For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Samantha: మళ్లీ ఫామ్ లోకి సమంత.. నాగ చైతన్యపై ఇన్ డైరెక్ట్ సెటైర్?.. లేక తన గురించా!

  |

  ఏ మాయ చేశావే సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ బ్యూటీ సమంత. అతి తక్కువ కాలంలోనే స్టార్​ హీరోయిన్​గా ఎదిగింది. తర్వాత అగ్ర హీరోల సరసన వరుస సినిమాలు చేసి ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. అంతేకాకుండా యూత్​లో మంచి క్రేజ్​సంపాదించుకున్న సమంత లైఫ్​ను పెళ్లికి ముందు, పెళ్లి తర్వాత అంటూ పోల్చి చూడొచ్చు. సాధారణంగానే పెళ్లిల్లు అయ్యాక హీరోయిన్లకు సినిమా అవకాశాలు అంతగా రావు.

  అలాంటిది నాగ చైతన్యతో విడిపోయిన తర్వాత కూడా ఏమాత్రం జోరు తగ్గకుండా వరుస సినిమాలు చేసి, అంతకుమించిన పాపులారిటీని సంపాదించుకున్న నటి ఎవరైనా ఉంటే అది సమంతనే అని చెప్పవచ్చు. అయితే గత కొంతకాలంగా సోషల్ మీడియాకు సమంత దూరంగా ఉన్న మళ్లీ ఈ మధ్య యాక్టివ్ గా ఉంటున్నట్లు తెలుస్తోంది.తాజాగా మరో పోస్ట్ పెట్టిన సమంత అంతరార్థం చర్చనీయాంశంగా మారింది.

  చైతో అనేక చిత్రాలు..

  చైతో అనేక చిత్రాలు..

  గౌతమ్ వాసుదేవ్​ మీనన్​ దర్శకత్వంలో నాగ చైతన్య, సమంత జోడిగా నటించి సూపర్ హిట్ కొట్టారు. ఆ సినిమా వారిద్దరికి మంచి పేరు తెచ్చిపెట్టింది. అనంతరం వీరిద్దరు కలిసి అటో నగర్​ సూర్య, మనం, మజిలి వంటి చిత్రాల్లో నటించి హిట్​ పెయిర్​గా రికార్డుకెక్కారు. ఆన్​స్క్రీన్ పైనే కాకుండా రియల్​ లైఫ్​లో సైతం బ్యూటిఫుల్​ కపుల్​గా అందరి దృష్టిని ఆకర్షించారు. నాలుగేళ్ల వైవాహిక జీవితం తర్వాత సడెన్​గా సినీ లోకానికి షాక్​ ఇచ్చారు.

  సమంతను టార్గెట్​ చేస్తూ పోస్టులు..

  సమంతను టార్గెట్​ చేస్తూ పోస్టులు..

  అక్టోబర్​ 2, 2021 తాము విడిపోతున్నట్లు ప్రకటించి నాగ చైతన్య, సమంత ప్రేక్షక లోకాన్ని షాక్​కు గురి చేశారు. ఇక దీని తర్వాత ఎక్కవగా అందరూ సమంతను టార్గెట్​ చేస్తూనే పోస్టులు పెట్టడం, వారికి దీటుగా కౌంటర్​ ఇవ్వడం వంటివి చాలానే జరిగాయి. సమంత రూ. 250 కోట్ల భరణం తీసుకుందని వంటి రూమర్లు చాలా వచ్చాయి. వాటిపై కాఫీ విత్ కరణ్ టాక్ షోలో క్లారిటీ కూడా ఇచ్చింది సామ్.

  కొంతకాలంగా సైలెంట్..

  కొంతకాలంగా సైలెంట్..

  సాధారణంగానే సమంత సోషల్​ మీడియాలో ఎక్కువ యాక్టివ్​గా ఉంటుంది. ఇక నాగ చైతన్యతో విడాకుల తర్వాత మరింత యాక్టివ్​గా ఉండేది. అప్పటినుంచి ఆమె ఏ పోస్ట్​ పెట్టిన, ఎలాంటి కామెంట్​ చేసిన వెంటనే వైరల్​ అయిపోయేది. తను వెళ్లే టూర్​లు, వెకేషన్స్​, మోటివేషనల్​ కొటేషన్స్​, ఫిట్​నెస్​ తదితర విషయాలపై పోస్ట్​లు, వీడియోలు పోస్ట్​ చేసేది సమంత. అలాంటి సామ్ గత కొంతకాలంగా సైలెంట్​ అయిపోయిందని తెలిసిందే.

