Don't Miss!
- Finance
Holidays in February: ఫిబ్రవరిలో 10 రోజులు బ్యాంక్స్ క్లోజ్.. ఎప్పుడెప్పుడంటే..?
- Sports
INDvsNZ : ఓపెనింగ్.. ఫినిషింగ్.. రెండూ టీమిండియాకు సమస్యలే!
- News
పార్టీ ఎంపీలకు సీఎం కేసీఆర్ పిలుపు - కీలక నిర్ణయం..!?
- Automobiles
టెన్నిస్ స్టార్ 'సానియా మీర్జా' ఉపయోగించే కార్లు - ఇక్కడ చూడండి
- Lifestyle
శృంగార కోరికలు తగ్గడానికి ఈ 3 హార్మోన్లే కారణం... దీన్ని వెంటనే పరిష్కరించండి...!
- Travel
పచ్చని గిరులు మధ్య దాగిన పుణ్యగిరి జలపాతం!
- Technology
ధర రూ.15000 ల లోపు మార్కెట్లో ఉన్న బెస్ట్ 5G ఫోన్లు! లిస్ట్ ,ధర వివరాలు!
విడాకుల తరువాత మొట్టమొదటి సారి బయటకొచ్చిన సమంత..ఆమె కోసం రిస్క్ చేసి మరీ!
ఇన్‌స్టాగ్రామ్ ద్వారా తన కార్యకలాపాలను ఎప్పటికప్పుడు షేర్ చేస్తున్న నటి సమంతా నాగ చైతన్య నుండి విడిపోతున్నట్లు ప్రకటించిన తర్వాత ఆమె మొదటిసారి బహిరంగంగా కనిపించింది. అసలు ఆమె బయటకు ఎందుకు వచ్చింది? వెలితే

బాగా దగ్గరై
స్టార్
హీరోయిన్
సమంత,
చిన్మయి
మంచి
స్నేహితులు
అన్న
సంగతి
తెలిసిందే.
సమంత
చిన్మయితో
ఎంతో
చనువుగా
ఉంటుంది.
వీళ్ళిద్దరూ
ప్రొఫెషనల్
గా
కలిసి
చివరికి
మంచి
స్నేహితులుగా
మారిపోయారు.
సాధారణంగా
స్నేహమంటే
ప్రాణమిచ్చే
సమంత
తన
పాత్రలకు
వాయిస్
ఓవర్
ఇచ్చే
చిన్మయితో
మంచి
బాండింగ్
కుదరడంతో
ఆమెకు
బాగా
దగ్గరైంది.

చిన్మయి చేసే ప్రతి పనిలో
అయితే మామూలుగా ఉంటే పర్లేదు కానీ ఎక్కువగా ఫెమినిజం భావాలు పుణికి పుచ్చుకున్న చిన్మయి అసలు సమంత విడాకులకు కారణం అని కూడా ట్రోల్ అయింది. అయితే ఇవేమి పట్టని సమంత చిన్మయి చేసే ప్రతి పనిలో తన సహాయం అందిస్తూ టుంది. ముఖ్యంగా వ్యాపార కార్యకలాపాలను ఎక్కువగా ప్రమోట్ చేస్తున్న ఆమె తన స్నేహితురాలు చిన్మయి పెట్టిన ఓ బిజినెస్ ను ప్రమోట్ చేయడానికి బయటకొచ్చింది.

చెన్నైలో కొత్తగా స్పా
విషయం ఏంటంటే చిన్మయి చెన్నైలో కొత్తగా స్పా సెంటర్, బ్యూటీ సెంటర్ బిజినెస్ ప్రారంభించింది. Deep Skin Dialogues అంటూ కొత్త స్టోర్‌ను ఓపెన్ చేసింది. అయితే స్టోర్‌కి సమంత చేతుల మీదుగానే రిబ్బన్ కట్ చేయించింది చిన్మయి. ఇక ఈ ప్రారంభోత్సవం తరువాత వీరిద్దరూ సిబ్బందితో కలిసి దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.

అక్టోబర్ 2న విడిపోతున్నట్లు
అక్టోబర్ 2న విడిపోతున్నట్లు ప్రకటించినప్పటి నుంచి సమంత మీడియాకు దూరంగా ఉంది. అయితే నటి చిన్మయి కోసం తన స్నేహితురాలు బయటకు వచ్చింది. నటి తన సాధారణ వేషధారణలో క్లాసీగా కనిపించింది. ఆమె ఈ ఈవెంట్ లో ఫోటోలకు ఫోజులివ్వడం వల్ల ఆమె అంతా ఉల్లాసంగా కనిపించింది. అలాగే ''నీకు ఇలాంటి వాటిపై ఉన్న ప్యాషన్ ఏంటనేది నాకు బాగా తెలుసు. ఈ అడుగు బిగ్ సక్సెస్ అవుతుందనే నమ్మకం నాకుంది. చెన్నైలో మెడి స్పా.. సౌత్ ఆసియాలోనే ఇదే మొదటి హాలీవుడ్ స్కల్పింట్ సెంటర్'' అని సమంత తన పోస్ట్ లో ప్[పేర్కొంది.

సినిమాల విషయానికి వస్తే
ఇక సమంత వర్క్ ఫ్రంట్ గురించి చెప్పాలంటే ఆమె త్వరలో పుష్ప స్పెషల్ నంబర్ షూటింగ్ లో బిజీగా ఉంటుంది. ఈ నెల 26 నుంచి 29 వరకు షూటింగ్ జరగనుంది. సమంత కెరీర్‌లో ఫస్ట్ స్పెషల్ నంబర్ కాబట్టి, అది ఎలా ఉండబోతుందోనని అందరి దృష్టి ఆమెపైనే ఉంది. ఇక ఆమె చేస్తున్న సమంత సినిమాల విషయానికి వస్తే శ్రీదేవి మూవీస్ బ్యానర్‌పై ఓ కొత్త చిత్రం చేస్తున్నారు. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన విడుదలైంది.
Recommended Video

చేతినిండా సినిమాలతో
ఈ సినిమాను హరీష్ నారాయణ్, హరి శంకర్ దర్శకత్వం వహించనున్నారు. ఈ సినిమా గురించి పూర్తి వివరాలు త్వరలో ప్రకటించనుంది చిత్రబృందం. ఇక సమంత ప్రస్తుతం తెలుగులో ఓ పౌరాణిక చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఆమె ప్రధాన పాత్రలో టాలీవుడ్ డైరెక్టర్ గుణశేఖర్ శాకుంతలం అనే ఓ పౌరాణిక చిత్రాన్ని పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కిస్తున్నారు. ఇవి కాక ఆమె మరో తమిళ సినిమాలో కూడా నటిస్తోంది.