Samantha మీ కూతుళ్లకు కాదు.. కొడుకులు బుద్ధి చెప్పండి... ఆడవాళ్లను అలా టార్గెట్ చేయవద్దు..

దక్షిణాదిలో టాప్ హీరోయిన్ సమంత రుత్ ప్రభు ఇటీవల కాలంలో తరచుగా మీడియాలో హాట్ టాపిక్‌గా మారారు. నాగచైతన్యతో విడాకుల తర్వాత స్వేచ్ఛాయుతమైన జీవితాన్ని ఆస్వాదిస్తున్నట్టు కనిపిస్తున్నది. తాను షేర్ చేస్తున్న సోషల్ మీడియా పోస్టులు, ఫోటోలు ఆమె మానసిక పరిపక్వతకు అద్దంపడుతున్నాయి. సోషల్ మీడియాలో ఘాటుగా స్పందిస్తున్న తీరు అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. తాజాగా సమంత పెట్టిన పోస్టు ఇప్పుడు మీడియాలో చర్చనీయాంశమైంది. సమంత పెట్టిన తాజా పోస్టు, వ్యక్తిగత జీవితం వివరాల్లోకి వెళితే.

మ్యారేజ్ లైఫ్ బ్రేకప్

మ్యారేజ్ లైఫ్ బ్రేకప్

సినిమా పరిశ్రమలో అత్యంతంగా ఇష్టపడే సినీ దంపతుల జాబితాలో టాప్ స్థానాన్ని సంపాదించుకొన్న సమంత, నాగచైతన్య ఊహించని విధంగా అభిమానులకు షాక్ ఇచ్చారు. అక్టోబర్ 2వ తేదీన తమ వైవాహిక బంధానికి ముగింపు పలుకుతున్నామని సోషల్ మీడియాలో వెల్లడించడంతో అప్పటి వరకు మీడియాలో వైరల్ అయిన రూమర్లకు ఒక్కసారిగా తెరపడ్డాయి.

 నాగచైతన్యతో విడాకుల వెనుక

నాగచైతన్యతో విడాకుల వెనుక


సమంత, అక్కినేని కుటుంబానికి మధ్య ది ఫ్యామిలీ మ్యాన్ అనే వెబ్ సిరీస్ చిచ్చు పెట్టిందనే విషయం పలు సందర్భాల్లో బయటపడింది. హాట్ సీన్లలో నటించకూడదని విధించిన షరతు కారణంగానే నాగచైతన్య, సమంత విడిపోయారనే విషయం మీడియాలో కొంతకాలంగా నానుతున్నది. అయితే ఈ విషయంలో అసలు ఏం జరిగిందనే విషయం దేవుడికే తెలియాలని ఆమె సన్నిహితులు అంటున్నారు.

 మనోభావాలను కించపరుచవద్దు

మనోభావాలను కించపరుచవద్దు

విడాకుల తర్వాత తనపై వస్తున్న అవాస్తవ కథనాలపై సమంత ఘాటుగానే సమాధానం చెప్పారు. కొన్ని యూట్యూబ్ ఛానెల్స్‌పై కోర్టులో ఫిర్యాదు చేశారు. ఎవరైనా ఏదైనా తమ అభిప్రాయాలను వ్యక్తీకరించుకోవచ్చు. కానీ వాటిని ప్రేమతో, అభిమానంతో ఒకరిపై మరొకరు చాటుకోవచ్చు. ఇతరుల మనోభావాలు దెబ్బ తినే విధంగా కామెంట్లు చేయవద్దు అనే కామెంట్లను సమంత చేశారు.

సమంత నర్మగర్భంగా ఇన్స్‌టాగ్రామ్ పోస్టు

సమంత నర్మగర్భంగా ఇన్స్‌టాగ్రామ్ పోస్టు

ఇలాంటి వివాదాలు, విమర్శలు, ట్రోలింగ్, ఆరోపణల మధ్య సమంత ఇటీవల నర్మగర్భంగా ఇన్స్‌టాగ్రామ్‌లో పోస్టు పెట్టారు. రచయిత ఫరీదా డీ కోట్స్‌ను ఉదహరిస్తూ.. కొందరికి చురకలు పెట్టేందుకు ప్రయత్నించారని విషయం స్పష్టమైంది. మీ కూతుళ్లను సెక్సువల్‌గా ఉండకుండా కట్టడి చేసే ముందు.. మహిళలను లైంగికంగా వేధించ కుండా మీ కొడుకులకు బుద్ధి చెప్పండి. అలాగే మీ కూతురిని సెక్సువల్‌గా కనిపించకుండా అడ్డుకోవడం కూడా ఓ రకమైన దాడి చేసినట్టే అంటూ సమంత తన పోస్టులో పెట్టారు.

సమంత ఎవరిని టార్గెట్ చేశారంటే

సమంత ఎవరిని టార్గెట్ చేశారంటే

అయితే సమంత పెట్టిన పోస్టుపై ప్రస్తుతం ఆసక్తికరమైన చర్చ జరుగుతున్నది. ఎవరిని ఉద్దేశించి సమంత కామెంట్ చేశారు. ఎవరిని ఆమె తన పోస్టుతో టార్గెట్ చేశారు. ఆమెను అంతగా నొప్పించిన అంశం ఏమిటి? ఈ పోస్టును పెట్టడం వెనుక సమంత అంతరంగం ఏమిటి? అనే ప్రశ్నలపై మీడియాలో చర్చ జరుగుతున్నది.

సమంత సినీ కెరీర్ ఇలా..

సమంత సినీ కెరీర్ ఇలా..

ఇక సమంత సినిమా కెరీర్ విషయానికి వస్తే.. తాజాగా అల్లు అర్జున్ నటించిన పుష్ప చిత్రంలో ఓ స్పెషల్ సాంగ్‌లో సమంత నటించారు. ఊ అంటావా? ఊఊ అంటావా పాటలో నర్తించిన సమంతకు మంచి రెస్సాన్స్ లభించింది. ఇక యశోదా అనే చిత్రంలోను, అలాగే తమిళ చిత్రం కాతువాకుల రెండు కాదల్‌లో నయనతారతో కలిసి నటిస్తున్నారు. ఇంకా పలు చిత్రాలు చర్చల దశలో ఉన్నట్టు సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X