Samantha Ruth Prabhu స్ట్రాంగ్ పెర్ఫార్మర్.. లైఫ్‌లో మంచి ఫైటర్.. వరలక్ష్మీ శరత్‌కుమార్!

టాలీవుడ్‌లో అభిరుచి గల సినిమాలను రూపొందించే సినీ నిర్మాణ సంస్థ శ్రీదేవి మూవీస్ బ్యానర్‌పై సమంత రుత్ ప్రభు ప్రధాన పాత్రలో ప్రముఖ నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మించిన చిత్రం యశోద. హరి, హరీష్ దర్శక ద్వయం రూపొందించిన చిత్రంలో వరలక్ష్మీ శరత్ కుమార్, ఉన్ని ముకుందన్, రావు రామేశ్, మురళీ శర్మ, రావు రమేష్ తదితరులు నటించారు. ఈ చిత్రం నవంబర్ 4 తేదీన రిలీజ్ అవుతున్న చిత్రం గురించి, సమంతతో తన రిలేషన్ గురించి వరలక్ష్మీ శరత్ కుమార్ మాట్లాడుతూ...

సమంత నాకు ముందు నుంచే పరిచయం ఉంది. నాకు సామ్‌కు 13 ఏళ్లకుపైగా అనుబంధం ఉంది. ఆ పరిచయం ఈ సినిమాకు బాగా పనికి వచ్చింది. మా మధ్య ఉన్న స్నేహం కారణంగా మా పాత్రల మధ్య ఎమోషన్స్ పండాయి. చాలా సీరియస్ సన్నివేశాలను కూడా ఇద్దరం జోకులు వేసుకొంటూ.. నవ్వుతూ నటించాం అని వరలక్ష్మీ శరత్ కుమార్ తెలిపారు.

Samantha Ruth Prabhu is strong performer and fighter says Varalaxmi Sarathkumar

13 ఏళ్ల క్రితం చూసిన సమంత వేరు.. ఇప్పుడు చూసిన సామ్ వేరు. నటిగా ఆమె ఎన్నో మైలురాళ్లను అధిగమించింది. బ్యూటిఫుల్ యాక్టర్. ఆమె ఎదిగిన తీరు స్పూర్తిదాయకంగా ఉంటుంది. ఆమెను ఎన్నోసార్లు కంగ్రాట్స్ చేశాను.

సమంత నటిగా చాలా డేడికెటివ్. యాక్షన్ సీన్లు, ఫైట్స్‌లో ఆమె ఎనర్జీ గొప్పగా ఉంది. మంచి ఫెర్ఫార్మర్. జీవితంలో మంచి ఫైటర్. ఆమె స్ట్రాంగ్ పెర్ఫార్మర్. అలాంటి యాక్టర్‌తో నటించేటప్పుడు చాలా పాజిటివ్ వైబ్స్ ఉంటాయి. సమంతకు నాకు మధ్య చాలా కామన్ సీన్లు ఉంటాయి. సరోగసి కథ కావడంతో ఎక్కువ మంది లేడి ఆర్టిస్టులతో సెట్ కళకళలాడింది అని వరలక్ష్మీ శరత్ కుమార్ చెప్పారు.

క్రాక్ సినిమాలో జయమ్మ రోల్ తర్వాత నాకు చాలా ఆఫర్లు వస్తున్నాయి. అలాంటి పాత్రలతోనే అప్రోచ్ అవుతున్నారు. రచయితలు నా కోసం ప్రత్యేకంగా క్యారెక్టర్లు రాస్తున్నారు. ఇప్పుడు నేను తెలుగులో ఎక్కువ సినిమాలు చేస్తున్నాను. ప్రస్తుతం ఎక్కువగా తెలుగు సినిమాలే చేస్తున్నాను. హైదరాబాద్‌లోనే ఇల్లు తీసుకొని ఉంటున్నాను అని వరలక్ష్మీ శరత్ కుమార్ తెలిపారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X