For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Shaakuntalam: కన్నీళ్లు పెట్టుకున్న సమంత.. డైరెక్టర్ అన్న మాటతో ఎమోషనల్.. ఓపిక లేదంటూ!

  |

  టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ఇటీవలే యశోద సినిమాతో సూపర్ హిట్ కొట్టింది. ఇప్పుడు మరో లేడి ఒరియెంటెండ్ మూవీతో ప్రేక్షకులను పలకరించనుంది. కాళిదాసు రచించిన అభిజ్ఞాన శాకుంతలం ఆధారంగా చేసుకుని తెరకెక్కిన చిత్రం శాకుంతలం. ప్రముఖ తెలుగు దర్శకుడు గుణ శేఖర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మరో కీలక పాత్ర దుష్యంతుడిగా మలయాళ నటుడు దేవ్ మోహన్ నటించాడు. ఈ సినిమాలో స్పెషల్ అట్రాక్షన్ గా అల్లు అర్హ నిలవనుంది. అయితే మయోసిటీస్ వ్యాధితో బాధపడుతున్న సమంత బయటకు రావట్లేదు. తాజాగా శాకుంతలం ట్రైలర్ లాంచ్ సందర్భంగా బయటకొచ్చిన సామ్ కన్నీళ్లు పెట్టుకుంది.

  మయోసిటీస్ వ్యాధితో..

  మయోసిటీస్ వ్యాధితో..

  కొంతకాలంగా మయోసిటీస్ అనే కండరాల వ్యాధితో బాధపడుతున్న సామ్ చాలాకాలంగా హైదరాబాద్ లోని ఇంట్లోనే ఉంటుంది. మీడియా ముందుకు కూడా రావట్లేదు. ఇటీవలే ఎయిర్ పోర్ట్ లో దర్శనమిచ్చిన సామ్ తాజాగా శాకుంతలం ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో కనిపించి అందరిని పలకరించింది. ఈ సందర్భంగా శాకుంతలం సినిమా గురించి.. తనకు ఓపిక లేకున్నా ఈ ఈవెంట్ కు ఎందుకు వచ్చిందో పలు విషయాలను పంచుకుంది సామ్.

  ప్రతి సినిమా ప్రాణం పెట్టి...

  ప్రతి సినిమా ప్రాణం పెట్టి...

  "ట్రైలర్ కు మీరు ఇచ్చిన రెస్పాన్స్ చూస్తే చాలా సంతోషంగా ఉంది. ఇవాళ నేను ఓపిక లేకున్నా శక్తి తెచ్చుకుని ఎలాగైనా ఇక్కడికి రావాల్సిందే అని ఫిక్స్ అయిపోయాను. గుణ శేఖర్ గారిపై ఉన్న రెస్పెక్ట్, అభిమానం వల్ల వచ్చాను. కొంతమందికి వాళ్ల జీవితంలో సినిమా అనేది భాగమే. కానీ గుణ శేఖర్ గారికి సినిమానే ఆయన జీవితం. ప్రతి సినిమా ప్రాణం పెట్టి తీస్తారు. అలాగే ఈ శాకుంతలం కూడా అలాగే తీశారు. ఈ ట్రైలర్ తర్వాత మీరు ఇచ్చే ప్రశంసలు చూడాలనే వచ్చాను. అది చాలా ముఖ్యం" అని సమంత తెలిపింది.

  పాదాలపై పడి థ్యాంక్స్..

  పాదాలపై పడి థ్యాంక్స్..

  "సినిమా నేరేషన్ విన్నప్పుడూ ఊహించనట్లే రావాలని యాక్టర్స్ అందరూ కోరుకుంటారు. కానీ, కొన్నిసార్లు మాత్రమే మా ఊహను దాటి ఏదో ఒక ఎక్స్ ట్రా మ్యాజిక్ జరుగుతుంది. శాకుంతలం సినిమా చూశాకా అదే నేను ఫీల్ అయ్యాను. ఇది నేను ఊహించినదానికంటే ఎన్నో రెట్లు బాగుంది. నాకు చాలా సంతోషంగా అనిపించింది. గుణ శేఖర్ గారి పాదాలపై పడి థ్యాంక్యూ చెప్పాను. థ్యాంక్యూ సో మచ్" అని సామ్ పేర్కొంది.

  ప్యాషనేట్ ప్రొడ్యూసర్ దిల్ రాజు..

  "దిల్ రాజు గారికి చాలా థ్యాంక్యూ. సినిమాను నమ్మి.. శాకుంతలం అనే మ్యాజికల్ ప్రపంచాన్ని క్రియేట్ చేయడానికి ఎలాంటి లిమిట్స్ లేకుండా, క్యాలిక్యులేషన్స్ లేకుండా నమ్మకం, ఒక ప్యాషన్ తో చేయాలి. అలాంటి ప్యాషనేట్ ప్రొడ్యూసర్ ని దిల్ రాజుగారిలో చూశాను. ఈ సినిమాలో చాలా పెద్ద సీనియర్ నటీనటులు ఉన్నారు. వాళ్లందరికి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో థ్యాంక్యూ చెప్పుకుంటాను" అని సమంత చెప్పుకొచ్చింది.

  మారనిది ఒక్కటే..

  మారనిది ఒక్కటే..

  "నేను సెట్ లోకి అడుగు పెట్టగానే అక్కడున్న అమ్మాయిల రియాక్షన్ చూసి పర్ఫెక్ట్ దుష్యంతుడు దొరికాడని ఫిక్స్ అయ్యాను. కాళిదాసు గారు ఐదో శతాబ్ధంలో రాసిన అభిజ్ఞాన శాకుంతలం ఆధారంగా చెసుకున్న ఈ సినిమా కోసం నన్ను గుణ శేఖర్ గారు ఎంపిక చేయడం నా అదృష్టం. నేను జీవితంలో ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నాను. అయితే మారనిది ఒక్కటే ఉంది. అదే సినిమాను నేను ఎంత ప్రేమిస్తాను. సినిమా నన్ను ఎంత ప్రేమిస్తుందనే విషయం. శాకుంతలం సినిమాతో ఈ ప్రేమ మరింత పెరుగుతుందని నమ్ముతున్నాను" అని సామ్ తెలిపింది.

  కన్నీళ్లతో సామ్..

  శాకుంతలం సినిమా ట్రైలర్ లాంచ్ సందర్భంగా డైరెక్టర్ గుణ శేఖర్ మాట్లాడారు. ఆయన మాట్లాడుతుండగా సామ్ ఎంతగానో ఎమోషనల్ అయింది. ఈ సినిమాకు నిజమైన హీరో సమంత అని ప్రశంసించారు గుణ శేఖర్. దీంతో సమంత ఒక్కసారిగా కన్నీటి పర్యంతమైంది. చాలా సంతోషంగా ఉన్న సామ్ ఓవైపు నవ్వుతూనే మరోవైపు కన్నీళ్లను తుడుచుకుంది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది. ఎపిక్ మైథాలాజికల్ తెరకెక్కిన ఈ పాన్ ఇండియా సినిమాను మహా శివరాత్రి సందర్భంగా ఫ్రిబవరి 17న ప్రేక్షకులు ముందుకు తీసుకురానున్నారు.

  English summary
  Samantha Eyes Get Into Tears After Gunasekhar Speech In Shaakuntalam Movie Trailer Launch Event.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X