Don't Miss!
- News
మరోసారి భగ్గుమన్న తాడిపత్రి
- Finance
Bank Strike: బ్యాంకు ఖాతాదారులకు అలర్ట్.. ఆ రోజు కూడా బ్యాంకులు పని చేస్తాయి..!
- Technology
Moto E13 స్మార్ట్ ఫోన్ ధర మరియు లాంచ్ వివరాలు లీక్ ! స్పెసిఫికేషన్లు!
- Sports
IPL 2023 : ఆర్సీబీపై షాకింగ్ కామెంట్స్ చేసిన గేల్.. మండిపడుతున్న ఫ్యాన్స్!
- Automobiles
దేశీయ విఫణిలో విడుదలైన కొత్త BMW X1: ధర రూ. 45.90 లక్షలు
- Lifestyle
భాగస్వామితో పెరుగుతున్న విభేదాలను తొలగించడానికి ఈ పనులు చేయండి
- Travel
పచ్చని తలకోన.. చల్లని హార్స్లీ హిల్స్ చూసొద్దాం!
ఎవర్ గ్రీన్ క్వీన్ సమంతే.. ఆ రచ్చ జరిగినా నో చేంజ్.. టాలీవుడ్ లో టాప్ 10 హీరోయిన్స్ ఎవరంటే?
ప్రముఖ సర్వే సంస్థ ఆర్మాక్స్ మీడియా ఈ ఏడాది అక్టోబర్ నెలకు గాను టాప్ 10 తెలుగు హీరోలు, హీరోయిన్స్ లిస్ట్ రిలీజ్ చేసింది. ఈ సర్వేలో అత్యంత ప్రేక్షకాదరణ పొందిన తెలుగు హీరోగా మహేష్ బాబు మొదటి స్థానాన్ని నిలబెట్టుకున్నారు. హీరోలను ప్రకటించినట్టుగానే హీరోయిన్ జాబితాను కూడా రిలీజ్ చేయగా అందులో కూడా దాదాపు పాత స్థానాలు మళ్ళీ నిలుపుకున్నారు హీరోయిన్లు. అయితే అందులో కొన్ని స్థానాలు మారాయి. ఆ వివరాల్లోకి వెళితే
Recommended Video

1 - సమంత అక్కినేని 2 - కాజల్ అగర్వాల్
టాలీవుడ్ లో మోస్ట్ పాపులర్ తెలుగు స్టార్స్ ఫిమేల్ కేటగిరీలో సమంత ప్రతి నెల లాగే ఈ నెలలో కూడా మొదటి స్థానాన్ని నిలబెట్టుకుంది. చివరిగా జాను అనే సినిమాలో కనిపించిన ఆమె, ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ పార్ట్ 2 రిలీజ్ అయి మంచి పేరు తెచ్చుకుంది. ప్రస్తుతం ఒక తమిళ, అలాగే శాకుంతలం సినిమాల్లో నటిస్తోంది. విడాకుల ప్రకటన తరువాత ఆమె మరింత పాపులర్ అయింది.
ఇక కాజల్ అగర్వాల్ రెండో స్థానాన్ని నిలబెట్టుకుంది. చివరిగా మోసగాళ్లు అనే తెలుగు సినిమాలో కనిపించిన ఈ భామ ప్రస్తుతం నాలుగు తమిళ సినిమాలు చేస్తూ ఉండగా, తెలుగులో ఆచార్య అనే ఒక్క సినిమాలో మాత్రమే నటిస్తోంది. ఆమె గత నెల అంతా ప్రెగ్నెన్సీ వార్తల్లో నిలిచింది.

3- అనుష్కశెట్టి 4- పూజా హెగ్డే
సినిమాలలో కనిపించకున్నా అనుష్క ఈ జాబితాలో కూడా మూడో స్థానాన్ని నిలబెట్టుకుంది. చివరిగా నిశ్శబ్దం అనే సినిమాలో కనిపించిన అనుష్క మొన్న పుట్టిన రోజు సందర్భంగా యూవీ ప్రొడక్షన్స్ లో సినిమాని అనౌన్స్ చేసింది. ఆమె లిస్టులో మూడో స్థానంలో నిలవడం గమనార్హం. ఇక ఇక బుట్ట బొమ్మ పూజా హెగ్డే ఈ జాబితాలో నాలుగో స్థానాన్ని నిలబెట్టు కుంది.
చివరిగా అల వైకుంఠ పురంలో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ భామ ప్రస్తుతం ప్రభాస్ సరసన రాధేశ్యామ్ సినిమా చేస్తోంది. అలానే అక్కినేని అఖిల్ సరసన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాతో దసరాకు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

5- తమన్నా 6- సాయి పల్లవి
మిల్కీ బ్యూటీ తమన్నా ఈ జాబితాలో ఐదో స్థానాన్ని నిలబెట్టుకుంది. చివరిగా సీటీమార్, మాస్ట్రో సినిమాలలో నటించిన ఆమె ప్రస్తుతం తెలుగులో ఎఫ్ త్రీ, గుర్తుందా శీతాకాలం సినిమాల్లో కూడా నటిస్తోంది. సాయి పల్లవి తొమ్మిదో స్థానం నుంచి ఆరో స్థానానికి ఎగబాకింది. చివరిగా లవ్ స్టోరీ అనే సినిమాతో వచ్చి ప్రేక్షకులను ఆకట్టుకున్న సాయి పల్లవి ఇప్పుడు విరాటపర్వం సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది.

7-కీర్తీ సురేష్ 8-రష్మిక మందన్న
కీర్తి సురేష్ ఈ జాబితాలో ఆరో స్థానం నుంచి ఏడో స్థానంలో దిగజారింది. ఈ ఏడాది రంగ్ దే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ భామ ప్రస్తుతం తెలుగులో సర్కారు వారి పాట సినిమాలో మహేష్ బాబు సరసన హీరోయిన్ గా నటిస్తోంది. గీత గోవిందం భామ రష్మిక మందన్న ఈ జాబితాలో ఏకంగా ఏడో స్థానం నుంచి ఎనిమిదో స్థానానికి దిగజారింది. ఆమె చివరిగా సుల్తాన్ అనే సినిమాలో కనిపించింది. ప్రస్తుతం ఆమె అల్లు అర్జున్ సరసన పుష్ప అనే సినిమాలో అలాగే బాలీవుడ్ లో కొన్ని సినిమాల్లో నటిస్తోంది.

9 -రకుల్ ప్రీత్ సింగ్ 10 రాశి ఖన్నా
రకుల్ ప్రీత్ సింగ్ ఈ జాబితాలో ఎనిమిదో స్థానం నుంచి తొమ్మిదో స్థానానికి దిగజారింది. నిలబెట్టుకుంది. చివరిగా కొండపొలం అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన రకుల్ ఇటీవలే తన ప్రియుడిని పరిచయం చేసి, వార్తల్లో నిలిచింది. ఈ నెలలో మళ్లీ రాశి ఖన్నా స్థానం దక్కించుకుంది. ఆమె ప్రస్తుతం పక్కా కమర్షియల్, థాంక్యూ, అనే తెలుగు సినిమాలతో ప్రేక్షకులను పలకరించనుంది.