Don't Miss!
- News
తారకరత్న కోసం బాలకృష్ణ సంకల్పం..!!
- Finance
Dalit Bandhu: ప్రజలు మెచ్చిన దళితబంధు.. విజయవంతంగా ముందుకు..
- Sports
WPL 2023: ఫిబ్రవరి 13న మహిళల ఐపీఎల్ వేలం!
- Lifestyle
Women Money Habits: మహిళల ఈ అలవాట్లతో ఉన్నదంతా పోయి బికారీ కావాల్సిందే!
- Technology
ఈ ఫోన్లు వాడుతున్నారా? కొత్త OS అప్డేట్ చేస్తే ఇబ్బందుల్లో పడతారు జాగ్రత్త!
- Travel
బెజవాడకు చేరువలోని ఈ జైన దేవాలయం గురించి మీకు తెలుసా!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
Samantha: సమంతకు పవర్ ఫుల్ క్రిస్మస్ గిఫ్ట్ ఇచ్చిన హీరో.. వారందరికీ అంటూ ఎమోషనల్ గా సామ్!
ఏ మాయ చేశావే సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన సమంత అతి తక్కువ కాలంలోనే ఎనలేని స్టార్ డమ్ ను సంపాదించుకుంది. అగ్ర హీరోల సరసన వరుస సినిమాలు చేసి మోస్ట్ పాపులర్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. ఇటీవల యశోద సినిమాతో సూపర్ హిట్ కొట్టిన సామ్ మరో లేడీ ఒరియెంటెడ్ మూవీ శాకుంతలం చేస్తోంది. గుణ శేఖర్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా షూటింగ్ పూర్తయిందని టాక్ వినిపిస్తోంది. ఇక సమంతకు మయోసిటీస్ వ్యాధి రావడంతో కొత్త సినిమాలు ఒప్పుకోనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఇంట్లోనే ఉంటున్న సామ్ కు హీరో అండ్ డైరెక్టర్ రాహుల్ రవీంద్రను మంచి ఎనర్జీ ఇచ్చే గిఫ్ట్ పంపాడు. దానికి స్పందిస్తూ సమంత పోస్ట్ షేర్ చేసింది.

సమంతపై అనేక రూమర్స్..
విభిన్నమైన పాత్రలు, గ్లామర్ తో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది స్టార్ హీరోయిన్ సమంత. ఇటీవల యశోద సినిమా హిట్ కొట్టడమే కాకుండా విమర్శకుల నుంచి ప్రశంసలు కూడా అందుకుంది. ఇక సామ్ పౌరాణిక నేపథ్యం గల శాకుంతలం సినిమా చేస్తోంది. అయితే ఈ సినిమా షూటింగ్ పూర్తి అయిందని టాక్ వినిపిస్తోంది. ఇదిలా ఉంటే సమంతను ఇదివరకు అనేక రూమర్స్ చుట్టుముట్టాయి.

ఆశ్చర్యానికి గురి చేసిన పోస్ట్..
సమంత చర్మ వ్యాధితో బాధపడుతోందని, గర్భసంచి తొలగించుకుంది, ట్రీట్మెంట్ కోసం అమెరికా వెళ్తుందని ఇలా చాలా రకాలుగా ప్రచారం జరిగింది. అయినా సామ్ మాత్రం స్పందించలేదు. కానీ యశోద విడుదలకు ముందు ఆ సినిమా ట్రైలర్ కు వచ్చిన స్పందన చూసి సమంత రియాక్ట్ అవుతూ పోస్ట్ చేసింది. ఆ పోస్ట్ ఒక్కసారిగా ప్రేక్షకులందరినీ తీవ్ర ఆశ్చర్యానికి గురి చేసింది. అప్పుడే సమంత మయోసిటీస్ అనే వ్యాధితో బాధపడుతోందని సినీ లోకానికి తెలిసింది.

షూటింగ్స్ లో పాల్గొనలేని పరిస్థితి..
మయోసిటీస్ తో బాధపడుతున్న సామ్ ప్రస్తుతం ఇంట్లోనే ఉంటున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఆమె చికిత్స కోసం దక్షిణ కొరియా వెళ్లిందని రూమర్లు వస్తూనే ఉన్నాయి. అయితే సామ్ మాత్రం హైదరాబాద్ లోని తన ఇంట్లోనే ఉంటూ చికిత్స తీసుకుంటుందని సమాచారం. ఇక ఇప్పుడు సమంత బయటకు వచ్చి సినిమా షూటింగ్ లో పాల్గొనే పరిస్థితి లేనట్లు కనిపిస్తోంది. అందుకే కొత్త సినిమాలు ఏవి సామ్ ఒప్పుకోవట్లేదట. కానీ విజయ్ దేవరకొండ ఖుషి సినిమాను పూర్తి చేయాలని అనుకుంటోందట సమంత.

ఉక్కు మహిళగా అభివర్ణిస్తూ..
ఖుషి సినిమా తర్వాత కొన్ని రోజులు పూర్తిగా మూవీస్ కు దూరంగా ఉండాలని సామ్ భావిస్తోందట. ఖుషి సినిమా జనవరిలో సెట్స్ పైకి వెళ్తుందని సమాచారం. ఇదిలా ఉంటే తాజాగా సమంతకు క్రిస్మస్ గిఫ్ట్ పంపాడు హీరో, డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్. అది ఒక శక్తివంతమైన మెసెజ్ తో ఎనర్జీ నింపుతూ ఫొటోను బహుమతిగా అందించాడు. ఈ ఫొటోలో సమంత ఉక్కు మహిళగా (వుమెన్ ఆఫ్ స్టీల్) అభివర్ణించాడు రాహుల్.

నువ్ ఒక యోధురాలివి..
"ప్రస్తుతం నీ దారి చీకటిగా ఉండొచ్చు. కానీ త్వరలోనే అది వెలుగుతో ప్రకాశిస్తుంది. ఇప్పుడు నువ్ కదలడం కష్టంగా ఉండొచ్చు. కానీ త్వరలోనే అన్ని బాగుంటాయి. ఎందుకంటే నువ్ ఉక్కు మహిళవి. విజయం నీ జన్మ హక్కు. నువ్వు ఒక యోధురాలివి. నిన్ను ఏది ఓడించలేదు. ఇలాంటివి నిన్ను మరింత స్ట్రాంగ్ గా చేస్తాయి. ఎప్పటికీ స్ట్రాంగ్ ఉండేలా చేస్తాయి" అని రాసి ఉన్న ఫొటోను సమంతకు గిఫ్ట్ గా రాహుల్ ఇచ్చాడు.
పోరాడుతూనే ఉండండి..
ఈ ఫోటోను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది సమంత. "థ్యాంక్యూ రాహుల్. బయట ఎవరైతో తమ జీవితాలతో పోరాడుతున్నారో వారందరి కోసం చెబుతున్నా. పోరాడుతూనే ఉండండి. ఇంకా మీరు బలంగా తయారవుతూ ఉంటారు. ఇంక దృఢంగా మారి కష్టాలను ఎదురిస్తారు" అని ఎమోషనల్ గా రాసుకొచ్చింది బ్యూటిఫుల్ సమంత. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. "టేక్ కేర్ సమంత. నువ్ ఒక సూపర్ వుమెన్, యోధురాలివి. మీకు మరింత బలం చేకూరాలి" అని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.