బెడ్‌పై ప్రియనేస్తంతో సమంత.. ‘గాఢ నిద్ర‘తో ముఖం చాటేయడంతో మళ్లీ..!
కరోనా లాక్‌డౌన్ సమయంలో అందరూ సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తూంటే సమంత అక్కినేని దంపతుల మాత్రం అదృశ్యం కావడంతో అనేక రూమర్లు, గాసిప్స్‌కు తావిచ్చింది. సమంతకు ప్రెగ్నెన్సీ రూమర్లు మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే ఆమె సన్నిహితులు మాత్రం వాటిని ఖండించారు. అయితే రూమర్లకు జవాబిస్తూ తాజాగా తన ఇన్స్‌టాగ్రామ్‌లో దర్శనమిచ్చింది. అయితే ముఖం చాటేస్తూ ఫోటో పెట్టడం మరిన్నీ అనుమానాలకు తావిచ్చింది. వివారాల్లోకి వెళితే..

ప్రెగ్నెన్సీ అంటూ రూమర్లు
ఎప్పుడూ సోషల్ మీడియాలో హడావిడి చేసే సమంత లాక్‌డౌన్ సమయంలో మాయం కావడంతో ఆమె గర్భం దాల్చింది. అందుకే విశ్రాంతి తీసుకొంటుందనే వార్తలు తెగ ప్రచారం అయ్యాయి. అలాంటి పరిస్థితుల్లో తన సన్నిహితులు మీడియాతో స్పందిస్తూ.. తన కుటంబంతో ప్రైవేట్‌గా గడుపుతుంది. పూర్తిస్థాయిలో ఈ సమయాన్ని ఫ్యామిలీకే కేటాయించింది అని క్లారిటీ ఇచ్చారు.

గుట్టుచప్పుడు కాకుండా ఇంటికే పరిమితం
మీడియాలో వస్తున్న వార్తలపై కూడా స్పందించకుండా ఉన్న సమంత.. బుధవారం ఉదయం తన ఇన్స్‌టాగ్రామ్‌లో దర్శనమిచ్చింది. సుదీర్ఘమైన నిద్ర నుంచి బ్యాక్ వచ్చాను. ఇంటి వద్దనే సురక్షితంగా ఉండండి. మీరంతా బాగుండాలని ప్రార్థిస్తున్నాను అని తన పెంపుడు కుక్కతో పడుకొని ఉన్న ఫోటోను షేరు చేసింది.
తాజాగా ఇన్స్‌టాలో ఫోటో షేర్
అయితే తన ముఖం కనిపించకుండా తన పెంపుడు కుక్కను పక్కన పెట్టుకొని బెడ్‌పైన ఉండటంతో మరింత ఆసక్తి పెరిగింది. సమంత ముఖాన్ని ఎందుకు దాచుకొన్నదంటూ ఆరా తీయడం మొదలుపెట్టారు. దీంతో సమంత ప్రెగ్నెన్సీ నిజమేనా అనే అనుమానాలను కొందరు వ్యక్తం చేస్తున్నారు.
భూమాత ఒడిలోనే మనం
ఇదిలా ఉండగా, వరల్డ్ ఎర్త్ డేను పురస్కరించుకొని మరో ఫోటోను సమంత షేర్ చేసింది. భూమాత మనకు సంబంధించినది కాదు. మనమంత భూమాతకు సంబంధించిన వాళ్లం అనే కాప్షన్ పోస్టు చేసింది. పర్యావరణం మనకు మూడో టీచర్. దానిని పరిరక్షించుకోవాల్సిందే. వాతావరణ మార్పులపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని సమంత స్పష్టం చేశారు.
Recommended Video

దక్షిణాదిలో బిజీగా
వరుస ఆఫర్లతో సమంత పలు చిత్రాలతో బిజీగా ఉన్నారు. తమిళంలో రెండు ప్రాజెక్టులను అంగీకరించింది. విజయ్ సేతుపతి, నయనతారతో కలిసి ఓ చిత్రంలో నటిస్తున్నది. అశ్విన్ శరవణన్ దర్శకత్వంలో మరో హారర్ చిత్రంలో నటించనున్నారు. కన్నడలో బెంగళూరు నాగరత్నమ్మ బయోపిక్‌లో నటించనున్నారు.


Click it and Unblock the Notifications











