Just In
Don't Miss!
- News
ద్వివేది, శంకర్‌పై బదిలీ వేటు.. 90 శాతం సర్పంచ్ సీట్లు గెలుస్తాం: పెద్ది రెడ్డి ధీమా
- Finance
రూ.50వేలకు దిగువనే బంగారం ధరలు, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే
- Lifestyle
Republic Day 2021 : పరేడ్ లో పురుషుల కవాతుకు నాయకత్వం వహించిన ఫస్ట్ లేడో ఎవరంటే...
- Sports
World Test Championship ఫైనల్ వాయిదా!!
- Automobiles
ఆటోమేటిక్ టెయిల్‌గేట్ కలిగి ఉన్న భారతదేశపు మొట్టమొదటి హ్యుందాయ్ క్రెటా, ఇదే
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
సోనమ్ కపూర్‌కు చేదు అనుభవం.. ఉబెర్ క్యాబ్‌లో డ్రైవర్ దారుణంగా..
బాలీవుడ్ నటి సోనమ్ కపూర్‌కు లండన్‌లో చేదు అనుభవం ఎదురైంది. క్యాబ్ డ్రైవర్ కారణంగా దారుణమైన పరిస్థితిని ఎదుర్కొన్నానని ఆమె సోషల్ మీడియాలో వివరించారు. ఉబెర్ డ్రైవర్‌తో తనతో అనుచితంగా ప్రవర్తించారని.. మీరు క్యాబ్ డ్రైవర్లతో జాగ్రత్తగా ఉండాలని మహిళలను హెచ్చరించింది. క్యాబ్ డ్రైవర్ వల్ల ఎలాంటి చేదు అనుభవాన్ని సోనమ్ ఎదుర్కొన్నారంటే..
|
క్యాబ్‌లో భయంకరమైన అనుభవం
లండన్‌లో ఎదురైన దారుణమైన పరిస్థితిని ట్విట్టర్‌లో సోనమ్ కపూర్ వెల్లడించారు. లండన్‌లో ఉబర్ క్యాబ్‌లో నాకు భయంకరమైన అనుభవం ఎదురైంది. దయచేసి మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. ఎలాంటి ఇబ్బంది లేని, సురక్షితమైన ప్రజా రవాణా సౌకర్యాన్ని లేదా క్యాబ్ సర్వీస్‌ను ఎంచుకొండి. ఈ రోజు నాకు కారులో ఎదురైన సంఘటనతో వణికిపోయాను అని సోనమ్ కపూర్ ట్వీట్‌లో పేర్కొన్నారు.

డ్రైవర్ మానసిక పరిస్థితి
ట్విట్టర్‌లో పెట్టిన పోస్టుపై ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ.. డ్రైవర్ మానసిక పరిస్థితి సరిగా లేదు. గట్టిగా అరుస్తూ.. పెడబొబ్బలు పెట్టాడు. ఆ ప్రయాణమంతా నాకు నరకంగా మారింది. ఎప్పుడు ఏం జరుగుతుందోననే భయంతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకొన్నాను అని సోనమ్ కపూర్ పేర్కొన్నారు.

సోనమ్ ట్వీట్‌పై ఉబెర్ స్పందన
సోనమ్ కపూర్ ట్వీట్‌కు ఉబెర్ కంపెనీ నిర్వాహకులు స్పందించారు. ప్రయాణంలో మీకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నాం. దయచేసి మీ వివరాలు మాకు పంపండి. లేదా మీ ఈ మెయిల్ లేదా మొబైల్ నంబర్ పంపిస్తే మేము మీకు సహయం అందించడానికి ప్రయత్నిస్తాం. మీకు కలిగిన అసౌకర్యానికి సారీ అంటూ ఓ సందేశాన్ని పంపారు.

మీ యాప్ పనిచేయలేదు
ఉబెర్ డ్రైవర్ వల్ల ఎదురైన పరిస్థితి గురించి యాప్ ద్వారా ఫిర్యాదు చేయడానికి ప్రయత్నించాను. కానీ యాప్ సరిగా పనిచేయకపోవడం వల్ల నేను ఫిర్యాదు చేయలేదు. మీ యాప్‌ను.. మీ సాంకేతిక వ్యవస్థను సరిగా ఉండేలా చూసుకోండి. నాకు జరిగిన డామేజ్ జరిగిపోయింది. దానికి మీరు ఏమీ చేయలేరు అంటూ సోనమ్ బదులిచ్చింది.

వరుసగా చేదు అనుభవాలు
ఇటీవల కాలంలో సోనమ్ కపూర్‌కు వరుసగా చేదు అనుభవాలు ఎదురువుతున్నాయి. ఇటీవల ప్రయాణంలో తన బ్యాగులు, లగేజ్ మిస్ కావడం జరిగింది. ఇలా జరిగిన కొద్ది రోజులకే డ్రైవర్ రూపంలో భయంకరమైన అనుభవాన్ని ఎదుర్కోవడం జరిగింది. సెలబ్రిటీ సోనమ్‌కే ఇలాంటి పరిస్థితి ఉంటే.. సామాన్య మహిళల పరిస్థితి ఏమిటనే విషయం చర్చనీయాంశమైంది.

13 మిలియన్ల మంది ఫాలోవర్స్‌తో
బాలీవుడ్ అందాల నటి సోనమ్ కపూర్‌కు ట్విట్టర్‌లో దాదాపు 13 మిలియన్ల మంది ఫాలోవర్స్ ఉన్నారు. రెగ్యులర్‌గా తనకు సంబంధించిన విషయాలను సోషల్ మీడియా ద్వారా పంచుకొంటారు. బ్రిటన్‌కు చెందిన పారిశ్రామిక వేత్త ఆనంద్ అహుజాను వివాహం చేసుకొన్న సోనమ్ కపూర్ ఇటీవల కాలంలో లండన్, ముంబై మధ్య ప్రయాణం చేస్తూ దాంపత్య జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నది.