Yashoda అనారోగ్యాన్ని పక్కన పెట్టి.. యశోద కోసం సమంత.. సోషల్ మీడియాలో పోస్టు వైరల్

ది ఫ్యామిలీ మ్యాన్ 2 వెబ్ సిరీస్‌తో పాన్ ఇండియా స్టార్‌గా మారిన సమంత రుత్ ప్రభు మరోసారి దేశవ్యాప్తంగా తన అభిమానులను, ప్రేక్షకులను ఆకట్టుకొనేందుకు యశోద సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. శ్రీదేవీ మూవీ బ్యానర్‌లో నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మించిన యశోద సినిమా నవంబర్ 11వ తేదీన విడుదలకు సిద్దమైంది. అయితే ఈ సినిమా రిలీజ్‌కు ముందు సమంత తీవ్ర అనారోగ్యానికి గురి కావడం తెలిసిందే. అయితే యశోద సినిమా కోసం తన ఆరోగ్యాన్ని లెక్క చేయకుండా ప్రమోషన్స్‌కు రావడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. సమంత తీసుకొన్న రిస్క్ విషయంలోకి వెళితే..

మయోసిటిస్ అనే వ్యాధితో

మయోసిటిస్ అనే వ్యాధితో

ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన యశోద చిత్రం తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో రిలీజ్ అవుతున్నది. అయితే ఈ సినిమా రిలీజ్‌కు సిద్దమవుతుండగా.. తనకు మయోసిటిస్ అనే వ్యాధితో బాధపడుతున్నట్టు సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. అయితే ఈ వ్యాధి నుంచి త్వరగా కోలుకోవాలని చిరంజీవితో సహా అభిమానులు, సినీ ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా ప్రార్థించారు.

దేశవ్యాప్తంగా ప్రమోషన్స్ కోసం..

దేశవ్యాప్తంగా ప్రమోషన్స్ కోసం..

అయితే యశోద సినిమాను దేశవ్యాప్తంగా ప్రమోషన్ చేయడానికి సమంత ముందే ప్లాన్ చేసుకొన్నారు. ముంబై, బెంగళూరు, కొచ్చిన్, చెన్నై, హైదరాబాద్ నగరాల్లో ప్రచారానికి తన డేట్స్ ఫిక్స్ చేసుకొన్నారు. అయితే అనూహ్యంగా అనారోగ్యానికి గురి కావడంతో ప్రమోషన్స్‌కు దూరంగా ఉంటూ వచ్చారు.

ఆరోగ్యాన్ని లెక్క చేయకుండా సమంత

ఆరోగ్యాన్ని లెక్క చేయకుండా సమంత

అయితే సమంత ప్రమోషన్స్‌కు దూరం కావడంతో.. వరలక్ష్మీ శరత్ కుమార్, నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ ప్రమోషన్‌లో భాగమయ్యారు. అయితే యశోదకు వస్తున్న స్పందన చూసి.. తన ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా ప్రమోషన్ షూట్‌కు సమంత హాజరు కావాలని నిర్ణయించుకొన్నారు. అయితే ఎక్కువ మందిలో ఉంటే ఆరోగ్యానికి ప్రమాదం ఏర్పడే అవకాశం ఉందనే డాక్టర్ల సలహా, సూచనలను పక్కన పెట్టి ప్రమోషన్‌కు హాజరవుతున్నారు.

ప్రతికూల పరిస్థితులను ఎదురిస్తూ..

ప్రతికూల పరిస్థితులను ఎదురిస్తూ..

యశోద సినిమా ప్రమోషన్ కోసం సిద్దమవుతూ.. సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. నా స్నేహితుడు, ఫ్యామిలీ మ్యాన్ డైరెక్టర్ రాజ్ డీకేలో రాజ్ చెప్పిన విషయాలను నేను ఆచరిస్తున్నాను. నీకు ప్రతికూలంగా ఎలాంటి పరిస్థితులు ఉన్నా.. నిన్ను వెనుకకు లాగాలని ఎంత ప్రయత్నించినా.. వాటన్నిటిని ఎదురించాలని చెప్పారు. ఆయన చెప్పిన మాటలను ఈ రోజు అరువుగా తెచ్చుకొని ఆచరిస్తున్నాను అని సమంత చెప్పారు.

సమంత లేటేస్ట్ లుక్ ఇలా..

యశోద ప్రమోషన్స్ కోసం సిద్దమయ్యాను. ఈ సినిమా 11వ తేదీన రిలీజ్ అవుతున్నది అని యశోద ట్వీట్ చేశారు. ప్రమోషన్స్ కోసం సిద్దం అంటూ సమంత రెండు ఫోటోలను షేర్ చేశారు. దాంతో నెటిజన్లు భారీగా స్పందించారు. వావ్ సమంత బ్యాక్, హార్డ్ వర్క్ ఎప్పుడూ ఫెయిల్ కాదు.. గుడ్ లక్ టు యశోద, ఆరోగ్యంగా ఉండాలి. నిజమైన ప్రొఫెషనల్ అంటే మీరే అంటూ సమంతకు విషెస్ తెలియజేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X