For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  20 years of Shriya Saran..అక్కినేని నాగేశ్వరరావు నాకు స్పూర్తి.. తుదిశ్వాస వరకు నటిస్తా.. శ్రీయసరన్ ఎమోషనల్

  |

  ఇష్టం సినిమాతో టాలీవుడ్‌లోకి ప్రవేశించిన హీరోయిన్ శ్రీయ సరన్ పరిశ్రమలో 20 ఏళ్లు పూర్తి చేసుకొన్నారు. గమనం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న నేపథ్యంలో తన అనుభవాలు, మధురానుభూతులను పంచుకొన్నారు. గమనం సినిమా గురించి తన కెరీర్‌ గురించిన విషయాలను, తన వ్యక్తిగత, ప్రోఫెషన్ విషయాలను పంచుకొంటూ ఫిల్మీబీట్ తెలుగుతో మాట్లాడారు. శ్రీయ సరన్ చెప్పిన విషయాలు ఏమిటంటే..

   సాధారణ కుటుంబ నుంచి

  సాధారణ కుటుంబ నుంచి

  సినీ పరిశ్రమలో 20 ఏళ్లు పూర్తి చేసుకోవడం నిజంగా దేవుడు ఇచ్చిన వరంగా భావిస్తాను. పక్కింటి అమ్మాయిగా ఇప్పటికి గుర్తింపు ఉంది. సాధారణమైన కుటుంబం నుంచి వచ్చాను. నా తల్లిదండ్రలు మంచి విలువలతో పెంచారు. మా అమ్మ కెమిస్ట్రీ టీచర్, నాన్న బీహెచ్ఈఎల్ ఉద్యోగి. చిన్న కుటుంబం నుంచి పెద్ద ఆశలతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టాను. ఇష్టం అనే సినిమాతో నేను నా కెరీర్ ఆరంభించాను. నన్ను ఆదరించిన ప్రేక్షకులకు జీవితాంతం రుణపడి ఉంటాను. మ్యాజిక్ చేసే పవర్‌ను అందించిన భగవంతుడిని విశ్వసిస్తాను. నా కెరీర్ పట్ల నేను చాలా సంతృప్తిగా ఉన్నాను అని శ్రీయ సరన్ చెప్పారు.

   మరో 20 ఏళ్లు ఇండస్ట్రీలోనే ఉండాలని

  మరో 20 ఏళ్లు ఇండస్ట్రీలోనే ఉండాలని

  20 ఏళ్ల తర్వాత నా కెరీర్ చూసుకొంటే.. నేను ఇప్పటికీ కొత్తగా వచ్చిన నటిగా, హీరోయిన్‌గా ఫీల్ అవుతుంటాను. మరో ఇరువై ఏళ్లు ఇండస్ట్రీలో ఉండాలని కోరుకొంటున్నాను. 20 ఏళ్లపాటు సుదీర్ఘమైన కెరీర్‌ను ఇచ్చిన భగవంతుడికి నేను ధన్యవాదాలు తెలియజేసుకొంటాను. డిఫరెంట్ సినిమాలను, విభిన్నమైన పాత్రలను చేయాలని ఇప్పటికీ తపన చెందుతాను. ఎన్ని సినిమాలు చేశామనే విషయం పక్కన పెడితే ప్రేక్షకులను ఎలా మెప్పించామనే విషయాన్ని నేను బేరీజు వేసుకొంటాను అని శ్రీయ అన్నారు.

  కోవిడ్ సమయంలో సినిమాకు మరింత చేరువగా

  కోవిడ్ సమయంలో సినిమాకు మరింత చేరువగా

  ప్రపంచమంతా కోవిడ్ కోరల్లో బందీ అయిన సమయంలో నేను, నా భర్తతో కలిసి బార్సిలోనాలో ఉన్నాం. ఆ సమయంలో ఎక్కువగా సినిమాతో అనుబంధం పెరిగింది. రకరకాల సినిమాలను చూడటం జరిగింది. దాని వల్ల నేను ఎంతో తెలుసుకొన్నాను. సినిమా ఎలా ప్రభావితం చేస్తుందనే విషయాన్ని గ్రహించాను. నేనే కాదు.. ప్రజలంతా సినిమాతో జీవితాన్ని కొనసాగించారనే విషయం తెలుసుకొని హ్యాపీగా ఫీలయ్యాను. ఇలాంటి ఇండస్ట్రీలో సుదీర్ఘంగా కెరీర్‌ను కొనసాగించాలని కోరుకొంటున్నాను అని శ్రీయ చెప్పారు.

