For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Mrunal Thakur: ఆత్మహత్య చేసుకోవాలనుకున్న సీతారామం హీరోయిన్.. సీత పడ్డ కష్టాలెన్నో..

  |

  సీతారామం మూవీ ఎంత పెద్ద క్లాసిక్ హిట్ గా నిలిచిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. హను రాఘవపూడి దర్శకత్వం వహించిన ఈ మూవీలో రామ్ గా దుల్కర్ సల్మాన్, సీతగా బాలీవుడ్ బ్యూటిఫుల్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ నటించారు. అందమైన దృశ్యకావ్యంగా వచ్చిన ఈ సినిమాకు ప్రేక్షకలు బ్రహ్మరథం పట్టారు. ముఖ్యంగా సీతగా అలరించిన మృణాల్ ఠాకూర్ కు బీభత్సమైన ఫాలోయింగ్ పెరిగింది. ప్రస్తుతం సీతగా మృణాల్ ఠాకూర్ ను తప్ప ఇంకో వేరే హీరోయిన్ ను ఊహించుకోలేకపోతుంది యూత్. అయితే మృణాల్ ఈ స్టెజ్ కి రావడానికి ఎంతో కష్టపడిందట. మొదట్లో ఆత్మహత్య కూడా చేసుకోవాలనుకుందట ఈ సీత.

  బాలీవుడ్ లో సూపర్ 30, జెర్సీ వంటి కంటెంట్ ఉన్న చిత్రాలతో ఎంతగానో అలరించింది బ్యూటిఫుల్ మృణాల్ ఠాకూర్. అక్కడ ఆమె నటనతో విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుంది. ఇక తెలుగులో వచ్చిన సీతారామం సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అందులో కూడా మృణాల్ ఠాకూర్ నటనకు టాలీవుడ్ ప్రేక్షకులు ఫిదా అయ్యారు. సినిమాలోని సీత పాత్రకు బాగా కనెక్ట్ అయింది యువత.

  ఈ సీతకు కూడా అన్ని కష్టాలు

  ఈ సీతకు కూడా అన్ని కష్టాలు

  అయితే రామాయణంలో సీతకు ఎన్ని కష్టాలు ఉన్నాయో మన సీతారామం సీత కూడా అన్ని కష్టాలు ఎదుర్కుందట. ఈ పేరు రావడానికి చాలా ఒడిదొడుకులను అధిగమించినట్లు చెప్పుకొచ్చింది మృణాల్ ఠాకూర్. ఆడిషన్స్ కోసం వెళ్లిన మృణాల్ ఠాకూర్ కు ప్రతిసారి అక్కడ అసలు నువ్ హీరోయిన్ గా ఎలా పనికొస్తావ్.. సీరియళ్లలో నటించేవాళ్లు సినిమాలకు పనికి రారు అనే మాటలు వినపడేవట.

  11 స్కూళ్లు మారాను..

  11 స్కూళ్లు మారాను..

  ''నేను పుట్టి పెరిగింది మహారాష్ట్రలోని ధులెలో. నాన్నది బ్యాంక్ జాబ్ కావడంతో తరచూ బదిలీ అయ్యేది. దీంతో ఇంటర్ అయ్యేలోపు 11 స్కూళ్లు మారాను. అందుకే నాకు స్కూలు ఫ్రెండ్స్ ఎక్కవ ఉండేవారు కాదు. ఎనిమిదో తరగతిలో నాన్నకు ముంబై బదిలీ కావడంతో అక్కడి స్కూళ్లో చేర్పించారు. అప్పటివరకు గ్రామీణ ప్రాంతాల్లో చదువుకున్న నాకు ఇంగ్లీష్ సరిగా రాలేదు. దీంతో తోటి విద్యార్థులు నాకు ఇంగ్లీష్ రాదని ఏడిపించారు.

  టీచర్లంతా పొగిడేవారు..

  టీచర్లంతా పొగిడేవారు..

