ప్రియుడితో సమంత రొమాంటిక్ డేట్.. మీడియా కంటికి చిక్కిన లవ్ బర్డ్స్!
స్టార్ హీరోయిన్ సమంత ఇటీవలి కాలంలో సినిమాల కంటే తన వ్యక్తిగత జీవితంతోనే వార్తల్లో నిలుస్తున్నారు. ముఖ్యంగా బాలీవుడ్ దర్శకుడు రాజ్ నిడిమోరుతో ఆమె రిలేషన్‌పై నిత్యం వార్తలు వస్తున్నాయి. తమ మధ్య ఉన్నది కేవలం ఫ్రెండ్‌షిప్పేనా? లేక అంతకు మించి మరొకటా అనేది మాత్రం వీరిద్దరూ మాత్రం చెప్పడం లేదు. తాజాగా మరోసారి వీరిద్దరూ పబ్లిక్‌గా దొరికిపోయారు. ఈ వివరాల్లోకి వెళితే..
రాజ్ నిడిమోరుతో సన్నిహితంగా
సమంతతో విడాకుల తర్వాత శోభిత ధూళిపాళను తన జీవితంలో ఆహ్వానించి.. సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు నాగచైతన్యం. దీంతో సమంత కూడా మరో పెళ్లి చేసుకుంటారా? అంటూ మీడియాలో విస్త్రతంగా కథనాలు వచ్చాయి. ఈ క్రమంలోనే తనతో ది ఫ్యామిలీ మెన్, సిటాడెల్: హనీ బన్నీ వెబ్ సిరీస్‌లు చేసిన రాజ్ నిడిమోరుతో సమంత సన్నిహితంగా ఉంటున్నారంటూ పుకార్లు వైరల్ అయ్యాయి.

ఒకే కారులో చక్కర్లు
సమంత ఎక్కడ ఉంటే రాజ్ అక్కడ ఉండటంతో ఈ వార్తలకు బలం చేకూరుతోంది. కలిసి పికెల్ బాల్ ఆడటంతో పాటు సీక్రెట్‌గా పార్టీలు, వెకేషన్స్‌తో రాజ్- సమంతలు చక్కర్లు కొట్టడం ఈ వార్తలకు మరింత బలాన్ని చేకూరుస్తున్నాయి. కొద్దిరోజుల క్రితం అమెరికాలోని డెట్రాయిట్ వీధుల్లో సమంత - రాజ్ కనిపించారు. దీని నుంచి తేరుకోకముందే ముంబైలోని ఓ రెస్టారెంట్‌లో డిన్నర్ చేయడానికి సమంత- రాజ్‌లు జంటగా ఒకే కారులో వెళ్లిన ఫోటోలు, వీడియోలు వైరల్ అయ్యాయి.
ఫ్లైట్‌లో అలాంటి ఫోజులు
ఇక సమంత నిర్మాతగా మారి నిర్మించిన శుభం సినిమా వ్యవహారాలను రాజ్ దగ్గరుండి పర్యవేక్షించారని వార్తలు వచ్చాయి. అలాగే ఈ సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్ సందర్భంగా ఇద్దరూ ఒకే విమానంలో జర్నీ చేశారు. ఈ సమయంలో రాజ్ భుజాలపై సమంత తలపెట్టుకుని పడుకున్నారు. ఆ తర్వాత ఆయనతో కలిసి తిరుమల శ్రీవారి ఆలయం, శ్రీకాళహస్తి ఆలయాలను సమంత దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించడం చర్చనీయాంశమైంది.
గుడ్ న్యూస్ కోసం వెయిటింగ్
ఈ పరిణామాలతో రాజ్ - సమంతలో రేపో మాపో గుడ్ న్యూస్ చెబుతారని అంతా భావిస్తున్నారు. అటు రాజ్ నిడిమోరు తెలుగువారు కావడం విశేషం. చిత్తూరు జిల్లాకే చెందిన ఆయన ఇప్పటికే శ్యామలాదేను పెళ్లాడారు. ఆవిడకు విడాకులిచ్చి సమంతను రాజ్ రెండో పెళ్లి చేసుకుంటారని గాసిప్స్ వస్తున్నాయి. ఈ పరిణామాలపై శ్యామల పలుమార్లు పరోక్ష వ్యాఖ్యలు చేస్తూ అప్పుడప్పుడు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. మొన్నామధ్య నమ్మకం, విశ్వాసం వంటి అంశాలపై ఆమె చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
ఆ ప్లేస్‌లో ప్రత్యక్షమైన ప్రేమ జంట
తాజాగా సమంత - రాజ్ నిడిమోరులు చెట్టాపట్టాలేసుకుని తిరుగుతూ పబ్లిక్‌గా దొరికిపోయారు. ముంబై బాంద్రాలోని ఓ జిమ్ నుంచి సమంత, రాజ్‌లు బయటికి వస్తోన్న వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అందులో వీరిద్దరూ లైట్ పింక్ కలర్ డ్రెస్ ధరించి నడచుకుంటూ వచ్చి ఒకే కారులో తిరిగి వెళ్లిపోయారు. దీంతో సమంత- రాజ్ నిడిమోరులు తమ బంధంపై క్లారిటీ ఇవ్వాలని నెటిజన్లు, అభిమానులు డిమాండ్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











