Don't Miss!
- News
Wife: నువ్వు ఎంజాయ్ చెయ్యడానికి నా భార్య కావాలా ?, నువ్వు అంత మగాడివా రా ?, ఇద్దరూ క్రిమినల్స్!
- Finance
Holidays in February: ఫిబ్రవరిలో 10 రోజులు బ్యాంక్స్ క్లోజ్.. ఎప్పుడెప్పుడంటే..?
- Sports
INDvsNZ : ఓపెనింగ్.. ఫినిషింగ్.. రెండూ టీమిండియాకు సమస్యలే!
- Automobiles
టెన్నిస్ స్టార్ 'సానియా మీర్జా' ఉపయోగించే కార్లు - ఇక్కడ చూడండి
- Lifestyle
శృంగార కోరికలు తగ్గడానికి ఈ 3 హార్మోన్లే కారణం... దీన్ని వెంటనే పరిష్కరించండి...!
- Travel
పచ్చని గిరులు మధ్య దాగిన పుణ్యగిరి జలపాతం!
- Technology
ధర రూ.15000 ల లోపు మార్కెట్లో ఉన్న బెస్ట్ 5G ఫోన్లు! లిస్ట్ ,ధర వివరాలు!
ఏడాది నుంచి టాప్ ప్లేస్లో సమంతా.. డబ్బులివ్వడం వల్లే అంటూ షాకింగ్ కామెంట్స్!
సౌత్ ఇండియాలో కాక నార్త్ ఇండియాలో కూడా టాప్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న సమంత ఈ మధ్య కాలంలో వరుసగా వార్తల్లో నిలుస్తోంది. కాఫీ విత్ కరణ్ షోలో పాల్గొన్న ఆమ తన జీవితానికి సంబంధించి అలాగే తన ప్రొఫెషనల్ లైఫ్ కి సంబంధించి అనేక విషయాలు పంచుకోవడంతో ఆ వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా ఆమె ఆర్మాక్స్ మీడియా సంస్థకు డబ్బులు ఇచ్చాను అంటూ చేసిన కామెంట్స్ ఆసక్తికరంగా మారాయి. దానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే

వెంటనే వైరల్
అక్కినేని నాగచైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత సమంత హాట్ టాపిక్ గా మారుతుంది. వారి విడాకుల తర్వాత చాలా రోజులు వీరి విడాకుల గురించే చర్చ జరిగింది. ఆ తర్వాత ఇప్పుడు సమంత తన సినిమాల్లో బిజీగా ఉండగా నాగచైతన్య కూడా తన సినిమాల్లో బిజీగా ఉన్నారు. అయినా సరే వీరిద్దరి గురించి ఏ వార్త వచ్చినా అది వెంటనే వైరల్ అయిపోతుంది.

ఆర్మ్మాక్స్ మీడియా
ఈ మధ్యనే సమంత కాఫీ విత్ కరణ్ షోలో పాల్గొన్నారు.ఈ షోలో సమంత పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. నాగచైతన్యతో విడాకులు, విడాకుల తర్వాత పరిస్థితులు, అలాగే భరణం గురించి కూడా అనేక ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. అయితే సమంత ఆర్మ్మాక్స్ మీడియా చేస్తున్న సర్వేలలో టాప్ తెలుగు హీరోయిన్ గా ఏడాది పైనుంచే మొదటి స్థానం సాధిస్తూ వస్తోంది.

టాప్ ప్లేస్ లో
అలాగే ఇటీవల విడుదల చేసిన పాన్ ఇండియా హీరోయిన్స్ లిస్టులో అలియా భట్, కత్రినా కైఫ్ వంటి వారిని వెనక్కి నెట్టి సౌత్ ఇండియా నుంచి సమంత టాప్ ప్లేస్ లో నిలబడటం మీద కరణ్ జోహార్ ప్రశ్నించారు. మీరు ఆర్మాక్స్ మీడియాలో నెంబర్ వన్ స్థానాన్ని ఎలా దక్కించుకున్నారు అని కరణ్ జోహార్ అడిగితే దానికి సమంత ఆసక్తికరంగా స్పందించింది.

డబ్బులు ఇస్తున్నా
నేను ఆ సంస్థలో పనిచేస్తున్న వాళ్లకి బాగా డబ్బులు ఇస్తున్నాను అంటూ అన్న కామెంట్ చేసింది. నిజానికి సమంత వెటకారంగా ఆ కామెంట్ చేసింది కానీ నిజమేనని ట్రోల్ చేస్తున్నారు కొంతమంది. అయితే ఈ విషయం మీద మాత్రం సమంత ఎలాంటి స్పందన తెలియజేయలేదు. ఇక సమంత ప్రస్తుతం వరుస సినిమాలు లైన్లో పెట్టిన సంగతి తెలిసిందే. తమిళ, తెలుగు భాషలలో వరుస సినిమాలు చేస్తున్నారు ఆమె. ఇక బాలీవుడ్ లో సమంత ఎంట్రీ కూడా ఖరారు అయిపోయింది అంటూ ప్రచారం జరుగుతుంది.

హిందీ సినిమాలు చేయడానికి
కరణ్ జోహార్ ప్రొడక్షన్ ద్వారానే సమంత బాలీవుడ్ ఎంట్రీస్తోందని అందుకే కరణ్ జోహార్ షో లో కూడా ఆమె కనిపించిందని ప్రచారం మొదలైంది. అయితే ఈ విషయం మీద మాత్రం ప్రస్తుతానికి ఎలాంటి అధికారిక ప్రకటన లేదు దానికి సంబంధించి ఏదైనా అధికారిక ప్రకటన వస్తేనే కానీ ఆమె నిజంగా హిందీ సినిమా చేస్తుందా లేదా అనే విషయం మీద క్లారిటీ వస్తుంది. అయితే గత కొన్నాళ్ల నుంచి సమంత ఎక్కువగా ముంబైలో కనిపిస్తూ ఉండడంతో ఆమె వరుస హిందీ సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తుందని ప్రచారాలు మొదలయ్యాయి.