  దీంతో పట్టుదలతో రోజూ ఇంగ్లీష్ న్యూస్ పేపర్ చదివేదాన్ని. కెనడా సింగర్ జస్టిన్ బైబర్ సాంగ్స్ వింటూ చరణాల్ని రాసుకుని ప్రాక్టీస్ చేసేదాన్ని. అలా 3 నెలల తర్వాత ఇంగ్లీష్ లో అనర్గళంగా మాట్లాడుతుంటే అందరు షాక్ అయ్యారు. అలాగే క్లాస్ లో ఫస్ట్ మార్కులు తెచ్చుకోవడంతో టీచర్లంతా పొగిడేవారు. ఇంటర్ తర్వాత డెంటిస్ట్ అవుదామనిపించి బీడీఎస్ చేద్దామని ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసా. మంచి ర్యాంక్ తెచ్చుకున్నా. దానికే మా తల్లిదండ్రులు నేను డాక్టర్ అయినంతా సంతోషించారు.

  మీడియాలో చేరదామనుకున్నా..

  మీడియాలో చేరదామనుకున్నా..

  కానీ కొన్నిరోజులకు మీడియాలో చేరదామనుకున్నా. అమ్మానాన్న వద్దన్నారు. దీంతో ఒకరోజు నాన్నకు 3 ఇడియట్స్ మూవీ చూపించా. నచ్చిన పని చేయాలనే ఆ మూవీ ఇచ్చిన సందేశంతో నాన్న ఒప్పుకున్నారు. దీంతో బ్యాచిలర్స్ ఇన్ మాస్ మీడియాలో (బీఎమ్ఎమ్) చేరా. అయితే నాన్న తన స్నేహితులకు నా చదువు గురించి చెబితే వాళ్లు అదేం కోర్సు.. ఎప్పుడు వినలేదే.. అన్నప్పుడు మాత్రం ఆయన చాలా బాధపడేవారు.

  ఒకవైపు ఒంటరితనం, మరోవైపు..

  ఒకవైపు ఒంటరితనం, మరోవైపు..

  కొన్నాళ్లకు నాన్నుక మరో ప్రాంతానికి బదిలీ కావడంతో నేను ముంబైలో ఉండాల్సివచ్చింది. అప్పుడు ఒకవైపు ఒంటరితనం, మరోవైపు నాన్నను బాధపెడుతున్నానన్న భావనతో చదువుపై దృష్టి పెట్టలేకపోయేదాన్ని. మీడియా రంగం కూడా నాకు కరెక్ట్ కాదని కొంతకాలానికి అనిపించింది. ఇన్ని ఆలోచనలతో డిప్రెషన్ లోకి వెళ్లా. కొన్నిసార్లు ఆత్మహత్య చేసుకోవాలనిపించేది. లోకల్ ట్రైన్ లో రద్దీగా ఉండేది. సీట్లు దొరక్కపోయేవి.

  అప్పుడు ఆ ట్రైన్ లో నుంచి..

  అప్పుడు ఆ ట్రైన్ లో నుంచి..

  దీంతో డోర్ దగ్గర నిలుచునేదాన్ని. అప్పుడు ఆ ట్రైన్ లో నుంచి దూకేయాలనిపించేది. అలా చేస్తే అమ్మానాన్నలు తట్టుకోలేరని అనిపించి క్రమక్రమంగా ఆ సమస్య నుంచి బయటపడ్డా. అప్పుడే ఫ్రెండ్స్ ఆలోచనతో సినిమాల్లోకి వెళ్లాలనిపించింది. బాలీవుడ్ హీరోయిన్ ప్రీతిజింతాలా నేను మోడలింగ్ ద్వారా సినిమాల్లో అవకాశాలు పొందాలనుకున్నా.చదువుకుంటూనే మోడలింగ్ వైపు వచ్చా.

  సినిమాలకు పనికి రారు..

  సినిమాలకు పనికి రారు..

  ఓ షోలో నన్ను చూసిన దర్శకొడుకొరు 2012లో ముఝే కుఛ్ కెహ్ తీ హై ఖా మోషియా అనే సీరియల్ లో అవకాశమిచ్చారు. ఆ తర్వాత సినిమాల కోసం ప్రయత్నిస్తు ఆడిషన్స్ కోసం వెళ్లే దాన్ని. కానీ అక్కడ ప్రతిసారి అసలు నువ్ హీరోయిన్ గా ఎలా పనికొస్తావ్.. సీరియళ్లలో నటించేవాళ్లు సినిమాలకు పనికి రారు అని అనేవారు'' అని తన జీవితంలోని సంఘటనలు చెప్పుకొచ్చింది సీతారామం సీత మృణాల్ ఠాకూర్.

  English summary
  Sita Ramam Heroine Mrunal Thakur Opens Up About Her Suicidal Thoughts
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X