచి రెస్పాన్స్ వస్తోంది.

గ్లామర్ పాత్రలు చేయను

గ్లామర్ పాత్రలు చేయను

అదే విధంగా గ్లామర్ పాత్రల విషయంలో సాయి పల్లవి తన వైఖరిని మరోమారు తేల్చేసింది. నా చిత్రాలు నా ఫ్యామిలీ కూడా చూసే విధంగా ఉండాలని అనుకుంటాను. అందుకే గ్లామర్ పాత్రలు, లిప్ లాక్ సన్నివేశాల్లో నటించనని సాయి పల్లవి తెలిపింది. అలాంటి పాత్రల్లో నటించకపోయినా హీరోయిన్ గా రాణించవచ్చు అని తెలిపింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X