twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    డాన్స్ మాస్టర్‌తో పరిచయం.. ఆపై ఎఫైర్, పీకల్లోతు ప్రేమలో హీరోయిన్!

    |

    కళ్యాణ్ రామ్ కత్తి, గగనం, మిస్టర్ నూకయ్య చిత్రాల ద్వారా తెలుగు తెరకు హీరోయిన్‌గా పరిచయమైన బాలీవుడ్ నటి సనా ఖాన్ ఓ డాన్స్ మాస్టర్‌తో ప్రేమలో పడింది. ఈ విషయాన్ని అఫీషియల్‌గా వెల్లడిస్తూ ట్విట్టర్ ద్వారా ప్రకటన చేశారు. అతడితో దిగిన ఫోటోలను కూడా ఈ సందర్భంగా ఆమె అభిమానులతో పంచుకున్నారు.

    మెల్విన్ లూయిస్ అనే డాన్సర్ వద్ద సనా ఖాన్ కొంతకాలంగా డాన్స్ నేర్చుకుంటుంది. ఈ క్రమంలో అతడితో ఏర్పడ్డ సాన్నిహిత్యం చివరకు ప్రేమకు దారి తీసింది. ఇద్దరి కుటుంబాలు కూడా వీరి ప్రేమ విషయంలో సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది.

    అతడిపై తన ప్రేమను వ్యక్తీకరిస్తూ...

    అతడిపై తన ప్రేమను వ్యక్తీకరిస్తూ...

    మెల్విన్ లూయిస్ మీద తన ప్రేమను వ్యక్తీకరిస్తూ సనా ఖాన్ ఆసక్తిక ట్వీట్ చేశారు. ‘‘నా జీవితంలో కలిసి ఏ వ్యక్తిని నేను ఇంతగా ప్రేమించలేదు. కొందరికి జీవితాంతం వెతికినా దొరకని ఒక మంచి మంచి ప్రేమికుడిని నీ రూపంలో పొందాను. ప్రతి రోజూ, ప్రతీ నిమిషం నీతో ప్రేమలో పడుతూనే ఉన్నాను'' అంటూ ట్వీట్ చేశారు.

    నీ నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నా

    నీ నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నా

    ‘‘ప్రతి రోజూ నీ నుంచి ఎన్నో మంచి విషయాలు నేర్చుకుంటున్నాను. నీ మీద నా ప్రేమను వ్యక్తం చేయడానికి పదాలు సరిపోవడం లేదు. నీలాంటి వ్యక్తి నా జీవితంలోకి రావడం అదృష్టంగా భావిస్తున్నాను. హ్యాపీ బర్త్ డే మై లవ్'' అంటూ సనా ఖాన్ తన ప్రియుడికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసింది.

    అలా ఇద్దరి మధ్య పరిచయం

    అలా ఇద్దరి మధ్య పరిచయం

    ‘నచ్ బలియే' అనే డాన్స్ కార్యక్రమం కోసం తొలిసారి సనా ఖాన్ అతడిని కలిసింది. ఈక్రమంలో అతడితో ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఇద్దరూ కలిసి పలు సందర్భాల్లో డిన్నర్‌కు వెళ్లడం, ఇష్టాలు పంచుకోవడంతో సాన్నిహిత్యం మరింత పెరిగింది. చివరకు అది ఒకరిని విడిచి ఒకరు ఉండలేనంత అనుబంధంగా మారింది.

    సనా ఖాన్

    సనా ఖాన్

    2017లో టాయిలెట్ ఏక్ ప్రేమ కథా చిత్రంలో నటించిన సనా ఖాన్... ఆ తర్వాత సినిమాల కంటే టీవీ షోలపైనే ఎక్కువ పోకస్ పెట్టారు. ప్రస్తుతం ఆమె ‘టామ్ డిక్ అండ్ హ్యారీ 2' అనే బాలీవుడ్ చిత్రంలో నటిస్తున్నారు. దీపక్ తిజోరి దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది.

    English summary
    Actor Sana Khan has declared that she is Love with dancer Melvin Louis. Sharing pictures to mark Melvin’s birthday, Sana wrote in a series of posts. “I never knew I could love someone this much until I met you. Some people search their whole lives to find what I found in you I fall for you every day every minute. You make me a better person mel there are so many good things I m learning frm you every single day. Words will never be enough to express my love n gratitude towards too ♥I m super lucky to have you in my life Thank you for choosing me I love you forever ♥ Happy Birthday my love.”
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X