Samantha Ruth Prabhu బాలీవుడ్‌లో మూడు క్రేజీ ప్రాజెక్టులు.. ప్రముఖ హిందీ నిర్మాతకు గ్రీన్ సిగ్నల్

సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్ సమంత రుత్ ప్రభు కెరీర్‌ను బ్రహ్మండంగా చక్కబెట్టుకొంటున్నట్టు ఆమె అంగీకరిస్తున్న, చేస్తున్న సినిమాలు చూస్తే ఇట్టే అర్ధం అవుతుంది. ది ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్‌తో సౌత్ నుంచి ప్యాన్ ఇండియా ఇమేజ్ సంపాదించిన ఈ ముద్దుగమ్మ.. కరోనా సమయంలో కెరీర్‌ను క్రేజీగా మలుచుకొనేందుకు ప్రయత్నిస్తున్నది. రానున్న రోజుల్లో బాలీవుడ్‌లో ఓ ప్రముఖ బ్యానర్‌లో మూడు సినిమాలు చేసేందుకు అంగీకరించినట్టు.. అలాగే పుష్పలో ఓ కీలక పాత్రలో కనిపించేందుకు ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. సమంత కెరీర్‌కు సంబంధించిన వివరాల్లోకి వెళితే...

 సమంతకు భారీ ఆఫర్లు

సమంతకు భారీ ఆఫర్లు

సమంత కెరీర్‌ను పెళ్లికి ముందు.. పెళ్లికి తర్వాత అని చూస్తే.. కెరీర్ రెండో దశలో భారీ ప్లాన్స్‌తో ముందుకెళ్తున్నట్టు కనిపిస్తున్నది. ఇప్పటికే శాకుంతంల సినిమాను కంప్లీట్ చేసుకోగా, యశోద సినిమాతో బిజీగా ఉన్నారు. అలాగే తమిళంలో నయనతార, విజయ్ సేతుపతితో కలిసి మరో సినిమాలో నటిస్తూనే.. మరో రెండు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. పలు ప్రాజెక్టులు ఇంకా చర్చల దశలో ఉన్నాయని తెలుస్తున్నది.

 పుష్ప మూవీలో స్పెషల్ సాంగ్‌తో

పుష్ప మూవీలో స్పెషల్ సాంగ్‌తో

ఇక పుష్పలో సమంత చేసిన ఊ అంటావా.. ఊఊ అంటావా పాట నేషనల్ వైడ్‌గా సంచలనం రేపింది. యూట్యూబ్, సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్స్‌లో రికార్డు వ్యూస్, షేర్లను సాధించింది. ఆ సినిమా తర్వాత పుష్ప 2 చిత్రంలో మరో స్పెషల్ సాంగ్‌లో నటించడానికి సిద్ధంగా ఉన్నట్టు సమాచారం. పుష్ప 1 చిత్రంలో స్పెషల్ సాంగ్ చేయడానికి సందేహించిన సమంత.. ఆ తర్వాత వచ్చిన రెస్పాన్స్‌తో మరికొన్ని స్పెషల్ సాంగ్స్‌లో నటించడానికి అభ్యంతరమేమీ లేదని సంకేతాలిస్తున్నట్టు తెలిసింది.

5 కోట్ల రూపాయల పారితోషికం అంటూ

5 కోట్ల రూపాయల పారితోషికం అంటూ

పుష్పలో చేసిన స్పెషల్ సాంగ్ కోసం నిర్మాతలు, మైత్రీ మూవీ మేకర్స్ భారీగా రెమ్యునరేషన్ ఇచ్చినట్టు తెలిసింది. ఊ అంటావా.. ఊఊ అంటావా సినిమా పాట చేయడానికి వెనకంజ వేస్తే.. అల్లు అర్జున్ స్పెషల్ రిక్వెస్ట్ చేసి.. తప్పకుండా నీ కెరీర్‌లో ఆ పాట మంచి బూస్టప్ అవుతుందని ఎంకరేజ్ చేశారట. ఐకాన్ స్టార్ ఊహించినట్టే ఆ పాట మ్యూజిక్ ఇండస్ట్రీలో మైలురాయిగా నిలిచిన సంగతి తెలిసిందే. మూడు నిమిషాల నిడివి ఉన్న పాట కోసం 5 కోట్లు రెమ్యునరేషన్ తీసుకొన్నట్టు జాతీయ మీడియాలో కథనాలు వైరల్ అయ్యాయి.

 బాలీవుడ్‌లో స్సెషల్ సాంగ్స్ కోసం

బాలీవుడ్‌లో స్సెషల్ సాంగ్స్ కోసం

సమంత చేసిన ఊ అంటావా.. ఊఊ అంటావా స్సెషల్ సాంగ్ తర్వాత బాలీవుడ్ నుంచి స్పెషల్ సాంగ్ ఆఫర్లు భారీగానే ఈ బ్యూటీ గుమ్మాన్ని తడుతున్నాయట. అయితే ప్రస్తుతం స్పెషల్ సాంగ్స్ చేయడానికి విముఖత చూపుతున్న ఈ ముద్దుగుమ్మ.. క్రేజీ ప్రాజెక్టులపై దృష్టిపెట్టినట్టు తెలుస్తున్నది. ఇప్పటికే కొందరు అగ్ర నిర్మాతలతో సమంత చర్చలు జరుపుతున్నట్టు సమాచారం.

Recommended Video

Samantha - 'It's All Because Of Bunny' | Filmibeat Telugu
యష్ రాజ్ ఫిల్మ్ బ్యానర్‌లో సమంత

యష్ రాజ్ ఫిల్మ్ బ్యానర్‌లో సమంత

ఇదిలా ఉండగా, సమంత రుత్ ప్రభు బాలీవుడ్‌లోని ప్రతిష్టాత్మకమైన నిర్మాణ సంస్థ యష్ రాజ్‌ ఫిలిం బ్యానర్‌లో సినిమాలు చేయడానికి అంగీకరించినట్టు సమాచారం. ఈ సంస్థతో సమంత మూడు చిత్రాలు చేయడానికి ఒప్పందం చేసుకొన్నారనే విషయం ముంబై మీడియాలో వైరల్ అవుతున్నది. త్వరలోనే ఈ ఒప్పందానికి సంబంధించిన వివరాలు అధికారికంగా వెల్లడించే అవకాశం ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X