‘అలాంటి సమయంలో అతడు నా జీవితంలోకి.. నాకు రియల్ లవ్‌ను పంచి నన్ను సంపూర్ణంగా’
దక్షిణాదిలో స్టార్ హీరోయిన్ సమంత రుత్ ప్రభు నిత్యం ఏదో ఒక వార్తతో మీడియాలో హెడ్‌లైన్లను ఆకర్షిస్తూనే ఉంటారు. నటిగానే కాకుండా నిర్మాతగా మారిన ఆమె.. ఎక్కువ ఫిట్‌నెస్ విషయంలోను, అలాగే దర్శకుడు రాజ్ నిడిమోరుతో డేటింగ్ విషయంలోను ఆమె మీడియాలో హైలెట్ అవుతుంటారు. అయితే తన జీవితంలో భారీ కుదుపుకు లోనైన తర్వాత ఆమె ఇప్పుడిప్పుడే జీవితాన్ని ప్రేమతో ఆస్వాదిస్తున్నట్టు కనిపిస్తున్నారు. అయితే ఆ విషయంలో క్లారిటీ ఇవ్వకపోయినా.. తన పోస్టులతో నర్మగర్భంగా వెల్లడించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే తాజా తన లైఫ్‌లో రియల్ లైఫ్ గురించి వీడియో రూపంలో వెల్లడించిన విషయం ఏమిటంటే?
టాలీవుడ్ స్టార్ హీరో నాగచైతన్యతో లవ్ మ్యారేజ్ బ్రేకప్ అయిన తర్వాత సమంత రుత్ ప్రభు తీవ్రంగా డిప్రెషన్‌లో మునిగిపోయారు. ఆ సమయంలోనే ఆమె ఆరోగ్యం తీవ్రంగా క్షీణించింది. దాంతో ఆమె మళ్లీ సినిమా తెరపైన కనిపిస్తారా? అనే విషయంపై అనేక సందేహాలు కొందరిలో వ్యక్తమయ్యాయి. అయితే వాటన్నింటిని ధీటుగా ఎదురించిన సమంత... మళ్లీ గాడిలో పడింది.

అయితే వైవాహిక జీవితం వైఫల్యమైన తర్వాత మరోసారి ప్రేమలో పడిందనే వార్తలు వినిపిస్తున్నాయి. రాజ్ నిడిమోరుతో ఆమె సన్నిహిత జీవితం అనేక అనుమానాలకు బలం చేకూరేలా చేశాయి. అయితే వాటిని పట్టించుకోకుండా ఇద్దరు కలిసి చెట్టాపట్టాలేసుకొని క్లోజ్‌గా ఉంటూ వారిద్దరి లవ్లీ కెమిస్ట్రీతో తమ బంధాన్ని పరోక్షంగా చెప్పే ప్రయత్నం చేశారు.
తాజాగా తన రియల్ లైఫ్ గురిచి ఓ వీడియోను సోషల్ మీడియాలో రిలీజ్ చేసింది. ఎవరికైనా 30 ఏళ్లు పైబడితే.. ఆందం తరిగిపోతుంది. చర్మ పాలిపోతుంది అనే భయంతో రెండు పదుల వయసులో గట్టిగా. విశ్రాంతి లేకుండా ఆదరబాదర జీవితం గడుపుతూ తీరిక లేకుండా పరుగులు పెడుతుంటాం. కానీ నీ జీవితంలో అన్నీ సంపూర్ణంగా ఉందని నాకు చెప్పలేదు. కానీ నా జీవితంలో ఎవరో కూడా తెలియని వ్యక్తి నాకు రియల్ లవ్.. లవ్ అంటే ఏమిటో చెప్పారు అని సమంత తన వీడియోలో పేర్కొన్నది.
నాకు 30 ఏళ్లు వచ్చిన తర్వాత నేను చాలా మృధువుగా మారిపోయాను. గతంలో జరిగిన తప్పులను ఎంచుకోకుండా.. వాటిని ఆలోచించడం ఆపేశాను. జంటగా జీవించడం ఆపేశాను. ఒంటరిగానే మౌనంగా గడపటం మొదలుపెట్టాను. అలాంటి పరిస్థితుల్లో సడెన్‌గా ఓ వ్యక్తి రావడం నన్ను మరింత సజీవంగా మార్చింది. ప్రతీ అమ్మాయికి ఇలాంటి అనుభూతి దొరకాలని అనిపించింది. నేను సంపూర్ణంగా మహిళను అయ్యాను. ప్రశాంతత లభించింది. ప్రపంచమంత స్వేచ్ఛగా మారింది అని సమంత భావోద్వేగాన్ని పంచుకొన్నారు.
సమంత కెరీర్ విషయానికి వస్తే.. యశోదతో మంచి సక్సెస్ చేజిక్కించుకొన్న ఆమె శుభం మూవీతో నిర్మాతగా మారారు. ఆమె ఈ సినిమా మంచి విజయం సాధించి పెట్టింది. ఇక ఈ మూవీ తర్వాత నెట్‌ఫ్లిక్స్ కోసం రక్త్ బ్రహ్మండ్ అనే వెబ్ సిరీస్‌లో నటిస్తున్నారు. ఈ సిరీస్‌ను రాజ్ నిడిమోరు, కృష్ణ డీకే నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో వమికా గబ్బి, జయదీప్ అహ్లావత్, ఆదిత్య రాయ్ కపూర్, అలీ ఫజల్ తదితరులు నటిస్తున్నారు.


Click it and Unblock the Notifications











