For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Trisha: రాజకీయ రంగంలో హీరోయిన్ త్రిష ఎంట్రీ.. త్వరలోనే నేషనల్ పార్టీ నుంచి పోటీ..?

  |

  సౌత్ సినిమా ఇండస్ట్రీలో ఒకప్పుడు అగ్ర హీరోయిన్ గా కొనసాగిన వారిలో త్రిష కృష్ణన్ ఒకరు. కేవలం తమిళంలోనే కాకుండా తెలుగు లో కూడా ఆమె స్టార్ హీరోయిన్ గా దాదాపుగా అగ్ర హీరోలందరితోను సినిమాలు చేశారు. అయితే త్రిష ప్రస్తుతం రాజకీయాల వైపు కూడా అడుగులు వేసే ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. గత కొన్ని వారాలుగా త్రిషకు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో బాగానే వైరల్ అవుతున్నాయి. ఆమె ఒక జాతీయ పార్టీ కండువా కప్పుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లుగా కూడా కథనాలు వెలువడుతున్నాయి. ఈ విషయంలో త్రిష ఇంకా ఇలాంటి క్లారిటీ ఇవ్వకపోవడంతో వార్తల హడావిడి మరింత ఎక్కువైపోయింది. ఇక ఆమె ఏ పార్టీలో చేరుతున్నారు అనే వివరాల్లోకి వెళితే..

  వయసు పెరుగుతున్నా..

  వయసు పెరుగుతున్నా..

  తెలుగు తమిళం భాషల్లో మంచి నటిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్న త్రిష ఒకప్పుడు అగ్ర హీరోయిన్ గా చక్రం తిప్పింది. ఎలాంటి సినిమా చేసిన కూడా ప్రేక్షకుల నుంచి మంచి క్రేజ్ అందుకున్న త్రిష కొన్నాళ్లకు మిగతా హీరోయిన్స్ నుంచి పోటీ తీవ్రత ఎక్కువ కావడంతో అవకాశాలు చాలా వరకు తగ్గిపోయాయి. అయితే నాలుగు పదుల వయసు దగ్గర పడుతున్న కూడా ఇంకా పాతికేళ్ళ అమ్మాయి తరహా లోనే తన అందంతో ఎంతగానో ఆకట్టుకుంటుంది.

  స్టార్స్ తో సినిమాలు

  స్టార్స్ తో సినిమాలు

  త్రిష మొదట తెలుగులో వర్షం సినిమాతో మంచి క్రేజ్ అందుకున్న విషయం తెలిసిందే. ఆ తర్వాత నువ్వొస్తానంటే నేనొద్దంటానా సినిమాతో ఆమె రేంజ్ మరో స్థాయికి వెళ్ళింది. ఇక మెగాస్టార్ చిరంజీవి వెంకటేష్ బాలకృష్ణ జూనియర్ ఎన్టీఆర్ ఇలా చాలామంది ప్రముఖ హీరోలతో త్రిష స్క్రీన్ షేర్ చేసుకుంది. ఇక తమిళంలో అయితే అజిత్ విజయ్ కమలహాసన్ రజనీకాంత్ ఇలా దాదాపు అందరూ అగ్ర హీరోలతో కూడా ఆమె సినిమాలు చేసుకుంటూ వచ్చింది.

  విభిన్నమైన పాత్రలలో..

  విభిన్నమైన పాత్రలలో..

  ఇక ఈ మధ్యకాలంలో త్రిష కు హీరోయిన్ గా అయితే పెద్దగా అవకాశాలు రావడం లేదు. కేవలం కొన్ని పెద్ద సినిమాల్లోనే సపోర్టింగ్ రోల్స్ మాత్రమే చేస్తోంది. అలాగని తల్లి పాత్రలో అలాగే సోదరి పాత్రలో నటించడానికి కూడా త్రిష ఇంకా సిద్ధంగా లేదు అని తెలుస్తోంది. ప్రస్తుతం తన స్టార్ హోదా ఉన్నంత రేంజ్ లో అయితే కొన్ని విభిన్నమైన పాత్రలలో మెప్పించాలని అనుకుంటుంది. త్వరలో రానున్న మణిరత్నం పోన్నియన్ సెల్వన్ ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

  త్రిష పొలిటికల్ ఎంట్రీ?

  త్రిష పొలిటికల్ ఎంట్రీ?

  అయితే గత కొన్ని రోజులుగా తమిళ మీడియాలో త్రిష పొలిటికల్ ఎంట్రీ కి సిద్ధమైనట్లుగా జోరుగా వార్తలు వస్తున్నాయి. ఇదివరకే ఆమెకు తో కొంతమంది నేషనల్ పార్టీకి సంబంధించిన ప్రముఖులు కలిసినట్లుగా కూడా ప్రచారాలు చేస్తున్నారు. కానీ ఇంతవరకు త్రిష నుంచి మాత్రం ఎలాంటి వివరణ రాలేదు. దీంతో దాదాపు ఆమె పొలిటికల్ ఎంట్రీ ఖాయమైనట్లుగా కూడా తెలుస్తోందని అంటున్నారు.

  ఆ పార్టీలోనే?

  ఆ పార్టీలోనే?

  ఇది వరకే చాలామంది హీరోయిన్లుగా ఒక దశ వరకు కొనసాగిన తర్వాత రాజకీయాల్లో మంచి సక్సెస్ అందుకున్నారు. ఇక ఇప్పుడు త్రిష నేషనల్ పార్టీ కాంగ్రెస్ లో చేరే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. తమిళనాడులో పార్టీని మరింత బలోపేతం చేయాలి అని కాంగ్రెస్ పార్టీ అధినేతలు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అందుకే ముందుగా సినిమా ఫీల్డ్ నుంచి కూడా కొంతమందిని దింపాలని చూస్తున్నారు. ఇక త్రిషతో కూడా మాట్లాడినట్లుగా తెలుస్తోంది. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలి అంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.

  English summary
  shocking rumours on heroine Trisha Krishnan political entry..
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X