బాత్రూంలో శ్రీయ హాట్ సెల్ఫీ: వామ్మో తల్లైనా అస్సలు తగ్గకుండా అందాల ఆరబోత

శ్రీయ శరణ్.. తెలుగు సినీ ప్రియులకు ఈ పేరుతో అస్సలు పరిచయం అవసరం లేదు. అంతలా ఈ సొట్టబుగ్గల సుందరి చాలా కాలం పాటు టాలీవుడ్‌ను ఏలేసింది. ఆకట్టుకునే అందమే కాదు.. మైమరపించే నటనతో ప్రేక్షకులను ఫిదా చేసిన ఈ ముద్దుగుమ్మ.. ఎవరూ చేయని రీతిలో వరుస పెట్టి సినిమాలు చేస్తూ వచ్చింది. ఇలా చాలా ఏళ్ల పాటు స్టార్‌ హీరోయిన్‌గా హవాను చూపించింది.

అయితే, వివాహం తర్వాత శ్రీయ అంతగా సినిమాలు చేయడం లేదు. కానీ, సోషల్ మీడియాలో మాత్రం ఈ చిన్నది తెగ సందడి చేస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా బాత్రూంలో దిగిన ఓ హాట్ ఫొటోను ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది. అందాల విందు చేస్తోన్న ఈ పిక్‌ను మీరు కూడా చూసేయండి మరి!

తక్కువ సమయంలోనే ఫేమస్

తక్కువ సమయంలోనే ఫేమస్

హీరోయిన్‌గా పరిచయం అవడానికి ముందే శ్రీయ శరణ్ మోడలింగ్ రంగంలో తన అందచందాలతో సత్తా చాటింది. అక్కడ ఎన్నో బ్రాండ్లకు అంబాసీడర్‌గా వ్యవహరించిన తర్వాత 'ఇష్టం' అనే సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. తర్వాత 'సంతోషం'తో కెరీర్‌లో ఫస్ట్ హిట్‌ను సొంతం చేసుకుంది. దీంతో చాలా తక్కువ సమయంలోనే విపరీతంగా ఫేమస్ అయిపోయింది.

ఎక్కువ సినిమాలు... చార్జ్‌ చేసి

ఎక్కువ సినిమాలు... చార్జ్‌ చేసి

తెలుగులో ఆరంభంలోనే మంచి మంచి విజయాలతో లక్కీ హీరోయిన్‌గా శ్రీయ పేరు తెచ్చుకుంది. దీంతో ఆమెకు వరుసగా ఆఫర్లు వెల్లువెత్తడంతో పాటు ఏడాదికి పది సినిమాలు కూడా చేసి ఎవరికీ దక్కని ఘనతను సొంతం చేసుకుంది. అదే సమయంలో రెమ్యూనరేషన్ కూడా భారీగా తీసుకుంది. తద్వారా అప్పట్లో ఎక్కువ చార్జ్ చేసిన హీరోయిన్‌గా శ్రీయ రికార్డు కూడా కొట్టేసింది.

ఇక్కడే కాదు.. అక్కడా సందడి

ఇక్కడే కాదు.. అక్కడా సందడి

తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టార్‌ హీరోయిన్‌గా సందడి చేసిన శ్రీయ శరణ్.. స్టార్ హీరోలందరితోనూ ఆడిపాడింది. అలాగే, కొందరు చిన్న హీరోలతోనూ సినిమాలు చేసింది. మొత్తానికి టాలీవుడ్ మొత్తాన్ని కవర్ చేసేసింది. ఈ క్రమంలోనే ఆమె ఎన్నో అవార్డులు కూడా అందుకుంది. తెలుగులోనే కాదు.. దక్షిణాది భాషల్లోనూ శ్రీయ సందడి చేసింది. అలాగే హిందీ చిత్రాల్లోనూ నటించింది.

ప్రేమ పెళ్లి.. సీక్రెట్‌గా తల్లైంది

ప్రేమ పెళ్లి.. సీక్రెట్‌గా తల్లైంది

వరుస పెట్టి సినిమాల మీద సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా గడుపుతోన్న సమయంలోనే శ్రీయ శరణ్.. ఆండ్రీ అనే వ్యాపారవేత్తతో డేటింగ్ చేసింది. ఇలా చాలా కాలం పాటు అతడితో ప్రేమాయణం సాగించిన తర్వాత.. అంటే 2018లో వివాహం చేసుకుంది. అలాగే, మూడేళ్ల తర్వాత ఓ బిడ్డకు తల్లినయ్యానని ప్రకటించి అందరినీ ఆశ్చర్య పరిచేసింది. దీంతో ఈమె హైలైట్ అయిపోయింది.

అక్కడ మాత్రం ఎప్పుడూ బిజీ

అక్కడ మాత్రం ఎప్పుడూ బిజీ

అప్పట్లో శ్రీయ శరణ్ వరుస పెట్టి సినిమాలు చేస్తూ వచ్చింది. కానీ, ఈ మధ్య కాలంలో ఆమె పెద్దగా ప్రాజెక్టులను అందుకోలేకపోతోంది. అయినప్పటికీ ఈ సుందరాంగి సోషల్ మీడియాలో మాత్రం యమ యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే తనకు తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో అంశాలను ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది. అలాగే, ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తూ సందడి చేస్తోంది.

అందాలను ఆరబోస్తోన్న శ్రీయ

అందాలను ఆరబోస్తోన్న శ్రీయ

సోషల్ మీడియాలో సుదీర్ఘ కాలంగా హడావిడి చేస్తోన్న శ్రీయ శరణ్.. ఈ మధ్య ఎక్కువగా అందాలను ఆరబోస్తూ ట్రీట్ ఇస్తోంది. ఇందులో భాగంగానే తన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను తరచూ షేర్ చేస్తోంది. అలాగే భర్తతో ఎంజాయ్ చేస్తోన్న పిక్‌లను కూడా వదులుతోంది. వీటిలో లిప్ లాక్‌ల ఫొటోలు కూడా ఉంటున్నాయి. ఇలా ఈ మధ్య కాలంలో ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది.

బాత్రూంలో బికినీతో ఫోజులు

బాత్రూంలో బికినీతో ఫోజులు

గతంతో పోల్చుకుంటే శ్రీయ శరణ్ ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో మరింతగా రెచ్చిపోతోంది. ఇందులో భాగంగానే తాజాగా ఆమె బాత్రూంలో బికినీతో దిగిన ఓ హాట్ ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో షేర్ చేసింది. దీనితో పాటు మరికొన్ని హాట్ హాట్ పిక్‌లను కూడా షేర్ చేసింది. దీంతో ఈ ఫొటోలు అన్నింటికీ భారీ రెస్పాన్స్ దక్కుతోంది. ఫలితంగా ఇవన్నీ వైరల్ అయ్యాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X