twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఏక్తాకపూర్ వేధించిన వ్యక్తి అరెస్ట్.. 30 సార్లు వెంటాడి... ఏకంగా జిమ్‌లో..!

    |

    సినీ తారలు ఎదోరకంగా వేధింపులకు గురికావడం తరచూ కనిపిస్తుంటుంది. తాజాగా అలాంటి పరిస్థితే నిర్మాత ఏక్తాకపూర్‌కు ఎదురైంది. గత కొద్దినెలలుగా వేధిస్తున్న ఓ క్యాబ్ డ్రైవర్‌ను ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. సినీతారల భద్రత గురించిన అంశం మరోసారి మీడియాలో చర్చనీయాంశమైంది. క్యాబ్ డ్రైవర్ అరెస్ట్ వార్త బాలీవుడ్‌ మీడియాలో హల్‌చల్ చేస్తున్నది. వివారాల్లోకి వెళితే...

    ఏక్తాకపూర్‌కు క్యాబ్ డ్రైవర్ వేధింపులు

    ఏక్తాకపూర్‌కు క్యాబ్ డ్రైవర్ వేధింపులు

    హర్యానాకు చెందిన సుధీర్ రాజేందర్ సింగ్ కొద్దికాలంగా నిర్మాత ఏక్తా కపూర్‌ను కలిసేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. తనను పలుచోట్ల వెంటాడటం గమనించిన ఏక్తా కపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో అతడిని పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు.

    కొద్దినెలలుగా వెంటాడిన వ్యక్తి

    కొద్దినెలలుగా వెంటాడిన వ్యక్తి

    ముంబై పోలీసుల తెలిపిన ప్రకారం.. కొద్ది నెలలుగా ఏక్తా కపూర్‌ను అనుమానాస్పదంగా వెంటాడుతున్నాడు. దాదాపు 30 సార్లు ఆమె వెంట పడ్డారు. తాజాగా జుహులోని ఆలయానికి ఏక్తా కపూర్ వెళ్లినప్పుడు ఆమెను కలువడానికి విఫల ప్రయత్నాలు చేశాడు. కానీ బాడీగార్డులు హెచ్చరించి దూరంగా పంపించారు. అయినా సింగ్ తన ప్రయత్నాలను మానుకోలేదు అని పోలీసులు అన్నారు.

    ఏకంగా జిమ్‌లోనే వేధింపులు

    ఏకంగా జిమ్‌లోనే వేధింపులు

    ఏక్తా కపూర్‌ను కలిసేందుకు అంధేరిలో ఆమె వెళ్లే జిమ్‌లో చేరాడు. జిమ్‌లో వర్కవుట్లు చేస్తుంటే ఏక్తాకపూర్‌తో మాట్లాడేందుకు, కలిసేందుకు ప్రయత్నించారు. గత శనివారం రోజున ఏక్తా కపూర్‌ను జిమ్‌లో కలిసేందుకు ప్రయత్నించాడు. సింగ్ ప్రయత్నాలను బాడీగార్డులు అడ్డుకోవడం జరిగింది. సింగ్ వ్యవహారం మితిమీరడంతో సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేయగా అతడిని అరెస్ట్ చేశారు.

    సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా చేసుకొని

    సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా చేసుకొని

    ఏక్తాకపూర్ ఫిర్యాదు మేరకు సీసీటీవీలను పరిశీలించిన ముంబై పోలీసులు సింగ్‌ను అరెస్ట్ చేశారు. నిందితుడిపై ఐపీసీ సెక్షన్ 354 ప్రకారం కేసు నమోదు చేశారు. ఆంధేరీ, వీరాదేశాయ్ రోడ్డులో సింగ్ అనుమానాస్పద కదలికలను పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ నుంచి సేకరించారు. ఏక్తాకపూర్‌ను ఎక్కడెక్కడ వెంబడించాడో ఆ వివరాలను సేకరిస్తున్నారు.

    ఉద్యోగం కోసమేనని నిందితుడు

    ఉద్యోగం కోసమేనని నిందితుడు

    సుధీర్ రాజేందర్ సింగ్‌ను అరెస్ట్ చేసి ముంబై పోలీసుల విచారిస్తున్నారు. తనకు, తన స్నేహితుడు ఉద్యోగం కోసం పలుమార్లు ఆమెను కలువడానికి వెంటపడినట్టు సింగ్ పోలీసులకు వెల్లడించినట్టు సమాచారం. అయితే సింగ్ చెప్పిన విషయాలపై దర్యాప్తు చేస్తూనే ఏక్తాను వెంబడించడం వెనుక మరో కోణం ఉందా? అనే దిశగా కేసు దర్యాప్తు చేస్తున్నారు.

    English summary
    The Amboli police have arrested a 32 year-old man who allegedly stalked producer Ekta Kapoor for over 30 times in the recent months. The accused idenfied as Sudhir Rajender Singh who is said to be a resident of Haryana wanted to meet Kapoor to get a job and also to be her friend.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X