  ఏఎన్నాఆర్ స్పూర్తితో.. మనం షూటింగులో

  ఏఎన్నాఆర్ స్పూర్తితో.. మనం షూటింగులో

  సినిమా ఇండస్ట్రీలో ఎనో మధురానుభూతులు, భావోద్వేగాలను చూశాను. మనం సినిమా షూటింగులో ఏఎన్నాఆర్‌పై చిత్రీకరించిన చివరి సీన్‌లో నేను ఉన్నందుకు గర్వంగా ఫీలవుతాను. ఆరోగ్యం క్షీణించిన సమయంలో ఆయన అంకితభావంతో షూటింగ్ సిద్దమయ్యారు. అలాంటి పరిస్థితుల్లో నాగార్జున సార్ చాలా ఆందోళనతోపాటు మేము టెన్షన్ గురయ్యాం. తుది శ్వాస వరకు నేను నటిస్తా.. ఇలా నటిస్తూ చనిపోయినా నాకు సంతోషంగానే ఉంటుంది అని చెప్పిన మాటలు నా గుండెను పిండేశాయి. ఆ మాటలు నాకు స్పూర్తిగా నిలిచాయి. నేను కూడా జీవితం చివరి క్షణాల వరకు నటిస్తూనే ఉంటాను అని శ్రీయ ఎమోషనల్ అయ్యారు.

  టెన్షన్ పడుతున్న సమయంలో గమనం

  టెన్షన్ పడుతున్న సమయంలో గమనం

  గత ఐదేళ్లలో నా కెరీర్ పట్ల ఓ రకమైన టెన్షన్‌తో ఉన్నాను. నేను సరిగా సినిమాలను ఎంచుకొంటున్నానా? నేను సరైన మార్గంలో ప్రయాణిస్తున్నానా అనే విషయాలను నన్ను వెంటాడాయి. అయితే మనం లాంటి సినిమాలు చేసిన తర్వాత.. అలాగే రజనీకాంత్, చిరంజీవి సార్‌తో నటించాను. ఇంటికి దూరంగా ఉంటూ నేను నటించిన సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకొన్నాయి. ఇలాంటి పరిస్థితుల తర్వాత అలాంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదనిపించింది. మంచి చిత్రాలు చేయాలని నిర్ణయించుకొన్న సమయంలో గమనం సినిమాను దర్శకురాలు సుజనా రావు గమనం సినిమా కథ చెప్పారు. సినిమా కథ చెప్పిన తర్వాత నా కళ్లలో నీళ్లు తిరిగాయి. బలమైన కథ, కథనాలు ఉన్న సినిమాలో భాగమైనందుకు చాలా సంతోషంగా ఉంది.

  మహిళా దర్శకురాలితో పనిచేయడం వల్ల

  మహిళా దర్శకురాలితో పనిచేయడం వల్ల

  మహిళా దర్శకురాలితో పనిచేయడం ఇది మొదటిసారి కాదు. గతంలో బాలీవుడ్ దీప మెహతా, కన్నడలో మరో దర్శకురాలితో కలిసి పనిచేశాను. తెలుగులో మహిళా దర్శకురాలితో నటించడం మొదటిసారి. గతంలో సినిమా షూటింగ్ జరిగితే మహిళలు ఎక్కువగా కనిపించే వారు కాదు. నేను, నా మేకప్ మెన్ మాత్రమే ఉండేవాళ్లం. ఇప్పుడు సినిమా పరిశ్రమలో అనేక మార్పులు వచ్చాయి. కెమెరా ముందే కాకుండా కెమెరా వెనుకాల కూడా మహిళలు రాణిస్తున్నారు. మహిళలతో పనిచేయడం మన భావాలను, కష్టసుఖాలను షేర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కొన్ని సమయాల్లో పిరియడ్స్ (బహిష్టు) సమయంలో సమస్యలు చెప్పకోవడానికి అవకాశం ఉండేది కాదు. కానీ మహిళా దర్శకులు ఉంటే అలాంటి సమస్యలను చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. నేను గొప్ప గొప్ప దర్శకులతో కూడా పనిచేశాను. పురుషులంటే నాకు గౌరవం ఉంది అని శ్రీయ చెప్పారు.

  'Aranya' Movie Motion Poster Released
   గమనం సినిమా ఓ ఎమోషన్

  గమనం సినిమా ఓ ఎమోషన్

  సినిమా పరిశ్రమలో అనేక మార్పులు వస్తున్నాయి. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్ వరకు.. దూరదర్శన్ టెలివిజన్ నుంచి ఓటీటీ వరకు వచ్చాయి. హీరోయిన్ ఓరియెంట్ సినిమాలు అంటే.. మహిళా టెక్నిషియన్స్ ఎక్కువ మంది కనిపిస్తున్నారు. ఇలాంటి విషయాలు నాకు మార్పుగా కనిపిస్తున్నాయి. గమనం సినిమాను సుజనారావు చక్కగా తెరకెక్కించారు. ఈ సినిమా గొప్పగా వచ్చిందనే సంతోషంలో ఉన్నాం. గమనం సినిమా ఓ ఎమోషన్ అని శ్రీయ సరన్ తెలిపారు.

  English summary
  Shriya Saran finishes 20 years in film Industry. She is coming with Gamanam movie which is directed by Sujana Rao. This is set to release on December 20th. In this occassion, She speaks to Filmibeat.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X