Samantha Ruth Prabhu నెటిజన్ తింగరి ప్రశ్న.. గూగుల్‌లో వెతుకు అంటూ సమంత ఘాటైన జవాబు
దక్షిణాది స్టార్ హీరోయిన్ సమంత రుత్ ప్రభు వ్యక్తిగత జీవితాన్ని పరిపూర్ణంగా ఆస్వాదిస్తున్నట్టు కనిపిస్తున్నది. లైఫ్‌లో చోటుచేసుకొన్న సంఘటనల నుంచి వేగంగా తేరుకొన్న ఈ బ్యూటీ ఇప్పుడు విహారయాత్రలతో జోష్‌ను కొనసాగిస్తున్నారు. ఇటీవలే విదేశాలకు వెళ్లి వచ్చిన సమంత మళ్లీ తన స్నేహితులతో కలిసి సొంత రాష్ట్రంలో హాలీడే టైమ్‌ను ఎంజాయ్ చేస్తున్నది. అయితే ఇలా లైఫ్‌ను ఎంజాయ్ చేస్తున్న ఈ భామ తాజాగా అభిమానులు, నెటిజన్లతో ప్రశ్నోత్తర కార్యక్రమాలను సోషల్ మీడియాలో నిర్వహించింది. అయితే ఓ తింగరి అడిగిన ప్రశ్నకు ఘాటుగా సమాధానం ఇవ్వడం వైరల్‌గా మారింది. ఈ వివరాల్లోకి వెళితే..
కేరళ అందాలను ఆస్వాదిస్తూ..
సమంత వ్యక్తిగత జీవితం విషయానికి వస్తే.. ప్రస్తుతం ఆమె తన బెస్ట్ ఫ్రెండ్‌తో కలిసి కేరళలో విహరిస్తున్నది. అథిరాప్పిల్లీ వాటర్ ఫాల్స్‌ను సందర్శించినట్టు సోషల్ మీడియాలో ఫోటోలు షేర్ చేసింది. ఇటీవల కేరళలోని అలెప్పీ బీచ్‌లో స్నేహితురాలితో కలిసి సూర్యాస్తమయం సమయాన్ని ఎంజాయ్ చేస్తున్న క్షణాలను ఫోటోగా మలిచి సోషల్ మీడియా ద్వారా పంచుకొన్నది. అయితే తన ముఖాన్ని చూపించకుండా అభిమానులను ఊరిస్తూ ఫోటోలో కనిపించింది.

అలెప్పీ బీచ్‌లో స్నేహితురాలితో కలిసి
అలెప్పీ బీచ్‌లో సమంత తన అందాలను ఆరబోస్తూ కనిపించింది. వైట్ కలర్ మ్యాచింగ్ ప్యాంట్, టీ షర్ట్‌లో దర్శనమిచ్చింది. జుట్టు ఆరబోసుకొని ఆనందంలో మునిగిపోయినట్టు కనిపించింది. స్నేహితురాలితో కలిసి ఎరుపెక్కిన సముద్ర తీరాన్ని, వాటి అందాలను ఆస్వాదిస్తున్నట్టు కనిపించింది. ఇలా సమంత తన జీవితంలోని చేదు గుర్తులను తుడిపేసుకొనేందుకు ప్రయత్నిస్తున్నది.

నన్ను ఏమైనా అడగండి అంటూ
ఇక తాజాగా సోష్ మీడియాలో Ask me anything? అనే సెషన్‌ను నిర్వహించింది. పలు ప్రశ్నలకు చాలా ఓపికగా సమాధానాలు చెప్పింది. అయితే ఓ తింగరి నెటిజన్ తనతో మాట్లాడుతూ.. మీరు రీ ప్రోడ్యూస్ చేశారా? లేక నన్ను మిమ్మల్ని రీప్రొడ్యూస్ చేయాలా అంటూ ప్రశ్నించాడు. అయితే దానికి చాలా చురుకగా సమాధానం ఇస్తూ.. ఓ వాక్యంలో రీ ప్రొడ్యూస్ అనే పదాన్ని ఎలా ఉపయోగించాలనే విషయాన్ని ఆలోచిస్తున్నాను. నీవు దానిని గూగుల్‌లో ఓసారి సర్చ్ చేసి చూడకూడదా అంటూ రిప్లై ఇచ్చింది.

యువతకు నేను ఇచ్చే సలహా ఇదే..
ఇక మరికొందరు యంగ్ జనరేషన్‌కు మీరు ఇచ్చే సలహా ఏమిటి? అంటే.. కాస్త బ్రేక్ తీసుకోండి.. ఎక్కువగా ఎనర్జీ వేస్ట్ చేసుకోకండి అంటూ తెలివిగా సమాధానం ఇచ్చింది. మీరు భవిష్యత్‌లో ఏ సినిమాకైనా దర్శకత్వం వహిస్తారా అని మరో నెటిజన్ అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ.. నేను జీవితంలో దేనికి కాదు.. కూడదు అని చెప్పకూడదని ఆలస్యంగా రియలైజ్ అయ్యాను అని చెప్పారు. అలాగే మీ జీవిత లక్ష్యం ఏమిటి అని మరో నెటిజన్ అడిగిన ప్రశ్నకు.. అన్నీ గుర్తుంచుకోవడమే అని సమాధానాలను తనదైన శైలిలో ఇచ్చింది.
Recommended Video
సమంత సినిమా కెరీర్ ఇలా..
సమంత రుత్ ప్రభు సినిమా కెరీర్ విషయానికి వస్తే.. తాజాగా అల్లు అర్జున్ నటించిన పుష్ప చిత్రంలోని ఊ అంటావా? ఊఊ అంటావా ఓ స్పెషల్ సాంగ్ సమంత నటించింది. ఈ పాటలో స్టెప్పులు వేసినందుకు సమంతకు మంచి రెస్సాన్స్ లభించింది. ఇక యశోదా అనే చిత్రంలోను, అలాగే తమిళ చిత్రం కాతువాకుల రెండు కాదల్‌లో నయనతారతో కలిసి నటిస్తున్నారు. ఇంకా పలు చిత్రాలు చర్చల దశలో ఉన్నట్టు సమాచారం. సమంత నటించిన శాకుంతలం సినిమా పోస్టర్‌ను ఇటీవల రిలీజ్ చేయగా మంచి రెస్పాన్ వచ్చింది.


Click it and Unblock the Notifications