  చర్మ సంబంధిత సమస్యలు..

  చర్మ సంబంధిత సమస్యలు..

  ఆమెకు సంబంధించిన టాక్​ ఏం బయట వినిపించలేదు. అలాగే సోషల్​ మీడియాలో ఎలాంటి పోస్ట్​లు గానీ పెట్టలేదు. అయితే సామ్​.. సోషల్​ మీడియాలో పోస్ట్​ పెట్టిన న్యూసే.. పెట్టకున్న వార్తే అన్నట్లుగా మారింది. అలాంటిది ఆ మధ్య కొన్ని రోజులు సమంత సోషల్ మీడియాలో యాక్టివ్ గా లేదు. అందుకు ఆమె గర్భసంచి తొలగించుకుందని, చర్మ సంబంధిత సమస్యలు రావడంతో ఆస్పత్రిపాలైనట్లు వార్తలు గుప్పుమన్నాయి.

  వరుస పోస్టులతో హల్ చల్..

  వరుస పోస్టులతో హల్ చల్..

  కానీ ఆ వార్తలన్ని అవాస్తవమని, అన్ని పుకార్లే అని సమంత టీమ్ క్లారిటీ ఇచ్చింది. దీంతో ఈ రూమర్స్ కు చెక్ పడినట్లయింది. అయితే ఇప్పటివరకు సమంత సోషల్ మీడియాలో ఇంతకుముందులా చురుగ్గా ఉండట్లేదని గుసగుసలు వినిపించాయి. కానీ సామ్ వాటన్నింటిని తిప్పికొడుతూ మళ్లీ వరుస పోస్టులు పెడుతూ హల్ చల్ చేస్తోంది. ఇటీవల నేను ఇంకా ఓడిపోలేదు అనే క్యాప్షన్ తో పోస్ట్ చేసిన సామ్ తాజాగా మరో పోస్ట్ పెట్టింది.

  బ్లాక్ టీ షర్ట్ ధరించి..

  బ్లాక్ టీ షర్ట్ ధరించి..

  ఈ పోస్ట్ లో తన పిక్ ను పోస్ట్ చేసింది సామ్. ఈ పిక్ లో సమంత బ్లాక్ టీ షర్ట్ ధరించింది. ఈ టీ షర్ట్ పైన ''యూ విల్ నెవర్ వాక్ ఎలోన్ (నువ్ ఎప్పుడు ఒంటరి ప్రయాణం చేయలేవు)'' అని రాసి ఉంది. ఈ మ్యాటర్ నే క్యాప్షన్ లా రాసుకొచ్చి లవ్ సింబల్ ను పెట్టింది సమంత. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీంతో నెటిజన్లు అందరూ ఈ పోస్ట్ నాగ చైతన్యను ఉద్దేశించే పెట్టింది అని కామెంట్ చేస్తున్నారు.

  ఇన్ డైరెక్ట్ గా సామ్ ఇలా..

  అయితే ఆ మధ్య ఓ హీరోయిన్ తో నాగ చైతన్య డేటింగ్ చేస్తున్నాడనే పుకార్లు వచ్చిన విషయం తెలిసిందే. వాటిపై ఇన్ డైరెక్ట్ గా సామ్ ఇలా స్పందించి ఉంటుంది అని భావిస్తున్నారు నెటిజన్లు. లేదా తను ఒంటరి జీవితాన్ని ప్రయాణించలేకపోతుందేమోనని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. ఇక ఈ పోస్ట్ మొత్తంగా నాగ చైతన్య గురించా, లేక తన గురించా అనేది తెలియాల్సి ఉంది.

  English summary
  Tollywood Star Heroine Samantha Ruth Prabhu Latest Post In Black T Shirt And Wrote You Will Never Walk Alone
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X