Just In
- 4 hrs ago
ఆనందంలో తప్పు చేసేసింది!.. అయన అలా రిక్వెస్ట్ చేశారంటూ చెబుతోన్న అషూ రెడ్డి
- 4 hrs ago
బిగ్‌బాస్ సీజన్ 5లో శ్రీరెడ్డి.. కంటెస్టెంట్లకు భారీగా ఆఫర్లు.. శరవేగంగా ఏర్పాట్లు..
- 5 hrs ago
రొమాంటిక్ లుక్స్‌తో అదరగొట్టిన పూర్ణ.. వైరల్‌గా బ్యాక్‌డోర్ టీజర్
- 5 hrs ago
పొట్టి బట్టల్లో ఫిదా చేసింది.. లావణ్య త్రిపాఠిని ఇలా ఎప్పుడూ చూసి ఉండరు!
Don't Miss!
- News
ప్రేమోన్మాది ఘాతుకం: ఇంటికెళ్లి లేడీ టెక్కీ గొంతుకోశాడు, బాధితురాలికి బండి సంజయ్ పరామర్శ
- Finance
బంగారం ధర రూ.50,000కు చేరుకునే ఛాన్స్! రూ.45,500 వద్దనే ధరలు
- Sports
ఇంగ్లండ్‌లోనూ రెండు రోజుల్లో ముగుస్తాయి.. పిచ్‌పై ఫిర్యాదు చేయడానికి ఏంలేదు: ఆర్చర్
- Lifestyle
లైంగిక సంపర్కం సమయంలో మహిళలు చేసే ఈ పనులు పురుషులను ఉద్వేగానికి గురి చేస్తుంది!
- Automobiles
2021 ఫిబ్రవరిలో పుంజుకున్న మహీంద్రా ట్రాక్టర్ అమ్మకాలు.. కారణం ఇదేనా!!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
సమంత అభిమానులకు గుడ్ న్యూస్.. కన్ఫార్మ్ చేసి ఉత్కంఠకు తెర దించిన అక్కినేని కోడలు.!
సమంత.. ఈ పేరు తెలియని తెలుగు వారు ఉండరు అనడంలో సందేహం లేదు. అంతగా ఆమె ప్రభావం చూపిస్తోంది. 'ఏమాయ చేశావే'తో ఇండస్ట్రీకి పరిచయం అయిన సామ్.. మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. అక్కడి నుంచి వెనుదిరిగి చూడకుండా దూసుకుపోతోంది. ఈ క్రమంలోనే తెలుగులోని దాదాపు అందరు స్టార్ హీరోల సరసన నటించింది. వరుస ఆఫర్లతో పాటు భారీ స్థాయిలో రెమ్యూనరేషన్ కూడా అందుకుంది. సమంత తాజాగా ఓ ప్రశ్నకు సమాధానం చెప్పింది. దీంతో కొద్ది రోజులుగా నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. ఇంతకీ ఆమె ఏం చెప్పింది.?

సూపర్ ఫామ్‌లో సమంత.. ఇక్కడా అక్కడా హవా
కొన్నేళ్లుగా సమంత చేసిన సినిమాలన్నీ సూపర్ హిట్ అవుతున్నాయి. త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కించిన ‘అఆ'తో మెదలు పెడితే.. ఆమె వరుసగా ‘జనతా గ్యారేజ్', ‘రంగస్థలం', ‘మహానటి', ‘యూటర్న్', ‘మజిలీ', ‘ఓ బేబీ' వంటి విజయవంతమైన చిత్రాల్లో నటించింది. అలాగే, తమిళంలోనూ ‘మెర్సల్', ‘ఇరుంబుతిరై', ‘సూపర్ డీలక్స్'లతో సత్తా చాటింది.

సినిమా ఫలితం మారింది.. సమంత మాత్రం మారలేదు
సమంత తాజాగా ‘జాను' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తమిళంలో సూపర్ హిట్ అయిన ‘96'కు రీమేక్‌గా తెరకెక్కిన ఈ మూవీలో శర్వానంద్ హీరోగా నటించాడు. ఎన్నో అంచనాలతో విడుదలైన ఈ సినిమాకు మిశ్రమ స్పందన వచ్చింది. కానీ, ఇందులో సమంత చేసిన అభినయానికి మాత్రం తెలుగు ప్రేక్షకుల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది.

అదొక్కటి పూర్తి చేయడంపైనే సమంత ఫోకస్
చేతిలో ఉన్న ‘జాను' కూడా విడుదల అవడంతో సమంత చేయాల్సిన సినిమాలేవీ లేవు. అదే సమయంలో ఆమె ఏ సినిమాకూ గ్రీన్ సిగ్నల్ కూడా ఇవ్వలేదు. అయితే, ‘ద ఫ్యామిలీ మ్యాన్' అనే వెబ్ సిరీస్‌కు కొనసాగింపుగా వస్తున్న దాంట్లో మాత్రం ఆమె నటిస్తోంది. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ అమెజాన్ ప్రైమ్ వెబ్ సిరీస్‌లో సామ్ నెగెటివ్ రోల్ చేస్తోంది.

ఫ్యాన్స్‌లో కలవరం కలిగించిన సమంత స్టేట్‌మెంట్
ఇటీవల జరిగిన ‘జాను' ప్రమోషన్ కార్యక్రమాల్లో సమంత చేసిన ఓ స్టేట్‌మెంట్ ఆమె ఫ్యాన్స్‌లో కలవరాన్ని రేపింది. ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. ‘నేను ఇంకో రెండు మూడేళ్లు మాత్రమే నటిస్తాను. నాకు చాలా ముఖ్యమైన కుటుంబానికి సమయం కేటాయించాలి' అంటూ చెప్పుకొచ్చింది. దీంతో సమంత సినిమాలకు రిటైర్మెంట్ ప్రకటించిందంటూ ప్రచారం మొదలైంది.

ఉత్కంఠకు తెర దించిన అక్కినేని కోడలు.!
‘జాను' విడుదలైన తర్వాత జరిగిన ఓ ప్రత్యేకమైన కార్యక్రమంలో తన రిటైర్మెంట్ గురించి సమంత క్లారిటీ ఇచ్చింది. ‘నేను రిటైర్ అవుతున్నట్లు వస్తున్న వార్తల్లో ఏమాత్రం నిజం లేదు. పోయిన ఇంటర్వ్యూలో నేను సినిమాల నుంచి తప్పుకుంటా అనలేదు. నా క్రేజ్ తగ్గిపోతుందేమో అన్నాను. ఒకవేళ హీరోయిన్‌గా నటించకున్నా.. ఏదోలా ఇండస్ట్రీలోనే ఉంటాను' అని సామ్ చెప్పింది.